భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకునేందుకు చైనా ఆటో దిగ్గజం ‘బీవైడీ’ ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటివరకు సాధారణ ఈవీలతో ఆకట్టుకున్న ఈ సంస్థ, ఇప్పుడు తన గ్లోబల్ లగ్జరీ బ్రాండ్ ‘డెంజా’ను దేశీయ మార్కెట్లోకి పరిచయం చేయబోతోంది! ఇందులో భాగంగా అసాధారణ పవర్, సరికొత్త ఫీచర్లు కలిగిన ‘డెంజా జెడ్9 జీటీ’ మోడల్‌ను భారత్‌లో లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

మార్చి 2025లోనే ఈ ఎలక్ట్రిక్ కారు డిజైన్ పేటెంట్‌ను భారత్‌లో నమోదు చేసింది. ఇక భారత్‌లో లగ్జరీ ఈవీలకు ఆదరణ పెరుగుతున్న వేళ టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎం వంటి అతిపెద్ద విలాసవంతమైన కార్లకు పోటీగా బీవైడీ ఈ తన డెంజా జెడ్9 జీటీని తీసుకొస్తోంది.
1,156 హెచ్‌పీ రాకెట్ స్పీడ్!
బీవైడీ డెంజా జెడ్9 జీటీ ఎలక్ట్రిక్ కారు పనితీరు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే! ఇందులో 122.5 kWh సామర్థ్యం కలిగిన భారీ బ్యాటరీ ప్యాక్‌తో పాటు ట్రిపుల్-మోటార్ (మూడు మోటార్లు) సెటప్‌ను అందించారు. ఇది ఏకంగా 1,156 హెచ్‌పీ పవర్, 1,210 ఎన్ఎమ్ టాప్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కేవలం 2.7 సెకన్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 270 కిలోమీటర్లు. పెట్రోల్ ఆధారిత సూపర్‌కార్లను కూడా దాటేసేలా ఈ ఈవీ రేంజ్ ఉంటుంది.
సైడ్‌వేస్ మూవ్‌మెంట్.. 360 డిగ్రీల టర్న్!
వేగమే కాకుండా ఈ కారులో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అమర్చారు. యాక్టివ్ రియర్-వీల్ స్టీరింగ్ సిస్టమ్ సాయంతో ఈ కారు పక్కలకు జరగడమే కాకుండా, ఒకేచోట 360 డిగ్రీల కోణంలో సులువుగా తిరగగలదు.
డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు 'డైసస్-ఏ' డ్యూయల్-ఛాంబర్ ఎయిర్ సస్పెన్షన్, సెల్ఫ్ పార్కింగ్ ఫీచర్, డిజిటల్ రియర్-వ్యూ కెమెరా స్క్రీన్లు, డెవియాలెట్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను క్యాబిన్లో ఏర్పాటు చేశారు.
ముందొచ్చేది డెంజా డీ9 ఎంపీవీ!
{{/usCountry}}డ్రైవింగ్ అనుభవాన్ని పెంచేందుకు 'డైసస్-ఏ' డ్యూయల్-ఛాంబర్ ఎయిర్ సస్పెన్షన్, సెల్ఫ్ పార్కింగ్ ఫీచర్, డిజిటల్ రియర్-వ్యూ కెమెరా స్క్రీన్లు, డెవియాలెట్ ప్రీమియం ఆడియో సిస్టమ్‌ను క్యాబిన్లో ఏర్పాటు చేశారు.
ముందొచ్చేది డెంజా డీ9 ఎంపీవీ!
{{/usCountry}}డెంజా జెడ్9 జీటీ కంటే ముందే డెంజా బ్రాండ్ నుంచి 'డీ9' లగ్జరీ ఎంపీవీ భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉంది. పండుగల సమయానికి ఈ మోడల్ ఆవిష్కృతమయ్యే ఛాన్స్ ఉంది. ఇది మార్కెట్లో టయోటా వెల్‌ఫైర్, లెక్సస్ ఎల్ఎమ్, మర్సిడీస్ బెంచ్ వి-క్లాస్, ఎంజీ ఎం9 మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.
డెంజా డీ9 మోడల్‌లో 103.3 kWh బ్లేడ్ బ్యాటరీని ఉపయోగించారు. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 520 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. డీ9 లాంచ్ అయిన తర్వాత డెంజా డెంజా జెడ్9 జీటీ భారత్‌లోకి వస్తే, మన దేశంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటిగా నిలుస్తుంది.