Messi Live Updates: ప్రశాంతంగా ముగిసిన మెస్సి ఈవెంట్-ఊపిరి పీల్చుకున్న పోలీసులు

Dec 13, 2025, 20:56:49 IST

ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్ మెస్సీ ఇండియా టూర్ పై ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. కోల్‌క‌తా తర్వాత మెస్సీ హైదరాబాద్ చేరుకున్నాడు. ఉప్పల్ స్టేడియంలో మెస్సీతో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్‌ ఆడుతున్నారు. ఈ ఈవెంట్ లైవ్ అప్‌డేట్స్‌ ఇక్కడున్నాయి.

Summary

మెస్సీ.. మెస్సీ.. ఇప్పుడు ఈ నామజపంతో హైదరాబాద్ మార్మోగుతోంది. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా ఈ ఫుట్‌బాల్‌ లెజెండ్ హైదరాబాద్ వచ్చేశాడు. ఉప్పల్ స్టేడియంలో ఫుట్‌బాల్‌ ఆడుతున్నాడు.

స్టేడియంలో మెస్సీ (sonyliv)
స్టేడియంలో మెస్సీ (sonyliv)

తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సమ్మోహనపరిచే లెజండరీ ఫుట్‌బాల్‌ ప్లేయర్ లియోనెల్ మెస్సీ తెలుగు ఆడియన్స్ ను అలరించేందుకు వచ్చేశాడు. గోట్ ఇండియా టూర్ 2025లో భాగంగా మెస్సీ హైదరాబాద్ చేరుకున్నాడు.

Follow all the updates here:
  • 13 Dec 2025, 08:56:44 PM IST

    మెస్సి ఈవెంట్ సక్సెస్ ఫుల్

    శనివారం ఉదయం కోల్ కతాలో ఈవెంట్ లో రచ్చ తర్వాత హైదరాబాద్ లో మెస్సి టూర్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఈవెంట్ సక్సెస్ ఫుల్ అయింది.

  • 13 Dec 2025, 08:49:45 PM IST

    చాలా సంతోషంగా ఉందన్న మెస్సి

    హైదరాబాద్ కు రావడం చాలా సంతోషంగా ఉందన్న మెస్సి. ఈ ప్రేమ చూస్తే ఎంతో ఆనందమేస్తోందని పేర్కొన్నాడు.

  • 13 Dec 2025, 08:48:10 PM IST

    మెస్సి వెల్ కమ్

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మెస్సీకి వెల్ కమ్ చెప్పారు.

  • 13 Dec 2025, 08:45:50 PM IST

    రేవంత్ టీమ్ విన్నర్

    మెస్సి వర్సెస్ రేవంత్ టీమ్ మ్యాచ్ లో రేవంత్ టీమ్ విజేతగా నిలిచింది. ఈ టీమ్ కు మెస్సి ట్రోఫీ అందించాడు.

  • 13 Dec 2025, 08:39:06 PM IST

    మెస్సితో రేవంత్ మనవడు!

    మెస్సీతో రేవంత్ రెడ్డి మనవడు ఫుట్ బాల్ ఆడాడు. అది చూసి రేవంత్ మురిసిపోయాడు. ఆ తర్వాత మెస్సీతో ఫొటో కూడా దిగాడు.

  • 13 Dec 2025, 08:35:08 PM IST

    మెస్సి ట్రైనింగ్

    గ్రౌండ్ లో చిన్నారులకు మెస్సి ట్రైనింగ్ ఇస్తున్నాడు. బంతిని కిక్ చేస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు.

  • 13 Dec 2025, 08:22:32 PM IST

    ఆగిపోయిన స్ట్రీమింగ్

    ఉప్పల్ స్టేడియంలో మెస్సి ఈవెంట్ స్ట్రీమింగ్ టెక్నికల్ సమస్య కారణంగా కాసేపు ఆగిపోయింది. ఈ ఈవెంట్ ను సోనీ లివ్ స్ట్రీమింగ్ చేస్తోంది.

  • 13 Dec 2025, 08:19:21 PM IST

    స్టాండ్స్ లోకి మెస్సి కిక్

    స్టాండ్స్ లో ఉన్న ఫ్యాన్స్ కోసం మెస్సి బాల్స్ కిక్ చేశాడు. ఆ బంతులను అందుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.

