...
...
Next Story

తెలంగాణ : ఎంబీబీఎస్, బీడీఎస్‌ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు

రాష్ట్రంలోని మెడికల్, డెంటల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ ఇవాళ్టి (జూలై 16) నుంచి ప్రారంభమవుతుంది.

Published on: Jul 16, 2025, 11:02:53 IST
By , , Telangana, Warangal
Prefer HTon Google
Advertisement

రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా కన్వీనర్‌ కోటా కింద ఎంబీబీఎస్, బీడీఎస్‌(2025-26) ప్రవేశాల కోసం కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్శిటీ మంగళవారం ప్రకటనను విడుదల చేసింది. నీట్‌లో అర్హత సాధించినవారికి మాత్రమే అవకాశం ఉంటుంది.

నేటి నుంచి రిజిస్ట్రేషన్లు…

కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం అడ్మిషన్ల నోటిఫికేషన్
కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయం అడ్మిషన్ల నోటిఫికేషన్

కన్వీనర్‌ కోటా సీట్ల కోసం విద్యార్థులు ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇందుకు జూలై 25వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. సాయంత్రం 6 గంటల వరకు వర్సిటీ వెబ్‌సైట్‌లో వివరాలను రిజిస్టర్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలతో పాటు ప్రైవేట్, మైనారిటీ, నాన్‌ మైనారిటీ మెడికల్, డెంటల్‌ కాలేజీలలోని కాంపిటెంట్‌ అథారిటీ కోటా కింద ఉన్న సీట్లకు మాత్రమే ఈ నోటిఫికేషన్వర్తిస్తుంది. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 35 ప్రభుత్వ, 26 ప్రైవేటు మెడికల్‌ కాలేజీలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో 85 శాతం, ప్రైవేటు కాలేజీల్లో 50 శాతం సీట్లను భర్తీ చేస్తారు.

నీట్పరీక్షలో ఓసీలు 50 శాతం, బీసీ, ఎస్సీ, ఎస్టీలు 40 శాతం, పీడబ్ల్యూడీలు 45 శాతం మార్కులు సాధించటం తప్పనిసరి. 2025 డిసెంబర్‌ 31 నాటికి కనీస వయస్సు 17 ఏళ్లు ఉండాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వీరు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు కింద ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.4,000 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీలకు రూ.3,200గా నిర్ణయించారు.

ఇక అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ సమయంలో లోకల్, క్యాస్ట్ ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా పీడీఎఫ్ రూపంలో అప్‌లోడ్‌ ( https://tsmedadm.tsche.in ) చేయాల్సి ఉంటుంది. ఈ నెల 25లోపు ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. సర్టిఫికెట్‌ పరిశీలన అనంతరం రాష్ట్ర విద్యార్థుల జాబితాతో మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేస్తారు. వెబ్‌ ఆప్షన్ల వివరాలను త్వరలోనే ప్రకటిస్తారు.

కావాల్సిన సర్టిఫికెట్లు…

  • నీట్ ర్యాంక్ కార్డు (2025)
  • టెన్త్ మెమో
  • ఇంటర్ మెమో
  • స్టడీ సర్టిఫికెట్లు - ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు
  • టీసీ
  • ఆదాయ ధ్రువీకరణపత్రం
  • కుల ధ్రువీకరణపత్రం
  • ఈడబ్యూఎస్ అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్
  • ఆధార్ కార్డ్
  • లేటెస్ట్ పాస్ ఫొటో
  • అభ్యర్థి సంతకం

ఈ లింక్ పై క్లిక్ చేసి బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks