ఆటోమొబైల్ దిగ్గజం 'కియా ఇండియా' తమ కస్టమర్ల కోసం ఒక సంచలన స్కీమ్‌ని అందుబాటులోకి తెచ్చింది. వాహనదారులకు రీసేల్ వ్యాల్యూపై స్పష్టమైన భరోసా కల్పిస్తూ.. తమ ‘అస్యూర్డ్ బైబ్యాక్ ప్రోగ్రామ్’ను సరికొత్తగా విస్తరించింది. ఇకపై పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు హైబ్రిడ్, ఎలక్ట్రిక్ (ఈవీ) వాహనాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది.
రీసేల్ వ్యాల్యూపై ఊహించని భరోసా..!

కొత్త కారు కొనేటప్పుడు దానికి భవిష్యత్తులో లభించే రీసేల్ వ్యాల్యూ గురించి ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విషయంలో బ్యాటరీ లైఫ్, రీసేల్ ధరపై కస్టమర్లలో అనేక సందేహాలు ఉంటాయి. వీటిని పటాపంచలు చేస్తూ కియా ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ఎక్స్‌ప్యాండెడ్ స్కీమ్ కింద పెట్రోల్, డీజిల్, సీఎన్జీ వాహనాలు కొనుగోలు చేసేవారికి 3 ఏళ్ల యాజమాన్య వ్యవధి తర్వాత కారు ధరలో 75 శాతం వరకు గ్యారెంటీ బైబ్యాక్ లభిస్తుంది. అదే సమయంలో, ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసే వినియోగదారులకు 3 ఏళ్ల తర్వాత 70 శాతం వరకు గ్యారెంటీ రీసేల్ వ్యాల్యూను కియా ఆఫర్ చేస్తోంది. దీనివల్ల కస్టమర్లు ఎటువంటి ఆర్థిక నష్టం లేకుండా తమ పాత కారును సులభంగా వేరొక మోడల్‌కు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.
ఏ మోడళ్లకు ఈ ఆఫర్ వర్తిస్తుంది?
కియా ఇండియా విక్రయిస్తున్న దాదాపు అన్ని ప్రధాన మోడళ్లు ఈ ప్రోగ్రామ్ పరిధిలోకి వస్తాయి:
కార్ల మోడళ్లు: సోనెట్, సైరోస్, న్యూ సెల్టోస్, కారెన్స్, కారెన్స్ క్లావిస్, సోరెంటో.
పవర్‌ట్రెయిన్ ఎంపికలు: పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లకు ఇది వర్తిస్తుంది.
కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కాలపరిమితి, మైలేజ్ ప్లాన్లు..
{{/usCountry}}పవర్‌ట్రెయిన్ ఎంపికలు: పెట్రోల్, డీజిల్, సీఎన్జీ, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వెర్షన్లకు ఇది వర్తిస్తుంది.
కస్టమర్ల అవసరాలకు తగ్గట్లు కాలపరిమితి, మైలేజ్ ప్లాన్లు..
{{/usCountry}}వినియోగదారుల డ్రైవింగ్ అలవాట్లు, ప్రయాణ అవసరాలకు అనుగుణంగా విభిన్న కాలపరిమితులను సైతం కియా అందిస్తోంది:
ఐసీఈ వాహనాలకు: 3, 4 లేదా 5 సంవత్సరాల యాజమాన్య కాలపరిమితిని ఎంచుకోవచ్చు.
ఎలక్ట్రిక్ వాహనాలకు: 3 లేదా 4 సంవత్సరాల కాలపరిమితి అందుబాటులో ఉంది.
మైలేజ్ పరిమితులు: ఏడాదికి 10,000 కి.మీ, 15,000 కి.మీ లేదా 20,000 కిలోమీటర్ల మైలేజ్ లిమిట్ ప్లాన్లను ఎంచుకోవచ్చు. ఎంచుకున్న కాలపరిమితిలో మొత్తం వాడకం గరిష్టంగా 1,00,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు.
"కస్టమర్లకు పారదర్శకమైన ఆర్థిక భరోసా" - కియా ఇండియా
ఈ నయా బైబ్యాక్ పథకంపై కియా ఇండియా సేల్స్ అండ్ మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ సూద్ స్పందించారు.
"ఇండస్ట్రీలోనే అత్యుత్తమంగా ఐసీఈ కార్లపై 75 శాతం, ఈవీలపై 70 శాతం వరకు 3 ఏళ్ల రీసేల్ వ్యాల్యూ గ్యారెంటీ ఇస్తున్నాం. ఈ నిర్ణయం వల్ల కస్టమర్లకు తమ వాహనం భవిష్యత్ విలువపై ముందే స్పష్టత వస్తుంది. వాహనం కొనుగోలు చేసిన నాటి నుంచి తదుపరి అప్‌గ్రేడ్ అయ్యేంత వరకు కస్టమర్లతో బలమైన సంబంధాలను కొనసాగించడమే మా ప్రధాన లక్ష్యం," అని అతుల్ సూద్ పేర్కొన్నారు.
కారు కొనుగోలు చేసే సమయంలోనే అధీకృత కియా డీలర్‌షిప్‌లలో ఈ ప్లాన్‌లో చేరవచ్చు. కాలపరిమితి పూర్తయిన తర్వాత అగ్రిమెంట్ నిబంధనల ప్రకారం కస్టమర్లు ఈ బైబ్యాక్ ఆఫర్‌ను వినియోగించుకోవచ్చు.