టార్గెట్​ రూ. 1 కోటి- మ్యూచువల్​ ఫండ్​ సిప్​ ద్వారా 15 ఏళ్లలో ఎలా సాధించాలి?

మ్యూచువల్​ ఫండ్స్​లో ఇన్వెస్ట్​ చేసి, మీ ఆర్థిక లక్ష్యాల కోసం 15ఏళ్లల్లో రూ.1కోటి సంపాదించాలని ప్లాన్​ చేస్తున్నారా? మరి ఆ టైమ్​ డ్యురేషన్​లో మీరు కోటీశ్వరులు అవ్వాలంటే ప్రతి నెల ఎంత సిప్​ చేయాలో మీకు తెలుసా? ఇక్కడ చూసేయండి..

Published on: Nov 08, 2025 6:45 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మీ ఆర్థిక లక్ష్యాలను మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడం ద్వారా సాధించాలంటే, సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్​) మంచి ఆప్షన్​ అవుతుంది. సిప్​ ద్వారా క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టడం చాలా ముఖ్యం. మీ కెరీర్ ప్రారంభంలో మీరు పెట్టే పెట్టుబడి కాలక్రమేణా భారీగా వృద్ధి చెందుతుంది. ఎందుకంటే, మొదటి కొన్ని సంవత్సరాల్లో వచ్చే రాబడి.. తర్వాతి సంవత్సరాల్లో అసలుగా మారుతుంది. దీనివల్ల తర్వాత సంవత్సరాల్లో మీ పెట్టుబడి మరింత వేగంగా పెరగడానికి అవకాశం ఉంటుంది.

మ్యూచువల్​ ఫండ్​ సిప్​తో రూ. 1కోటి సంపాదన!
మ్యూచువల్​ ఫండ్​ సిప్​తో రూ. 1కోటి సంపాదన!

ఆర్థిక లక్ష్యాలను చేరుకోవడానికి గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం.. మీ లక్ష్యాలు ఖచ్చితంగా ఫిక్స్​ చేసుకోవడం. ఉదాహరణకు, 2040 నాటికి, అంటే ఇప్పటి నుంచి 15 ఏళ్లలో, మీ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకు రూ. 1 కోటి అవసరం అవుతుందని మీరు భావిస్తే, దానికి అనుగుణంగా మీ ప్రణాళికను రూపొందించుకోవడం చాలా అవసరం.

ఇక్కడ.. మ్యూచువల్ ఫండ్స్​లో పెట్టుబడి పెట్టడం ద్వారా 15 ఏళ్ల కాలంలో రూ.1 కోటిని ఎలా కూడబెట్టవచ్చో తెలిపే నెలవారీ పెట్టుబడి ప్రణాళికను మేము వివరిస్తున్నాము.

అయితే, అవసరమైన నెలవారీ పెట్టుబడి మొత్తం అనేది ఆ పెట్టుబడి అందించే రాబడి రేటుపై ఆధారపడి ఉంటుందని గమనించడం ముఖ్యం.

15ఏళ్లల్లో రూ. 1కోటి- ప్రతి నెల ఎంత సిప్​ చేయాలి?

సిప్​ (రూ.)మొత్తం పెట్టుబడి (లక్షలు)రిటర్నులు (పర్సెంటేజ్​)
20,01636.03 లక్షలు12
21,99339.59 లక్షలు11
24,12743.43 లక్షలు10
26,42647.57 లక్షలు9

పెరుగుతున్న రాబడి, తగ్గుతున్న పెట్టుబడి

ఉదాహరణకు, మీ పోర్ట్‌ఫోలియో నుంచి వార్షికంగా 9% రాబడి వస్తే, మీరు నెలకు రూ. 26,426 చొప్పున పెట్టుబడి పెట్టాలి. ఈ విధంగా 15 ఏళ్లలో మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ. 47.57 లక్షలు అవుతుంది.

రెండు అంకెల రాబడి వస్తే పరిస్థితి భిన్నంగా ఉంటుంది!

మీ పెట్టుబడి 10% చొప్పున పెరిగితే, మీరు నెలవారీ సిప్​ ద్వారా రూ. 24,127 మాత్రమే జమ చేయాలి. అంటే, 15 ఏళ్ల కాలంలో మీరు చేసే మొత్తం పెట్టుబడి రూ. 43.43 లక్షలు మాత్రమే.

అదేవిధంగా, పెట్టుబడి 11% చొప్పున వృద్ధి చెందితే, మీరు చేయాల్సిన సిప్​ మొత్తం మరింత తగ్గుతుంది. అంటే, నెలకు రూ. 21,993 మాత్రమే పెట్టుబడి పెట్టాలి. అప్పుడు మీ మొత్తం కంట్రిబ్యూషన్ రూ. 39.59 లక్షలు అవుతుంది.

చివరిగా, పెట్టుబడి 12% చొప్పున పెరిగితే, మీరు ప్రతి నెలా రూ. 20,016 చొప్పున జమ చేస్తే సరిపోతుంది. తద్వారా మీరు మొత్తంగా రూ. 36.03 లక్షలు మాత్రమే పెట్టుబడి పెడతారు.

(గమనిక- ఇది సమాచారం కోసం రూపొందించిన కథనం మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ఇన్వెస్ట్​మెంట్​ చేసే ముందు సెబీ రిజిస్టర్డ్​ ఫైనాన్షియల్​ అడ్వైజర్​ని సంప్రదించడం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More