LPG Bookings : బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే గ్యాస్ సిలిండర్‌ డెలివరీ - కేంద్రం కీలక ప్రకటన

వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. సిలిండర్‌ను బుక్ చేసిన రెండ్రోజుల్లోనే డెలివరీ అవుతుందని తెలిపింది. ప్రభుత్వ చర్యలతో LPG ఉత్పత్తిని 25 శాతం పెంచినట్లు వెల్లడించింది.

Published on: Mar 11, 2026, 19:10:49 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంతో వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ఆందోళనలు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో దేశంలోని ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ - కేంద్రం కీలక ప్రకటన
ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ - కేంద్రం కీలక ప్రకటన

భయాందోళనలకు గురి కావొద్దు - కేంద్రం

గ్యాస్ సిలిండర్‌ను బుక్ చేసిన రెండున్నర రోజుల్లోనే సిలిండర్‌ డెలివరీ అవుతుందని కేంద్రం పేర్కొంది. ప్రభుత్వ చర్యలతో LPG ఉత్పత్తిని 25 శాతానికి పెంచామని ప్రకటించింది. హార్ముజ్‌ జలసంధితో సంబంధం లేని రూట్ల ద్వారా చమురు దిగుమతి అవుతోందని వివరించింది. హార్ముజ్‌ నుంచి ఆగిపోయిన సప్లై కంటే ఎక్కువ చమురునే సేకరించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఎల్పీజీ సిలిండర్ల విషయంలో ప్రజలెవరూ భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియంశాఖ పేర్కొంది. రెండున్నర రోజుల సాధారణ డెలివరీ ప్రక్రియను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.

భారత్ కు ముడి చమురు సరఫరాలు సురక్షితంగా ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాతా శర్మ విలేకరులతో అన్నారు.ముడి చమురును హార్ముజ్ జలసంధి కాని మార్గాల నుంచి తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

" కస్టమర్లు సిలిండర్లను హడావిడిగా బుక్ చేయాల్సిన అవసరం లేదు. భయాందోళనలకు గురి కావొద్దు. సాధారణంగానే బుకింగ్స్ అవుతాయి' అని సుజాతా శర్మ ప్రకటించారు. గ్యాస్ సిలిండర్ల మార్కెట్ విషయంలో బ్లాక్ మార్కెటింగ్ కు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

“దాదాపు 40 దేశాల నుంచి భారత్ ముడి చమురును దిగుమతి చేసుకుంటోంది. చమురు మార్కెటింగ్ కంపెనీలు వివిధ వనరుల నుండి వివిధ ముడి సరుకులను సేకరించాయి. భారతదేశం యొక్క ముడి దిగుమతులలో 70 శాతం ఇప్పుడు హోర్ముజ్ జలసంధి వెలుపల మార్గాల నుండి వస్తున్నాయి” అని సుజాతా శర్మ వివరించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More