Mahindra BE 07 : మహీంద్రా నుంచి మరో ఎలక్ట్రిక్ సంచలనం! బీఈ 07 హైలైట్స్..

Mahindra BE 07 electric SUV : మహీంద్రా నుంచి వస్తున్న సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ 'బీఈ 07' టెస్టింగ్ సమయంలో మరోసారి రోడ్డుపై కనిపించింది. దీనికి సంబంధించిన కీలక డిజైన్ వివరాను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 10, 2026, 12:20:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల జోరును మరింత పెంచేందుకు మహీంద్రా సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా కంపెనీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువస్తున్న 'బీఈ 07' ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రోడ్డుపై టెస్టింగ్ సమయంలో మరోసారి కంటపడింది. ఈ టెస్ట్ వెహికల్ పూర్తిగా కవర్ చేసి ఉన్నప్పటికీ, దీని బాహ్య డిజైన్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.

మహీంద్రా బీఈ 07 (Instagram / auto_gyaan_marathi)
మహీంద్రా బీఈ 07 (Instagram / auto_gyaan_marathi)

మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ శ్రేణిలో 'బీఈ 6' కంటే పైస్థానంలో ఈ బీఈ 07 నిలవనుంది. బీఈ 6 కూపే తరహా స్టైలింగ్‌ను కలిగి ఉండగా, బీఈ 07 మాత్రం నిటారుగా ఉండే సాంప్రదాయ ఎస్‌యూవీ బాడీ స్టైల్‌తో వస్తోంది. దీనివల్ల క్యాబిన్ లోపల స్థలం ఎక్కువగా ఉండటంతో పాటు ప్రాక్టికాలిటీ కూడా మెరుగ్గా ఉంటుంది. మహీంద్రాకు చెందిన ప్రత్యేక ‘ఐఎన్‌జీఎల్‌ఓ’ ఎలక్ట్రిక్ వెహికల్ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా దీన్ని తయారు చేస్తున్నారు.

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- డిజైన్ ప్రత్యేకతలు..

తాజాగా రోడ్డుపై తిరుగుతున్న మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ టెస్ట్ వెహికల్‌లో ముందు భాగంలో కోణీయంగా ఉండే ప్రొజెక్టర్-స్టైల్ హెడ్‌ల్యాంప్స్ కనిపిస్తున్నాయి. బంపర్‌పైనే పార్కింగ్ సెన్సార్లు, కింద భాగంలో ఫాగ్ ల్యాంప్స్‌ను అమర్చారు. బోనెట్ చాలా మస్క్యులర్‌గా కనిపిస్తోంది.

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే.. ఫ్రేమ్‌లెస్ డోర్లు, ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, పెద్ద సైజు బ్లాక్ అలాయ్ వీల్స్ వంటి ప్రొడక్షన్-స్పెక్ ఫీచర్లు ఉన్నాయి. బీఈ 6 మోడల్‌తో పోలిస్తే దీని రూఫ్‌లైన్ నిటారుగా ఉండటం వల్ల సరికొత్త ఎస్‌యూవీ లుక్ వస్తోంది. వెనుక వైపు నిలువుగా ఉండే ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్‌తో పాటు రియర్ స్పాయిలర్ కింద దాచిపెట్టిన వైపర్, వాషర్‌ను ఇచ్చారు. టెయిల్‌గేట్‌పై నంబర్ ప్లేట్ రెసెస్ ఉండటంతో వెనుక భాగం చాలా క్లీన్‌గా కనిపిస్తోంది.

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- అధునాతన ఫీచర్లతో కూడిన క్యాబిన్..

బీఈ 07 ప్రొడక్షన్-స్పెక్ ఇంటీరియర్‌ను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అయితే మహీంద్రా నుంచి వచ్చిన ఇతర కొత్త ఎలక్ట్రిక్ మోడళ్లలోని టెక్నాలజీనే ఇందులోనూ అందించే అవకాశం ఉంది.

ట్రిపుల్-స్క్రీన్ సెటప్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360-డిగ్రీ కెమెరా, మల్టీ-జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉండే ఛాన్స్ ఉంది. హెడ్-అప్ డిస్‌ప్లే, వైర్‌లెస్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, టైప్-సీ ఛార్జింగ్ పోర్టులు, అడాస్ వంటి అధునాతన హంగులు లభించనున్నాయి. భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను ప్రామాణికంగా అందించే అవకాశం ఉంది.

మహీంద్రా బీఈ 07 ఎలక్ట్రిక్ ఎస్​యూవీ- ఐఎన్‌జీఎల్‌ఓ ప్లాట్‌ఫారమ్ ఆధారంగా..

మహీంద్రా ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన ఐఎన్‌జీఎల్‌ఓ ప్లాట్‌ఫారమ్‌పైనే బీఈ 07 రూపుదిద్దుకుంటోంది. బ్యాటరీ సామర్థ్యం, మోటార్ వివరాలు, డ్రైవింగ్ రేంజ్ వంటి అంశాలను కంపెనీ ఇంకా గోప్యంగా ఉంచింది. పెద్దదిగా ఉండే బాడీ డిజైన్ కారణంగా ఇది కుటుంబాలకు మరింత అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రాథమికంగా ఇది ఐదు సీట్ల ఆప్షన్‌తో రానుండగా, భవిష్యత్తులో మూడు వరుసల సీట్ల (7-సీటర్) లేఅవుట్ గురించి కూడా సంస్థ ఆలోచించే అవకాశం ఉంది.

త్వరలోనే ఈ ఎస్‌యూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడయ్యే ఛాన్స్ ఉంది. ఈ మోడల్​ని ఈ నెలలోనే సంస్థ రివీల్ చేసే అవకాశం ఉంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More