మెల్‌బోర్న్ (MCG) వేదికగా జరిగిన నాలుగో యాషెస్ టెస్ట్ మ్యాచ్ ఊహించని విధంగా కేవలం రెండు రోజుల్లోనే ముగిసింది. 6 సెషన్లలో ఏకంగా 36 వికెట్లు పడటంతో పిచ్‌పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంగ్లండ్ గెలిచినప్పటికీ.. మ్యాచ్ త్వరగా అయిపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు భారీగా ఆర్థిక నష్టం వాటిల్లింది. పిచ్ తీరు చూసి క్యూరేటర్ కూడా షాక్ అయ్యాడు.
బాక్సింగ్ డే టెస్టు ఇలా..

బాక్సింగ్ డే టెస్ట్ అంటే క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగ లాంటిది. కానీ ఈసారి మెల్‌బోర్న్ పిచ్ దెబ్బకు ఆ పండగ రెండు రోజులకే ముగిసింది. ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఇదొక చేదు జ్ఞాపకంలా మిగిలిపోయింది.
మ్యాచ్ రెండో రోజు సాయంత్రం సెషన్‌లోనే ఇంగ్లండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 2011 తర్వాత ఆస్ట్రేలియాలో ఇంగ్లండ్ గెలిచిన తొలి టెస్ట్ ఇదే. కేవలం 6 సెషన్ల ఆటలో 36 వికెట్లు పడ్డాయి. 1909 తర్వాత యాషెస్ సిరీస్ మొదటి రోజే అత్యధిక వికెట్లు (20) పడటం ఇదే రికార్డు.
మ్యాచ్ ఐదు రోజులు సాగుతుందని ఆశిస్తే.. రెండు రోజులకే అయిపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (CA)కు గట్టి దెబ్బ తగిలింది. టికెట్లు, బ్రాడ్‌కాస్టింగ్ రూపంలో సుమారు 10 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు నష్టం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు.
బెన్ స్టోక్స్ కౌంటర్
విజయం తర్వాత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. "ఈ పిచ్ వేరే దేశంలో (ఉదాహరణకు ఇండియాలో) ఉండి ఉంటే.. జనాలు రచ్చ రచ్చ చేసేవాళ్లు" అని పిచ్‌పై వస్తున్న విమర్శలను ప్రస్తావించాడు.
క్యూరేటర్ ఏమన్నాడంటే?
సాధారణంగా మ్యాచ్ మధ్యలో క్యూరేటర్లు మాట్లాడరు. కానీ ఎంసీజీ క్యూరేటర్ మాట్ పేజ్ మాత్రం మీడియా ముందుకు వచ్చాడు. "నా లైఫ్ లో ఇలాంటి టెస్ట్ మ్యాచ్ చూడలేదు. మళ్లీ ఇలాంటి మ్యాచ్‌కు నన్ను పిలవకూడదని కోరుకుంటున్నా. మొదటి రోజు ఆట చూసి నేను షాక్ అయ్యాను" అని పేజ్ అన్నాడు.
{{/usCountry}}సాధారణంగా మ్యాచ్ మధ్యలో క్యూరేటర్లు మాట్లాడరు. కానీ ఎంసీజీ క్యూరేటర్ మాట్ పేజ్ మాత్రం మీడియా ముందుకు వచ్చాడు. "నా లైఫ్ లో ఇలాంటి టెస్ట్ మ్యాచ్ చూడలేదు. మళ్లీ ఇలాంటి మ్యాచ్‌కు నన్ను పిలవకూడదని కోరుకుంటున్నా. మొదటి రోజు ఆట చూసి నేను షాక్ అయ్యాను" అని పేజ్ అన్నాడు.
{{/usCountry}}తాము అనుకున్నట్టు పిచ్ ప్రవర్తించలేదని, వచ్చే ఏడాది కచ్చితంగా సరిదిద్దుకుంటామని అతడు చెప్పాడు. రెండు రోజుల్లోనే మ్యాచ్ ముగియడం తమకు తీవ్ర నిరాశనే మిగిల్చిందని తెలిపాడు.
టికెట్లు కొన్నవాళ్ల పరిస్థితి ఏంటి?
మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ (MCC) సీఈవో స్టూవర్ట్ ఫాక్స్ మాట్లాడుతూ.. "రెండు రోజుల్లోనే దాదాపు 1.90 లక్షల మంది జనం వచ్చారు. మూడో రోజు టికెట్లు కొన్నవారికి నిరాశే మిగిలింది. ప్లేయర్స్ మధ్య ఏదైనా ఫ్రెండ్లీ మ్యాచ్ పెడదామని చర్చలు జరిగాయి కానీ.. అది కుదరలేదు" అని తెలిపారు. ఈ పిచ్ బ్యాటర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని ఆయన అంగీకరించారు.