ఏపీలో కొత్తగా 8 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు - పీపీపీ విధానంలో ఏర్పాటు...!
రాష్ట్రంలో కొత్తగా 8 నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. వీటిని పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టర్న్‌షిప్) విధానంలో నడిపించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వివరాలను వెల్లడించారు.
రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో అప్పుడే పుట్టిన బిడ్డల కోసం అదనంగా మరో 8 ప్రత్యేక నవజాత శిశువుల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటన విడుదల చేశారు. వీటి ద్వారా అదనంగా 80 పడకలు (వార్మర్స్) అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు.

ఒక్కో ఎస్ఎన్‌సియు ఏర్పాటుకు రూ.60 లక్షలు అవసరం కాగా, 8 ఎస్ఎన్‌సియులకు గాను మొత్తం రూ.4.80 కోట్లు ఖర్చవుతుందన్నారు. అలాగే ఒక్కో ఎస్ఎన్‌సియుకు నెలకు రూ. 8.91 లక్షలు చొప్పున 8 ఎస్ఎన్‌సియుల నిర్వహణకు దాదాపు రూ.1.07 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు.
పీపీపీ విధానంలోనే…!
పబ్లిక్ ప్రైవేట్ పార్టర్న్‌షిప్(పిపిపి) విధానంలో ఈ 8 ఎస్ఎన్‌సియులు(Special Newborn Care Units)) నడుస్తాయి. కోనసీమ జిల్లా అమలాపురం ఏరియా ఆసుపత్రి, చిత్తూరు జిల్లాలోని కుప్పం ఏరియా ఆసుపత్రి, అనంతపురం జిల్లా గుంతకల్ ఏరియా ఆసుపత్రి, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు సీహెచ్సీల్లో ఈనెలాఖరులోగా సేవలు అందుబాటులోకొస్తాయి. ఏలూరు జిల్లా నూజివీడు ఏరియా ఆసుపత్రి, నెల్లూరు జిల్లా కావలి ఏరియా ఆసుపత్రి, సత్యసాయి జిల్లా కదిరి ఏరియా ఆసుపత్రి, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రులలో కొత్త ఎస్ఎన్‌సియులు నవంబరులో అందుబాటులోకొస్తాయి.
రాష్ట్రంలోని టీచింగ్, జిల్లా, ఏరియా ఆసుపత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో(CHCs) ఇప్పటికే 62 ఎస్ఎన్‌సియులు పనిచేస్తున్నాయని మంత్రి తెలిపారు. వీటిలో 28 ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న 10 వార్మర్లు గల 11 ఎస్ఎన్‌సియులు, 5 వార్మర్లు గల 23 ఎస్ఎన్‌సియులలో అత్యవసర వైద్యాన్ని అవసరమైన శిశువులకు అందిస్తున్నారు. ఈ కేంద్రాల ద్వారా నవజాత శిశువులకు అధునాతన వైద్యం అందుతోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఇప్పటికే అనకాపల్లి, ప్రత్తిపాడు, హిందూపురం, నంద్యాలలో నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్ని వైద్యారోగ్య శాఖ నెలకొల్పింది. అలాగే సత్తెనపల్లిలోని న్యూ బోర్న్ స్టెబిలైజేషన్ యూనిట్ ను ఎస్ఎన్‌సియుగా అప్‌గ్రేడ్ చేశారు. వీటితో పాటు అదనంగా మరో 8 ఎస్ఎన్‌సియులు ఏర్పాటుకానున్నాయి.
పుట్టినప్పట్నించి 28 రోజుల వరకు ప్రత్యేక నవజాత శిశు సంరక్షణ కేంద్రాల్లో సేవలందిస్తారు. తక్కువ బరువుతో పుట్టిన శిశువులు, పచ్చకామెర్లు(నియోనేటల్ జాండిస్) వచ్చిన శిశువులు, హైపో థెర్మియా, ఎఆర్‌డియస్(శ్వాశ కోస సంబంధిత సమస్యలు), సెప్సిస్ వంటి సమస్యలు గల నవజాత శిశువులకు ఇక్కడ చికిత్స అందిస్తారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

