Maruti Suzuki car discounts : మారుతీ సుజుకీ కారు కొనాలా? ఇదే రైట్ టైమ్! భారీగా డిస్కౌంట్లు..

August 2026 car discounts : దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ మారుతీ సుజుకీ.. ఆగస్టు 2026 ఆఫర్లను ప్రకటించింది. విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్‌పై గరిష్టంగా రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనాలు లభిస్తాయని కంపెనీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ కార్లపై ప్రస్తుతం ఉన్న డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 10, 2026, 09:10:15 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మారుతీ సుజుకీ కార్ లవర్స్​కి, కొత్తా వెహికిల్​ కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి గుడ్‌న్యూస్! ఈ దేశీయ దిగ్గజ ఆటోమొబైల్​ కంపెనీ తన కార్లపై ఆగస్టు 2026కి సంబంధించి ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ఈ నెల చివరి వరకు, అంటే ఆగస్టు 31 వరకు పలు మోడళ్లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అత్యధికంగా రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. ఈ నేపథ్యంలో ఈ ఆగస్టు 2026లో మారుతీ సుజుకీ కార్లపై డిస్కౌంట్ల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

మారుతీ సుజుకీ సంస్థ లోగో..
మారుతీ సుజుకీ సంస్థ లోగో..

మారుతీ సుజుకీ కార్లపై డిస్కౌంట్లు- వివిధ రకాల ఆఫర్ల వివరాలు..

ఆఫర్ల జాబితాలో కస్టమర్ డిస్కౌంట్లు, ఎక్స్​చేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బెనిఫిట్స్, లాయల్టీ అప్‌గ్రేడ్స్, అలాగే ఇన్‌స్టిట్యూషనల్ లేదా రూరల్ సేల్స్ ఆఫర్లు ఉన్నాయి. అయితే, కస్టమర్ ఎంచుకునే మోడల్, వేరియంట్, వారి అర్హతలను బట్టి అసలైన తగ్గింపు ధర మారుతుంది.

స్ట్రాంగ్ హైబ్రిడ్‌పైనే అందరి చూపు!

ఆగస్టు ఆఫర్ క్యాంపెయిన్‌లో మారుతీ సుజుకీ విక్టోరిస్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దీనిపై గరిష్టంగా రూ. 1.35 లక్షల వరకు బెనిఫిట్ లభిస్తుంది. ఇందులో రూ. 75,000 వరకు ఎక్స్​ఛేంజ్ బోనస్, లాయల్టీ అప్‌గ్రేడ్, స్క్రాపేజ్ ప్రయోజనాలు ఉన్నాయి. ఇక పెట్రోల్, సీఎన్జీ వెర్షన్లపై రూ. 85,000 వరకు తగ్గింపు పొందవచ్చు.

చిన్న కార్లపై ప్రత్యేక ఆఫర్లు..

మారుతీకి చెందిన ఎంట్రీ లెవల్ చిన్న కార్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఆల్టో కే10 ఎల్ఎక్స్‌ఐ, వాగన్ఆర్ మంచి ఆప్షన్‌గా ఉన్నాయి. వీటిపై గరిష్టంగా రూ. 52,500 వరకు ప్రయోజనం లభిస్తుంది. అలాగే సెలెరియోపై రూ. 42,500 వరకు, పెట్రోల్ స్విఫ్ట్పై రూ. 40,000 వరకు ఆఫర్లు వర్తిస్తాయి.

ప్ఛ్.. కొన్ని మోడళ్లకు వర్తించని ఆఫర్లు!

మారుతీ సుజుకీ ఆగస్టు 2026 ఆఫర్ జాబితాలో కొన్ని పాపులర్ కార్లకు చోటు దక్కలేదు. బ్రెజా, డిజైర్, ఎర్టిగా మోడళ్లకు ఎలాంటి ఆఫర్లు ప్రకటించలేదు. అలాగే ఎస్-ప్రెస్సో సీఎన్జీ, స్విఫ్ట్ సీఎన్జీ కార్లపై నేరుగా కస్టమర్ డిస్కౌంట్లు లేనప్పటికీ, ఇతర కేటగిరీల కింద కొన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి.

గమనించాల్సిన ముఖ్య విషయాలు..

ఇవి కేవలం గరిష్ట సాధ్యమైన ప్రయోజనాలు మాత్రమేనని, నేరుగా నగదు రూపంలో లభించే డిస్కౌంట్లు కాదని మారుతీ స్పష్టం చేసింది. ఎక్స్​ఛేంజ్ చేసే వాహనం వయస్సును బట్టి బోనస్ మారుతుంది. లాయల్టీ, స్క్రాపేజ్, ఇన్‌స్టిట్యూషనల్ ఆఫర్లకు వేర్వేరు నిబంధనలు ఉంటాయి.

ఆగస్టు 4 నుంచి ప్రారంభమైన ఈ ఆఫర్లు ఆగస్టు 31 వరకు అమల్లో ఉంటాయి. ఈ నెలలో మారుతీ సుజుకీ కారు కొనాలనుకునే వారికి విక్టోరిస్ హైబ్రిడ్ బెస్ట్ డీల్ కాగా, చిన్న కార్ల కొనుగోలుదారులకు ఆల్టో కే10, వాగన్ఆర్ మంచి ఎంపికలు కానున్నాయి.

టాటా కార్లపైనా అదిరే డిస్కౌంట్లు..

భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన కస్టమర్లకు పండుగ కానుకలను ప్రకటించింది. ఓనం వేడుకలతో ప్రారంభమైన పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని.. పెట్రోల్, డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) ఆగస్టు నెలలో రూ. 2.25 లక్షల వరకు ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తోంది. ఈ ఆఫర్లతో పాటు బుకింగ్‌లపై ప్రయారిటీ డెలివరీలు, ప్రత్యేక ఫైనాన్సింగ్ సదుపాయాలను కల్పిస్తోంది.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More