...
...
Next Story

సైబర్ కాప్: దేశవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమం.. బంధన్ బ్యాంక్ CSR చొరవ

బంధన్ బ్యాంక్ ‘సైబర్ కాప్’ అనే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాన్ని ప్రకటించింది. సైబర్ మోసాలపై అవగాహన పెంచడం, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం.

Published on: Jul 1, 2026, 17:01:08 IST
Advertisement

భారత్‌లో డిజిటల్ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడంతో ప్రజల రోజువారీ జీవితం మరింత వేగవంతంగా, సౌకర్యవంతంగా మారింది. అయితే అదే సమయంలో మోసాల పద్ధతులు కూడా వేగంగా, మరింత తెలివిగా, గుర్తించడం కష్టంగా మారాయి. 2025 చివరి నాటికి దేశంలోని ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య సుమారు 103 కోట్లకు చేరుకోగా, 2026 మే నెలలో యూపీఐ లావాదేవీల విలువ రూ.29,90,424 కోట్లకు చేరింది. ఆర్థిక సమగ్రతకు దోహదపడుతున్న ఈ డిజిటల్ వ్యవస్థలే మరోవైపు సైబర్ నేరగాళ్లకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో సురక్షితంగా ఉండటం ఇక కేవలం జాగ్రత్తగా ఉండాల్సిన అంశం మాత్రమే కాదు, రోజువారీ ఆర్థిక జీవితంలో అత్యవసర భాగంగా మారింది.

సైబర్ కాప్: దేశవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమం.. బంధన్ బ్యాంక్ CSR చొరవ
సైబర్ కాప్: దేశవ్యాప్త సైబర్ అవగాహన కార్యక్రమం.. బంధన్ బ్యాంక్ CSR చొరవ

ఈ నేపథ్యంలోనే బంధన్ బ్యాంక్ ‘సైబర్ కాప్’ అనే కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కార్యక్రమాన్ని ప్రకటించింది. సైబర్ మోసాలపై అవగాహన పెంచడం, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం లక్ష్యం. హిందుస్తాన్ టైమ్స్ ఆధ్వర్యంలో, ఎయిడెంట్ సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అమలు చేస్తున్న ఈ కార్యక్రమం.. సాధారణంగా జరుగుతున్న మోసపూరిత పద్ధతులను ప్రజలు గుర్తించేందుకు, అనుమానాస్పద పరిస్థితుల్లో వేగంగా స్పందించేందుకు, ఆన్‌లైన్ లావాదేవీల సమయంలో సురక్షిత నిర్ణయాలు తీసుకునేందుకు సహాయపడనుంది. అలాగే ‘ఆగండి, ధృవీకరించండి, ఫిర్యాదు చేయండి’ అనే సందేశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. ఎందుకంటే డిజిటల్ మోసాల ప్రపంచంలో ఒక క్షణం పాటు అప్రమత్తంగా ఉండటం పెద్ద నష్టాన్ని నివారించగలదు.

డిజిటల్ ఆర్థిక సేవల ముందువరుసలో ఉన్న బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు ఇది ఇక ఉపేక్షించదగిన సమస్య కాదు. మరింత బలమైన భద్రతా వ్యవస్థలతో పాటు ప్రజల్లో అవగాహన పెంపొందించాల్సిన అవసరం కూడా పెరిగింది. సాంకేతిక పదజాలాన్ని పక్కనబెట్టి, సైబర్ భద్రతను ప్రజలకు ఆచరణాత్మకంగా, సులభంగా అర్థమయ్యేలా, గుర్తుంచుకునేలా చేయడమే ‘సైబర్ కాప్’ లక్ష్యంగా పెట్టుకుంది.

ఎందుకు ఇది కీలకం?

గత కొన్ని సంవత్సరాలుగా మోసాల ధోరణి డిజిటల్ చెల్లింపులు, మొబైల్ యాప్ ఆధారిత బ్యాంకింగ్ వైపు మళ్లింది. సైబర్ నేరగాళ్లు ఎప్పుడూ వ్యవస్థలను హ్యాక్ చేయరు. చాలా సందర్భాల్లో అత్యవసర పరిస్థితి సృష్టించడం, భయపెట్టడం లేదా నమ్మకం కలిగించడం ద్వారా ఓటీపీలు, కార్డు వివరాలు, మొబైల్ స్క్రీన్ యాక్సెస్ లేదా నేరుగా డబ్బు బదిలీలను పొందుతున్నారు. దీంతో సైబర్ మోసాలు సాంకేతిక సమస్య మాత్రమే కాకుండా, మానవ ప్రవర్తనకు సంబంధించిన సవాలుగా కూడా మారాయి.

దీనికి ప్రతిస్పందనగా ప్రభుత్వ వ్యవస్థలు కూడా మరింత బలోపేతం అయ్యాయి. నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్, 1930 హెల్ప్‌లైన్ వంటి వ్యవస్థలు ఆర్థిక మోసాలను నివేదించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటి ద్వారా వేల కోట్ల రూపాయల నష్టాన్ని నివారించగలిగారు. అయినప్పటికీ, నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే నివారణకు తొలి అడుగు ఇంకా ప్రజల అవగాహన నుంచే ప్రారంభమవుతుందనే విషయం స్పష్టమవుతోంది.