  • 13 Dec 2025, 08:14:05 PM IST

    మెస్సి ఎంట్రీ

    ఫుట్ బాల్ లెజెండ్ మెస్సి గ్రౌండ్లోకి వచ్చాడు.

  • 13 Dec 2025, 08:11:28 PM IST

    గోల్ కొట్టిన సీఎం

    తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రౌండ్ లోకి రాగానే గోల్ కొట్టాడు.

  • 13 Dec 2025, 08:03:55 PM IST

    మెస్సీ.. మెస్సీ

    ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ రాకతో ఉప్పల్ స్టేడియంలో మెస్సీ.. మెస్సీ నామ జపం వినిపిస్తోంది.

  • 13 Dec 2025, 08:00:18 PM IST

    స్టేడియంలోకి మెస్సి

    సాకర్ మాంత్రికుడు మెస్సి ఉప్పల్ స్టేడియానికి వచ్చాడు. మరోవైపు మెస్సి, రేవంత్ టీమ్స్ మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ సాగుతోంది.

  • 13 Dec 2025, 07:45:08 PM IST

    గ్రౌండ్ లో టీమ్స్

    ఫుట్ బాల్ మ్యాచ్ కోసం మెస్సి, సింగరేణి టీమ్స్ గ్రౌండ్ లోకి అడుగుపెట్టాయి. త్వరలోనే మ్యాచ్ స్టార్ట్ కానుంది.

  • 13 Dec 2025, 07:14:23 PM IST

    ఊగిపోయిన ఉప్పల్ స్టేడియం

    బాయిలోనా బల్లి పలికే, రారా రక్కమ్మ లాంటి సాంగ్స్ తో ఉప్పల్ స్టేడియాన్ని ఉపేసింది మంగ్లీ.

  • 13 Dec 2025, 07:05:09 PM IST

    జోష్ తెచ్చిన మంగ్లీ

    తెలంగాణ పాపులర్ సింగర్ మంగ్లీ తన పాటలతో ఉప్పల్ స్టేడియంలో జోష్ తెచ్చింది. రేలారే రేలారే, ఎల్లమ్మ పాటలతో అదరగొట్టింది.

  • 13 Dec 2025, 06:55:42 PM IST

    మెస్సి కోసం సాంగ్

    మెస్సి కోసం సాంగ్ ను డెడికేట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఆ సాంగ్ కు స్టేడియంలోని ఫ్యాన్స్ స్టెప్పులేశారు.

  • 13 Dec 2025, 06:22:50 PM IST

    మెస్సీని కలిసిన రేవంత్ రెడ్డి

    తాజ్ ఫలక్ నూమా ప్యాలెస్ లో ఫుట్ బాల్ స్టార్ లియొనెల్ మెస్సీని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కలిశారు.

  • 13 Dec 2025, 05:51:19 PM IST

    రూ.10 లక్షలు పెట్టిన ఫ్యాన్స్ తో మెస్సి

    హైదరాబాద్ చేరుకున్న మెస్సి ఇప్పుడు తాజ్ ఫలక్ నూమా ప్యాలెస్ లో ఉన్నాడు. అక్కడ ఫ్యాన్స్ తో మాట్లాడుతున్నాడు. రూ.10 లక్షలు పెట్టి మెస్సీతో ఫొటో దిగే అవకాశం దక్కించుకున్న ఫ్యాన్స్ అక్కడున్నారు.

  • 13 Dec 2025, 05:17:12 PM IST

    హైదరాబాద్ లో రాహుల్ గాంధీ

    గోట్ టూర్ లో భాగంగా హైదరాబాద్ లో మెస్సీ ఈవెంట్ కోసం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇక్కడికి చేరుకున్నారు. సీఎం రేవంత్ వెళ్లి ఆహ్వానం పలికారు.

  • 13 Dec 2025, 05:11:54 PM IST

    4 వేల మంది పోలీసులు

    కోల్ కతాలో ఘటన నేపథ్యంలో హైదరాబాద్ లో మెస్సి టూర్ కోసం ఇక్కడి పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. 4 వేల మంది పోలీసులను మోహరించినట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ సుధీర్ బాబు తెలిపారు.

  • 13 Dec 2025, 05:05:54 PM IST

    హైదరాబాద్ లో మెస్సి

    ఫుట్ బాల్ స్టార్ లియోనెల్ మెస్సి హైదరాబాద్ చేరుకున్నాడు. ప్రత్యేక విమానంలో అతను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చాడు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks