Artificial Intelligence : చనిపోయిన కొడుకు ఏఐ రూపంలో తిరిగొచ్చాడు- తల్లి కోసం..! ఇది కరెక్టేనా?
రోడ్డు ప్రమాదంలో మరణించిన కొడుకు మరణవార్తను తట్టుకోలేదని, చైనాలోని ఒక కుటుంబం ఏఐ టెక్నాలజీతో అతడి 'డిజిటల్ ట్విన్'ను సృష్టించింది. 80 ఏళ్ల ఆ తల్లి తన కొడుకు బతికే ఉన్నాడని నమ్ముతూ రోజూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
చైనాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) పరిధిపై సరికొత్త చర్చకు దారితీసింది. మరణించిన వ్యక్తిని ఏఐ రూపంలో తిరిగి సృష్టించి, ఆ విషాదాన్ని ఒక వృద్ధురాలి నుంచి దాచిన ఈ ఘటన భావోద్వేగాలకి, నైతిక విలువలకు మధ్య ఉన్న సన్నని గీతను ప్రశ్నిస్తోంది.

రోడ్డు ప్రమాదంలో మరణించిన కొడుకు మరణవార్తను తట్టుకోలేదని, చైనాలోని ఒక కుటుంబం ఏఐ టెక్నాలజీతో అతడి 'డిజిటల్ ట్విన్'ను సృష్టించింది. 80 ఏళ్ల ఆ తల్లి తన కొడుకు బతికే ఉన్నాడని నమ్ముతూ రోజూ వీడియో కాల్స్‌లో మాట్లాడుతోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి.
ఏఐ కొడుకు ఎలా సాధ్యం?
జాంగ్ జెవీ నేతృత్వంలోని ఏఐ బృందం సహాయంతో ఈ 'డిజిటల్ ట్విన్'ను రూపొందించారు. మరణించిన వ్యక్తి పాత ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డింగ్‌లను ఉపయోగించి అచ్చం అతనిలాగే కనిపించే, మాట్లాడే వర్చువల్ రూపాన్ని సృష్టించారు. కేవలం రూపమే కాదు, అతను మాట్లాడే శైలి, మాట్లాడేటప్పుడు ముందుకు వంగే అలవాటు వంటి చిన్న చిన్న హావభావాలను కూడా ఏఐ కాపీ కొట్టింది!
భావోద్వేగపూరిత సంభాషణలు..
ప్రస్తుతం ఆ వృద్ధురాలు తన కొడుకుతో రెగ్యులర్‌గా వీడియో కాల్స్‌లో మాట్లాడుతోంది. వీరి సంభాషణలు ఈ విధంగా ఉంటున్నాయి..
తల్లి: "నువ్వు వేరే నగరంలో ఎలా ఉన్నావో నాకు తెలియడం లేదు, తరచుగా ఫోన్ చేస్తూ ఉండు. నిన్ను చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది."
ఏఐ కొడుకు: "సరే అమ్మ.. ప్రస్తుతం పనిలో చాలా బిజీగా ఉన్నాను. బాగా డబ్బు సంపాదించాక ఇంటికి వచ్చి నిన్ను బాగా చూసుకుంటాను."
తాను వేరే ఊరిలో ఉద్యోగం చేస్తున్నానని, త్వరలోనే వస్తానని ఆ ఏఐ కొడుకు (అబద్ధం) చెబుతుండటంతో, ఆ తల్లి తన కొడుకు క్షేమంగానే ఉన్నాడని నమ్ముతోంది.
నైతిక వివాదం: ఇది తప్పా? ఒప్పా?
ఈ వార్త బయటకు రావడంతో ఇంటర్నెట్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సమర్థించేవారు: టెక్నాలజీని ఒక మంచి పని కోసం, ఒక ప్రాణాన్ని కాపాడటం కోసం వాడటం గొప్ప విషయమని కొందరు అంటున్నారు. తాము కూడా తమ తల్లిదండ్రులను ఇలాగే చూడాలనుకుంటున్నామని కొందరు ఆకాంక్షిస్తున్నారు.
విమర్శించేవారు: ఇదొక ప్రమాదకరమైన ధోరణి అని విమర్శకులు వాదిస్తున్నారు. ఎప్పటికైనా నిజం తెలిస్తే ఆ వృద్ధురాలు తట్టుకోలేదని, భావోద్వేగాలతో ఆడుకోవడం సరికాదని హెచ్చరిస్తున్నారు.
ఏఐ సృష్టికర్త జాంగ్ మాత్రం తాను గత మూడేళ్లుగా ఇలాంటి సేవలు అందిస్తున్నానని, బతికున్న వారికి ఊరటనివ్వడమే తన లక్ష్యమని చెబుతున్నారు.
తరచుగా అడిగే ప్రశ్నలు -
1. చనిపోయిన వారిని ఏఐతో తిరిగి సృష్టించడం సాధ్యమేనా?
అవును, ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీప్‌ఫేక్, వాయిస్ క్లోనింగ్ టెక్నాలజీతో మరణించిన వారి రూపం, గొంతును డిజిటల్‌గా సృష్టించవచ్చు.
2. దీనివల్ల ప్రమాదాలు ఏమైనా ఉన్నాయా?
నైతిక సమస్యలతో పాటు ఇలాంటి టెక్నాలజీని సైబర్ నేరగాళ్లు మోసాలకు ఉపయోగించే అవకాశం ఉంది. అలాగే నిజం తెలిసినప్పుడు కలిగే మానసిక వేదన తీవ్రంగా ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


