MG Hector Hawk : జేఎస్‌డబ్ల్యూ ఎంజీ నుంచి హెక్టార్ హాక్- హైబ్రిడ్ ఎస్‌యూవీ లాంచ్, ఫీచర్లు, ధర..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ సంస్థ ఆగస్టు 26, 2026న తన కొత్త ఎస్‌యూవీ 'హెక్టార్ హాక్'ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఇంజిన్, అధునాతన ఫీచర్లు, 7-సీటర్ సామర్థ్యంతో రానున్న ఈ కారు విశేషాలు ఇక్కడ తెలుసుకోండి..
జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్.. భారతీయ మార్కెట్లోకి మరో సరికొత్త మోడల్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఆగస్టు 26, 2026న ఈ కొత్త కారు లాంచ్ అయ్యే అవకాశం ఉంది. దీనికి ‘హెక్టార్ హాక్’ అనే పేరు పెట్టే ఛాన్స్ ఉంది. ఇందులో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌ను అందించనున్నారు. ఫైనల్ పేరు, పూర్తి స్పెసిఫికేషన్లు లాంచ్ సమయంలోనే అధికారికంగా వెల్లడవుతాయి. కాగా ఈ హాక్ మోడల్ ఎంజీ బ్రాండ్‌కు ఉండే రగ్డ్ ఎస్‌యూవీ లుక్‌తో పాటు ఆధునిక ఎలక్ట్రిఫికేషన్ టెక్నాలజీని అద్భుతంగా మిళితం చేస్తుందని తెలుస్తోంది.

ఎంజీ హెక్టార్ హాక్ ఇంజిన్..
విదేశాలలో అమ్ముడవుతున్న వులింగ్ స్టార్‌లైట్ 560 ఆధారంగా ఈ కారును రూపొందించారు. ఎంజీకి చెందిన సరికొత్త ‘అడాప్ట్’ ఆర్కిటెక్చర్‌పై తయారవుతున్న తొలి ప్రొడక్షన్ మోడల్ ఇదే కానుంది. ఈ ఫ్లెక్సిబుల్ ప్లాట్‌ఫారమ్ పూర్తి స్థాయి ఈవీల నుంచి బలమైన హైబ్రిడ్ కార్లు, ప్లగ్-ఇన్ హైబ్రిడ్స్, రేంజ్-ఎక్స్‌టెండర్ పవర్‌ట్రెయిన్ల వరకు అన్నింటినీ తట్టుకునేలా అత్యంత సౌకర్యవంతంగా డిజైన్ చేయబడింది.
హెక్టార్ హాక్ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్‌లో 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్, 20.5 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చనున్నారు. విదేశీ స్పెసిఫికేషన్ల ప్రకారం దీని అవుట్‌పుట్ 197 హెచ్‌పీ పవర్, 230 ఎన్ఎం టార్గ్యూను ఇస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ మోడ్‌పై ఇది 125 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. అలాగే పెట్రోల్, బ్యాటరీ రెండు పవర్ సోర్స్‌లను ఉపయోగించినప్పుడు మొత్తం కలిపి దాదాపు 1,100 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుంది.
ఎంజీ హెక్టార్ హాక్: అంచనా ధర..
ఈ ఎంజీ హెక్టార్ హాక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 20 లక్షల నుంచి రూ. 27 లక్షల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా ఎంజీ తన 'బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్' (బీఏఏఎస్) ప్రోగ్రామ్‌ను దీనికి కూడా పరిచయం చేస్తుందా లేదా అనే అంశాలపై తుది ధర ఆధారపడి ఉంటుంది.
ఎంజీ హెక్టార్ హాక్: పోటీదారులు..
ఈ ఆల్-ఎలక్ట్రిక్ హాక్ మోడల్ మార్కెట్లో మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్తో పోటీ పడనుంది. అలాగే ఈ ఏడాది చివరిలో రానున్న మహీంద్రా ఎక్స్ఈవీ 7ఎక్స్‌ఓ, టాటా సఫారీ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ వెర్షన్ కార్లకు కూడా గట్టి పోటీ ఇవ్వనుంది.
ఎంజీ హెక్టార్ హాక్: డైమెన్షన్స్..
ఈ రాబోయే హెక్టార్ హాక్ కారు పొడవు 4,745 ఎంఎం, వెడల్పు 1,850 ఎంఎం, ఎత్తు 1,770 ఎంఎం ఉండగా.. వీల్‌బేస్ 2,810 ఎంఎంగా ఉంది. ఇది ప్రస్తుత హెక్టార్ ప్లస్ కంటే చాలా పెద్దదిగా ఉండనుంది. ఈ అదనపు పరిమాణం వల్ల ఎంజీ కుటుంబాల కోసం నిజమైన మూడు వరుసలలో 7-సీటర్ కాన్ఫిగరేషన్‌ను అందించడానికి వీలవుతుంది. ఈ ఎస్‌యూవీ కుటుంబాలకు ఎంతో ప్రాక్టికల్ ఛాయిస్‌గా నిలుస్తుంది.
ఎంజీ హెక్టార్ హాక్: డిజైన్..
ఎక్స్‌టీరియర్ పరంగా, ఈ హాక్ సాధారణ హెక్టార్‌కు భిన్నమైన డిజైన్ లాంగ్వేజ్‌ను కలిగి ఉంది. సన్నని డేటైమ్ రన్నింగ్ లైట్లు, దీర్ఘచతురస్రాకార హెడ్‌ల్యాంప్‌లు, చతురస్రాకార వీల్ ఆర్చ్‌లు,నిలువుగా ఉండే టైల్‌గేట్ దీని ప్రధాన ముఖ్యాంశాలు. ఇవన్నీ కలిసి ఈ కారుకు పటిష్టమైన. నిటారైన లుక్‌ను తెస్తాయి. మన దేశంలో టెస్టింగ్ సమయంలో కనిపించిన ప్రోటోటైప్‌లు వులింగ్ స్టార్‌లైట్ 560 లాగానే ఉన్నప్పటికీ, గ్రిల్, బంపర్లు, లైటింగ్ ఎలిమెంట్స్, బ్యాడ్జింగ్ విషయంలో భారత్ కస్టమర్లకు తగినట్లుగా ప్రత్యేక మార్పులతో ఎంజీ దీన్ని మార్కెట్లోకి తెస్తుందని భావిస్తున్నారు.
ఎంజీ హెక్టార్ హాక్: ఇంటీరియర్, ఫీచర్లు..
కారు లోపలికి వస్తే, ఇంటర్నేషనల్ వెర్షన్‌లో 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 12.8 అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్‌తో కూడిన మోడరన్ క్యాబిన్ లేఅవుట్ ఉంది. పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెనుక ఏసీ వెంట్స్, 360-డిగ్రీల కెమెరా, అడాస్ సూట్ వంటి ఫీచర్లు ఇందులో లభించే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


