నగరాల్లో పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా ఆటోమేటిక్ కార్లకు ఆదరణ విపరీతంగా పెరిగినప్పటికీ, ప్రీమియం ఆటోమేటిక్ ఆప్షన్లు కేవలం టాప్ ఎండ్ వేరియంట్లకే పరిమితం కావడం వల్ల చాలామంది కొనుగోలుదారులు ఎక్కువ బడ్జెట్ వెచ్చించాల్సి వస్తోంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ కియా ఇండియా తమ ‘కారెన్స్ క్లావిస్’ మోడల్‌లో తక్కువ ధరకే లభించే ఎంట్రీ లెవెల్ ‘హెచ్‌టీఈ’ ట్రిమ్‌లలో ఆటోమేటిక్ వేరియంట్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
బడ్జెట్ ధరలోనే ఆటోమేటిక్ సౌకర్యం..

కియా కారెన్స్ క్లావిస్ ఎంపీవీలో ఇప్పటివరకు కేవలం గరిష్ట ధర ఉన్న వేరియంట్లకే పరిమితమైన 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ డీసీటీ, 1.5-లీటర్ డీజిల్ ఆటోమేటిక్ (ఏటీ) గేర్‌బాక్స్‌లను ఇప్పుడు హెచ్‌టీఈ ఎక్స్‌ప్రెస్, ఆప్షనల్ ట్రిమ్‌లలో అందుబాటులోకి తీసుకువచ్చింది దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ.
కొత్తగా ప్రవేశపెట్టిన కారెన్స్ క్లావిస్ ఆటోమేటిక్ వేరియంట్ల ఎక్స్-షోరూమ్ ధరలు ఇలా ఉన్నాయి:
హెచ్‌టీఈ (ఓ) టర్బో-పెట్రోల్ డీసీటీ : రూ. 14.67 లక్షలు
హెచ్‌టీఈ (ఈఎక్స్) టర్బో-పెట్రోల్ డీసీటీ : రూ. 15.22 లక్షలు
హెచ్‌టీఈ (ఓ) డీజిల్ ఆటోమేటిక్ (6ఏటీ): రూ. 15.82 లక్షలు
ఇంజిన్ సామర్థ్యం, ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లు..
కియా కారెన్స్ క్లావిస్‌లోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌కు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ (డీసీటీ) గేర్‌బాక్స్‌ను జత చేశారు. ఇది తక్షణ పవర్ డెలివరీతో పాటు సునాయాసమైన డ్రైవింగ్ అనుభూతిని ఇస్తుంది. ఇక డీజిల్ వేరియంట్లలో 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్‌కు 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించారు. ఇవి కాకుండా ఈ ఫ్యామిలీ ఎంపీవీ 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు మాన్యువల్, ఐఎంటీ ఆప్షన్లలోనూ విక్రయాల్లో ఉంది.
తాజా 'ఆటోమేటిక్ ప్యాక్' ఫీచర్లు..
తక్కువ ధర వేరియంట్లే అయినప్పటికీ, ఆటోమేటిక్ మోడళ్లను ఎంచుకునే కస్టమర్ల కోసం కియా ప్రత్యేకంగా ‘ఆటోమేటిక్ ప్యాక్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాక్ ద్వారా ఎంట్రీ లెవెల్ మోడళ్లలో కూడా ప్రీమియం సౌకర్యాలు లభిస్తాయి:
- మోషన్ సెన్సార్‌తో కూడిన స్మార్ట్ కీ
- పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్
- విభిన్న డ్రైవింగ్ మోడ్స్
- ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఈపీబీ)
- రిమోట్ ద్వారా ఇంజిన్ స్టార్ట్ చేసే వెసులుబాటు
భారతీయ కుటుంబాలకు తగిన ఫ్యామిలీ ఎంపీవీ!
{{/usCountry}}తక్కువ ధర వేరియంట్లే అయినప్పటికీ, ఆటోమేటిక్ మోడళ్లను ఎంచుకునే కస్టమర్ల కోసం కియా ప్రత్యేకంగా ‘ఆటోమేటిక్ ప్యాక్’ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాక్ ద్వారా ఎంట్రీ లెవెల్ మోడళ్లలో కూడా ప్రీమియం సౌకర్యాలు లభిస్తాయి:
- మోషన్ సెన్సార్‌తో కూడిన స్మార్ట్ కీ
- పుష్-బటన్ స్టార్ట్/స్టాప్ సిస్టమ్
- విభిన్న డ్రైవింగ్ మోడ్స్
- ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ (ఈపీబీ)
- రిమోట్ ద్వారా ఇంజిన్ స్టార్ట్ చేసే వెసులుబాటు
భారతీయ కుటుంబాలకు తగిన ఫ్యామిలీ ఎంపీవీ!
{{/usCountry}}పాత కారెన్స్ మోడల్ స్థానంలో మరింత ఆధునిక మార్పులతో వచ్చిన కారెన్స్ క్లావిస్.. భారత మార్కెట్లో 6, 7-సీటర్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులో ఉంది. 4,550 ఎంఎం పొడవు, 2,780 ఎంఎం వీల్‌బేస్‌తో విశాలమైన క్యాబిన్ సౌకర్యాన్ని అందిస్తుంది.
తక్కువ ధరలోనే ఆటోమేటిక్ ఆప్షన్లు లభ్యం కావడంతో, సుదీర్ఘ ప్రయాణాల్లో హాయిగా డ్రైవ్ చేయాలనుకునే మధ్యతరగతి ఫ్యామిలీలకు ఇది ఒక ఉత్తమ ఎంపికగా మారనుంది.
కియా కారెన్స్ క్లావిస్ ఈవీపై బిగ్ అప్డేట్..
భారత ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) వినియోగం వేగంగా పుంజుకుంటున్నప్పటికీ, కస్టమర్లను ప్రధానంగా వేధించే ప్రశ్న 'బ్యాటరీ లైఫ్, దాని మార్పిడి వ్యయం'. ఈ ఆందోళనకు తెరదించుతూ కియా ఇండియా ఒక కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఫ్యామిలీ ఎలక్ట్రిక్ ఎంపీవీ ‘కారెన్స్ క్లావిస్ ఈవీ’ కోసం 15 ఏళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ల హై-వోల్టేజ్ బ్యాటరీ వారంటీ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తెచ్చింది!
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.