టెస్టు ట్వంటీ.. క్రికెట్లో కొత్త ఫార్మాట్.. టెస్టు, వన్డే, టీ20 తర్వాత నాలుగోది.. ఎలా ఆడతారంటే?

ఇప్పుడు క్రికెట్లో టెస్టు, వన్డే, టీ20.. ఇలా మూడు ఫార్మాట్లున్నాయి. కానీ త్వరలోనే నాలుగో ఫార్మాట్ రాబోతుంది. అదే టెస్టు ట్వంటీ. టెస్టులు ప్లస్ టీ20 కలిపి కొత్త ఫార్మాట్ ను డిజైన్ చేశారు. దీని వివరాలు ఇక్కడ చూసేయండి. 

Published on: Oct 17, 2025, 09:23:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

క్రికెట్లో టెస్టు, వన్డే, టీ20 తర్వాత ఇప్పుడు నాలుగో ఫార్మాట్ రాబోతుంది. అవును మీరు చదివింది నిజమే. ఈ ఫార్మాట్ కూడా ప్రయోగాత్మకంగా టెస్టులు, టీ20లను కలిపి రూపొందించారు. అందుకే ఈ ఫార్మాట్ కు ‘టెస్టు ట్వంటీ’ అనే పేరు పెట్టారు. ఆటను మరింత మందికి చేరువ చేయడమే దీని లక్ష్యం. కొత్తగా రాబోయే ఛాంపియన్ షిప్ 13 నుండి 19 సంవత్సరాల వయస్సు గల యువకులను టార్గెట్ గా చేసుకుంది.

క్రికెట్లో కొత్త ఫార్మాట్
క్రికెట్లో కొత్త ఫార్మాట్

టెస్టు ట్వంటీ

మాథ్యూ హేడెన్, హర్భజన్ సింగ్, సర్ క్లైవ్ లాయిడ్, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలు కలిసి నిర్వాహకుడు గౌరవ్ బహిర్వానీతో కలిసి సరికొత్త ఫార్మాట్ ను ఆవిష్కరించారు. సరికొత్త ఛాంపియన్ షిప్ ను 'టెస్టు ట్వంటీ' అని పిలుస్తారు. ఇది ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఉంటుంది. కొత్త ఛాంపియన్షిప్ మొదటి రెండు ఎడిషన్లు ఇండియాలోనే జరుగుతాయి. మొదటి ఎడిషన్ జనవరి 2026 నాటికి ప్రారంభం కానుంది.

కొత్త ఫార్మాట్ ఇలా

టెస్టు ట్వంటీ ఫార్మాట్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. టెస్టులో అయితే నాలుగు ఇన్నింగ్స్ లు ఉంటాయి. టీ20లో అయితే ఇన్నింగ్స్ కు 20 ఓవర్లుంటాయి. ఇప్పుడు ఈ రెండు కలిపితేనే టెస్టు ట్వంటీ. ఈ మ్యాచ్ లో మొత్తం 80 ఓవర్లుంటాయి. ప్రతి జట్టు 20 ఓవర్ల చొప్పున రెండు ఇన్నింగ్స్ లు ఆడతాయి. ముందు ఒక టీమ్ 20 ఓవర్లు బ్యాటింగ్ చేస్తుంది. ఆ తర్వాత మరో టీమ్ బ్యాటింగ్ కు వస్తుంది. అది ముగిశాక ముందు బ్యాటింగ్ చేసిన టీమ్ ఫస్ట్ 20 ఓవర్లలో ఎంత స్కోరు చేసిందో మళ్లీ అక్కడి నుంచే బ్యాటింగ్ కొనసాగుతుంది.

ఆ తర్వాత రెండో టీమ్ కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరును కంటిన్యూ చేస్తుంది. చివరకు టార్గెట్ ను ఛేజ్ చేస్తే గెలుస్తుంది. ఈ ఫార్మాట్ లొ టెస్టు మ్యాచ్ మాదిరిగానే ప్రతి జట్టు రెండుసార్లు బ్యాటింగ్ చేస్తుంది. టెస్టు, టీ20 క్రికెట్ రెండింటి నియమాలు వర్తిస్తాయి. అయితే కొత్త ఫార్మాట్ కు అనుగుణంగా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి. మ్యాచ్ లు గెలుపు, ఓటమి, టై లేదా డ్రాతో ముగుస్తాయి.

ఇతర దేశాలకు

"క్రికెట్ విషయానికి వస్తే ఎంతో క్రేజ్ ఉన్న మన దేశంలో మేము దీన్ని ప్రారంభించాలని స్పష్టంగా అనుకుంటున్నా. రెండేళ్ల పాటు ఇండియాలో ఈ ఛాంపియన్ షిప్ జరుగుతుంది. దీనిని టూరింగ్ లీగ్ గా మార్చాలనే ఆలోచన ఉంది. చివరికి మేము దానిని వేర్వేరు దేశాలకు తీసుకెళ్లాలనుకుంటున్నాము. దీనికి కారణం ఏమిటంటే సాంప్రదాయేతర దేశాలు క్రికెట్లో అడుగు పెట్టాలనే ఆసక్తితో ఉన్నా. ఆ దేశాల పిల్లలు కూడా భారతదేశంలో మాదిరిగా క్రికెట్ ను ఒక క్రీడగా ఎంచుకోవాలని నేను కోరుకుంటున్నా" అని గౌరవ్ హిందుస్థాన్ టైమ్స్ ప్రశ్నకు సమాధానమిచ్చాడు.

వాళ్లకు ఫ్రీ

ఈ టెస్టు ట్వంటీ ఛాంపియన్ షిప్ ను 13 నుంచి 19 ఏళ్ల వయసున్న యువతకు ఫ్రీగా చూసే అవకాశం కల్పించనున్నారు. వారు కేవలం ఐడి కార్డును సమర్పించాల్సి ఉంటుంది. వాళ్లకు స్టేడియంలోకి ఫ్రీ ఎంట్రీ ఉంటుంది. "మేము స్టేడియాలను నింపుతాము. దీనికి సమయం పడుతుంది. కానీ మేము అది చేసి చూపిస్తాము’’ అని గౌరవ్ పేర్కొన్నాడు.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More