ప్రతి భారతీయుడికి పరిచయమైన ముఖం

ప్రజా అవగాహన కార్యక్రమానికి మరింత బలం చేకూర్చేందుకు బంధన్ బ్యాంక్ ప్రముఖ సినీ దర్శకుడు రోహిత్ శెట్టీని భాగస్వామిగా ఎంచుకుంది. పోలీస్ యూనివర్స్ ని ఆధారంగా చేసుకుని రూపొందించిన తన చిత్రాల ద్వారా చట్టం, శాంతిభద్రతలు, ఉత్కంఠభరిత కథనాల ప్రతీకగా ఆయన దేశవ్యాప్తంగా విశేష గుర్తింపు పొందారు. ఆయన భాగస్వామ్యం ఈ ప్రచారానికి ప్రజలకు సులభంగా అనుసంధానమయ్యే, విశ్వసనీయతను పెంచే అంశంగా నిలుస్తోంది. అప్రమత్తత, తక్షణ స్పందన, ప్రజా అవగాహన వంటి అంశాలపై దృష్టి సారించిన ఈ కార్యక్రమంలో, మోసాల నుంచి రక్షణ పొందడంలో కొన్ని క్షణాల సరైన నిర్ణయం ఎంత కీలకమో ప్రజలకు తెలియజేయడం ప్రధాన లక్ష్యంగా చేసుకుంది.

"సైబర్ మోసం నేడు సాధారణ భారతీయులు ఎదుర్కొంటున్న అతిపెద్ద బెదిరింపులలో ఒకటి. సైబర్ కాప్ ద్వారా, వయసు లేదా నేపథ్యంతో నిమిత్తం లేకుండా ప్రతి వ్యక్తికి ఆన్‌లైన్‌లో తమను తాము రక్షించుకోవడం ఎలాగో తెలియాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అవగాహనే మనకున్న అతిశక్తిమంతమైన ఆయుధం."
— రోహిత్ శెట్టి, చలనచిత్ర దర్శకుడు & సైబర్ కాప్ బ్రాండ్ అంబాసిడర్.

'సైబర్ కాప్' విస్తృత కార్యక్రమంలో భాగంగా ఈ భాగస్వామ్యం మరింత బలమైన సామాజిక సందేశాన్ని అందిస్తోంది. సైబర్ భద్రత అనేది కేవలం నిపుణులకు మాత్రమే సంబంధించిన సాంకేతిక అంశం కాదని, ప్రతి ఒక్కరి దైనందిన జీవితాన్ని ప్రభావితం చేసే సమస్యగా దీనిని ప్రధాన చర్చల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందనే సంకేతాన్ని ఇది ఇస్తోంది.

ప్రచారం లక్ష్యం

ఫిషింగ్ లింకులు, నకిలీ కస్టమర్ కేర్ నంబర్లు, ఇతరుల పేరుతో చేసే మోసపూరిత కాల్స్, అక్రమ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్‌లు, ఒత్తిడి సృష్టించి చెల్లింపులు చేయించే మోసాలు వంటి వివిధ రకాల సైబర్ నేరాలపై ‘సైబర్ కాప్’ దృష్టి సారిస్తోంది. ఈ మోసాలు ఎలా జరుగుతాయో చూపించడమే కాకుండా, అలాంటి పరిస్థితుల్లో కాసేపు ఆగి ఆలోచించడం, సమాచారం నిజమో కాదో ధృవీకరించడం, సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయడం వంటి చర్యలను ప్రజలకు తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.

ఇది ప్రజా అవగాహన కార్యక్రమాల్లో చోటుచేసుకుంటున్న విస్తృత మార్పుకు ప్రతిబింబంగా నిలుస్తోంది. కేవలం హెచ్చరికలు జారీ చేయడం సరిపోదని, ప్రజల్లో గుర్తింపు, అవగాహన, చర్యలకు దారితీసే అలవాట్లను పెంపొందించడం కూడా అవసరమని ఈ కార్యక్రమం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో, దేశ డిజిటల్ జీవన విధానంలో సైబర్ మోసాలు ఇంకా తీవ్రంగా కొనసాగుతున్న సమయంలో ‘సైబర్ కాప్’ ఒక బ్రాండ్ ప్రచార కార్యక్రమంగా మాత్రమే కాకుండా, సమయోచిత జోక్యంగా ముందుకు వచ్చింది.

డిజిటల్ సేవలను వినియోగించే భారతీయుల సంఖ్య పెరుగుతున్న తరుణంలో, సురక్షితమైన డిజిటల్ అలవాట్లను విస్తృత స్థాయిలో ప్రోత్సహించే బాధ్యతాయుత సంస్థగా బంధన్ బ్యాంక్ తనను తాను నిలబెట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. ఆన్‌లైన్ లావాదేవీలను భయపడకుండా నిర్వహించేందుకు అవసరమైన అవగాహన, ఆత్మవిశ్వాసాన్ని వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. వినియోగదారుల అవసరాలను కేంద్రంగా పెట్టుకుని, వారు ఉన్న చోటుకే చేరుకుని, ఆచరణలో ఉపయోగపడే సాధనాలను అందించే విధానాన్ని ఇది అనుసరిస్తోంది.

ప్రతిరోజూ కొత్త రూపాల్లో సైబర్ మోసాలు వెలుగులోకి వస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో అవగాహన అనేది ఇకపై ఐచ్ఛిక అంశం కాదు. సమయానికి స్పందిస్తారా, ఆలస్యంగా నష్టపోతారా అనే విషయాన్ని నిర్ణయించే కీలక అంశంగా అది మారింది. సైబర్ భద్రతను సులభంగా అర్థమయ్యేలా, సులభంగా గుర్తుంచుకునేలా, ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తమ రోజువారీ జీవితంలో ఆచరించేలా చేయాలనే ఉద్దేశంతోనే ‘సైబర్ కాప్’ను ప్రారంభించారు.

గమనిక: ఈ కథనాన్ని బ్రాండ్ తరఫున హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో రూపొందించింది. దీనిలో హిందుస్తాన్ టైమ్స్ సంపాదకీయం లేదా జర్నలిస్టుల బృందం భాగస్వామ్యం కాలేదు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe