NEET PG answer key : ఏ క్షణంలోనైనా నీట్​ పీజీ ఆన్సర్​ కీ విడుదల.. 30న ఫలితాలు!

నీట్ పీజీ 2026 ప్రాథమిక ఆన్సర్ కీతో పాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ త్వరలోనే విడుదల చేయనుంది. చరిత్రలోనే తొలిసారిగా అభ్యర్థుల సమాధానాల ప్రతిని వెల్లడిస్తుండటం విశేషం. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 21, 2026, 13:20:39 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వైద్య విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నీట్ పీజీ 2026 ఆన్సర్ కీ విడుదలకు రంగం సిద్ధమైంది! నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్) ప్రైమరీ ఆన్సర్ కీతో పాటు అభ్యర్థులు పరీక్షలో నమోదు చేసిన రెస్పాన్స్ షీట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచేందుకు వేగంగా ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 30 నాటికి తుది ఫలితాలను ప్రకటించాల్సి ఉన్నందున, ఏ క్షణంలోనైనా ఈ కీ విడుదలయ్యే అవకాశం ఉంది.

నీట్​ పీజీ 2026 అప్డేట్స్..
నీట్​ పీజీ 2026 అప్డేట్స్..

చరిత్రలోనే తొలిసారిగా రెస్పాన్స్ షీట్లు!

ఈ ఏడాది నీట్ పీజీ పరీక్షల నిర్వహణలో బోర్డు ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అధికారిక ఆన్సర్ కీతో పాటు అభ్యర్థులు పరీక్ష సమయంలో ఎంచుకున్న సమాధానాల షీట్లను కూడా తొలిసారిగా బహిర్గతం చేస్తోంది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందని ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్వశ్చన్ ఐడీ, సరైన సమాధానం, అభ్యర్థి ఎంచుకున్న ఆప్షన్‌లను క్షుణ్ణంగా పోల్చి చూసుకునే వెసులుబాటు మొదటిసారిగా అందుబాటులోకి వస్తోంది.

తెలుగు రాష్ట్రాల వైద్య విద్యార్థుల్లో ఉత్కంఠ..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వేలాది మంది యువ వైద్యులు ఈ ఏడాది పీజీ కోర్సులైన ఎండీ, ఎంఎస్, డిప్లొమా సీట్ల కోసం పోటీ పడుతున్నారు. గత ఆగస్టు 30న దేశవ్యాప్తంగా ఈ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. అయితే జైపూర్ కేంద్రంలో సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బంది ఎదుర్కొన్న అభ్యర్థులకు సెప్టెంబర్ 5న ప్రత్యేకంగా రీ-ఎగ్జామ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలన్నీ సఫీగా పూర్తి కావడంతో ఆన్సర్ కీ విడుదల ప్రక్రియ తుది దశకు చేరింది.

అభ్యంతరాలకు స్వల్ప సమయం మాత్రమే!

ప్రాథమిక కీ విడుదలైన తర్వాత, అభ్యర్థులు తమ రెస్పాన్స్ షీట్లతో సరిచూసుకుని ఏవైనా సమాధానాలపై సందేహాలుంటే అభ్యంతరాలు తెలిపేందుకు బోర్డు అవకాశం కల్పించనుంది. ఫలితాల ప్రకటనకు సెప్టెంబర్ 30 ఆఖరి గడువుగా ఉన్నందున, అభ్యంతరాల స్వీకరణకు చాలా తక్కువ సమయం మాత్రమే లభిస్తుంది. కాబట్టి విద్యార్థులు ముందే తమ లాగిన్ వివరాలతో సిద్ధంగా ఉండటం మంచిది.

నీట్​ ఆన్సర్ కీ డౌన్‌లోడ్ చేసుకునే విధానం..

  • ఎన్బీఈఎమ్ఎస్ అధికారిక వెబ్‌సైట్ natboard.edu.in ను సందర్శించండి.
  • హోమ్‌పేజీలో కనిపించే 'NEET PG Answer Key 2026' లేదా రెస్పాన్స్ షీట్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా జన్మదిన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వండి.
  • స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే మీ ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ను సరిచూసుకోండి.
  • భవిష్యత్తు అవసరాల కోసం దాన్ని పీడీఎఫ్ రూపంలో సేవ్ చేసుకుని ప్రింట్ తీసి ఉంచుకోండి.
  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More