Kia Sorento : ఆల్- వీల్ డ్రైవ్ ఫీచర్‌తో కియా సోరెంటో ఎస్‌యూవీ- లాంచ్ ఎప్పుడంటే..
Kia Sorento : కియా సోరెంటో ఎస్‌యూవీ సెప్టెంబర్ 4, 2026న విడుదల కానుంది. కాగా ఈ ఎస్‌యూవీకి సంబంధించి తాజాగా ఒక విషయం బయటకు వచ్చింది. భారత్‌లో ఏడబ్ల్యూడీ ఫీచర్‌తో రానున్న తొలి ఐసీఈ కియా మోడల్ ఇదే అవ్వనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
కియా ఇండియా తన సరికొత్త సోరెంటో ఎస్‌యూవీ లాంచ్ డేట్‌ను ఖరారు చేసిన విషయం తెలిసిందే. ఈ కారు సెప్టెంబర్ 4, 2026న మార్కెట్లోకి వస్తోంది. లాంచ్‌కు ముందు సోరెంటోకి సంబంధించిన ఒక కీలక విషయాన్ని కియా మోటార్స్ వెల్లడించింది. ఈ వాహనంలో ఆల్-వీల్ డ్రైవ్ (ఏడబ్ల్యూడీ) ఆప్షన్ ఇస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. భారత్‌లో కియా నుంచి వస్తున్న సాధారణ పెట్రోల్, డీజిల్ కార్లలో ఏడబ్ల్యూడీ ఫీచర్ కలిగిన తొలి మోడల్ ఇదే కావడం విశేషం. ప్రీమియం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కంపెనీ దూకుడుకు ఈ నిర్ణయం ఇది నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ నేపథ్యంలో కియా సోరెంటో ఎస్‌యూవీపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ చూసేయండి..
కియా సోరెంటో- ఇంజిన్, పవర్‌ట్రెయిన్ ఆప్షన్లు..
సోరెంటో ఎస్‌యూవీని స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ అలాగే డీజిల్ ఇంజిన్ ఆప్షన్లతో తీసుకురానున్నారు. భారత్-స్పెక్ మోడల్ అధికారిక వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే గ్లోబల్ వేరియంట్‌లో 1.6-లీటర్ టర్బో-పెట్రోల్ స్ట్రాంగ్-హైబ్రిడ్ సిస్టమ్‌ను అందించారు. ఇది సిక్స్-స్పీడ్ టార్క్-కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాగ్‌తో జతచేసి ఉంటుంది. "ఈ సెటప్ 238 హెచ్‌పీ పవర్‌ని, 380 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది," అని ఆటోమోటివ్ నిపుణులు పేర్కొన్నారు.
డీజిల్ వేరియంట్ విషయానికి వస్తే.. కియా కార్నివాల్‌లో ఉపయోగించిన 2.2-లీటర్ టర్బో-డీజిల్ ఇంజిన్‌ను ఇందులో వాడే అవకాశం ఉంది. ఇది 202 హెచ్‌పీ పవర్‌ని, 440 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది.
కియా సోరెంటో గ్లోబల్ మోడళ్లలో హైబ్రిడ్, డీజిల్ రెండింటిలోనూ ఏడబ్ల్యూడీ ఆప్షన్ అందుబాటులో ఉంది. అయితే భారత్‌లో ఈ రెండు ఇంజిన్లకు ఈ ఫీచర్ వర్తిస్తుందా? లేదా ఒక దానికే పరిమితం అవుతుందా? అనేది కియా త్వరలో వెల్లడించనుంది.
కియా సోరెంటో- లైవ్ జెన్ ఏఐ అసిస్టెంట్ ప్రత్యేకత
ఈ ఎస్‌యూవీలో 'లైవ్ జెన్ ఏఐ' అనే సరికొత్త వాయిస్ అసిస్టెంట్‌ను ఇస్తున్నట్లు కియా తెలిపింది. ప్రయాణంలో ఉన్నప్పుడు కారులోని ఏఐ ఏజెంట్‌తో ఎలాంటి అడ్డంకులు లేకుండా సులభంగా మాట్లాడవచ్చు. అలాగే వాయిస్ కమాండ్ల ద్వారా కారులోని పలు ఫీచర్లు, కంట్రోల్స్‌ను నియంత్రించే వెసులుబాటు ఉంటుంది. ప్రీమియం కార్లలో డిజిటల్ టెక్నాలజీకి మారుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని కంపెనీ ఈ ఫీచర్‌ను జోడించింది.
కియా సోరెంటో- ధర (అంచనా)..
భారత్‌లోనే ఈ కియా సోరెంటో ఎస్‌యూవీని పూర్తిగా స్థానికంగా తయారు చేస్తుండటంతో ధరను చాలా వరకు అదుపులో ఉండే అవకాశంఉంది.
"సోరెంటో ఎక్స్-షోరూమ్ ధర రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల మధ్య ఉండవచ్చు," అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తుండగా.. కొందరైతే వేరియంట్లను బట్టి ప్రారంభ ధర సుమారు రూ. 40 లక్షల వరకు చేరే అవకాశం ఉందని అంటున్నారు.
ఆల్-వీల్ డ్రైవ్ సదుపాయం ఉన్న ఫోక్స్‌వ్యాగన్ టెరాన్, స్కోడా కొడియాక్ వంటి మోడళ్లతో సోరెంటో గట్టి పోటీ పడనుంది. అలాగే ఇదే సెగ్మెంట్‌లో 4x4 ఆప్షన్‌తో లభించే జీప్ మెరిడియన్‌కు కూడా ఇది దీటైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


