షాకింగ్.. 14 ఏళ్ల బాలుడితో గర్భం దాల్చి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ!
అమెరికా ఇల్లినాయిస్‌కి చెందిన 43 ఏళ్ల రాబిన్ పోల్‌స్టన్ అనే మహిళపై తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి. ఈమె 14 ఏళ్ల బాలుడితో గర్భం దాల్చి, 2025 జనవరిలో బిడ్డకు జన్మనిచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి!
అమెరికాలో ఇల్లినాయిస్ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! కూతురు ‘డేట్’గా పరిచయమైన ఓ 14ఏళ్ల బాలుడి వల్ల గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిచ్చిందంటూ ఓ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటోంది.

ఆ 14ఏళ్ల బాలుడిని ‘బాధితుడి’గా పేర్కొంటూ.. పోలీసులు రాబిన్ పోల్‌స్టన్ అనే 43ఏళ్ల మహిళపై క్రిమినల్ సెక్సువల్ అసాల్ట్ కింద రెండు సెక్షన్లు, చైల్డ్ పోర్నోగ్రఫీ కలిగి ఉన్నందుకు రెండు సెక్షన్లు మోపారు. ఈ సెక్షన్లలో ప్రతిదానికీ 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
దర్యాప్తు ఎలా మొదలైంది?
పోల్‌స్టన్ జనవరి 2025లో ఒక నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, వాషింగ్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిందని టెజ్వెల్ కౌంటీ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ కాసాండ్రా విల్కిన్స్ తెలిపారు.
ఒక వారం తర్వాత, దర్యాప్తు అధికారులు ఆ శిశువు జనన ధృవీకరణ పత్రం కాపీని పొందగలిగారు. దాని ద్వారా నవజాత శిశువుకు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుడికి ఉన్న మధ్య పేరు, చివరి పేరునే పోల్‌స్టన్ పెట్టిందని తెలుసుకున్నారు.
ఈ సమాచారంతో పోల్‌స్టన్‌ను ప్రశ్నించగా, బిడ్డ తండ్రి పుట్టిన సమయానికి ఇరవై ఏళ్లలో ఉన్న "బ్రియాన్" అనే వ్యక్తి అని, ఆ బిడ్డ పుట్టిన తర్వాత అతడిని ఇక చూడలేదని వాదించింది.
ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలుడిని కూడా విచారించడం ప్రారంభించారు దర్యాప్తు అధికారులు. ఈ నేపథ్యంలో.. మే 2023లో జరిగిన జూనియర్ హై డ్యాన్స్‌కు ఆ బాలుడు, పోల్‌స్టన్ కూతురు కలిసి వెళ్లారని, ఆ సమయంలో పోల్‌స్టన్ చాపెరోన్‌గా (పర్యవేక్షకురాలిగా) ఉన్నారని అధికారులు తెలుసుకున్నారు.
మే 2023 తర్వాత ఆ బాలుడు వెంటనే వేరే ప్రాంతానికి వెళ్లిపోయాడు, కానీ పోల్‌స్టన్ బిడ్డకు జన్మనివ్వడానికి సుమారు 40 వారాల ముందు, అంటే ఏప్రిల్ 2024లో అతను తిరిగి వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆగస్టు 2024లో శాశ్వతంగా తన "ఫ్రెండ్" కుటుంబంతో కలిసి జీవించడానికి తిరిగి వచ్చాడు.
అంతేకాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న బాధితుడు- పోల్‌స్టన్‌కు సంబంధించిన, లైంగికంగా అసభ్యకరమైన చిత్రాలు, వీడియోలను భారీ సంఖ్యలో కనుగొన్నారని తెలుస్తోంది.
ఇవన్నీ పక్కన పెడితే.. డీఎన్ఏ పరీక్ష ద్వారా ఆ బిడ్డ తల్లిదండ్రులు పోల్‌స్టన్- ఆరోపణలు ఎదుర్కొంటున్న 14ఏళ్ల బాలుడే అని ధృవీకరించినట్టు అధికారులు తెలిపారు.
పోల్‌స్టన్‌ను ఇప్పటికే అరెస్టు చేశారు. ఆమెకు బెయిల్ ఇవ్వకుండా లేకుండా నిర్బంధంలో ఉంచారు. ఆమె ఇంకా నేరాన్ని అంగీకరించలేదు. కోర్టు రికార్డుల ప్రకారం, ఆమెపై డిసెంబర్ 4న అధికారికంగా విచారణ జరగనుంది.
ఈ పూర్తి విషయంపై ఆమె న్యాయవాది స్పందించడానికి నిరాకరించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


