NZ vs SA Semi Final: టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో న్యూజిలాండ్.. సెమీఫైనల్లో చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా.. అలెన్ మెరుపు సెంచరీ
టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఫిన్ అలెన్ (33 బంతుల్లో 100 నాటౌట్).. న్యూజిలాండ్ ను ఫైనల్ చేర్చాడు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 170 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ కేవలం 12.5 ఓవర్లలో వికెట్ కోల్పోయి చేజ్ చేసింది.
టీ20 వరల్డ్ కప్ 2026లో సెమీఫైనల్ వరకు అజేయంగా ఉన్న సౌతాఫ్రికా.. న్యూజిలాండ్ దెబ్బకు అదిరిపోయింది. చిత్తుచిత్తుగా ఓడి ఫైనల్ చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఫిన్ అలెన్ టీ20 వరల్డ్ కప్ చరిత్రలోనే ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన వేళ న్యూజిలాండ్ తొలి సెమీఫైనల్లో 9 వికెట్లతో గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది.

ఫిన్ అలెన్ సునామీ
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 తొలి సెమీఫైనల్ పూర్తి ఏకపక్షంగా సాగింది. ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికాను పూర్తిగా డామినేట్ చేసింది న్యూజిలాండ్. ముఖ్యంగా చేజింగ్ లో ఫిన్ అలెన్ విశ్వరూపం చూపించాడు. కేవలం 33 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 సిక్స్ లతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. దీంతో న్యూజిలాండ్ 170 పరుగుల లక్ష్యాన్ని కేవలం 12.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి చేజ్ చేసింది.
అతని దెబ్బకు సౌతాఫ్రికా బౌలర్ మార్కో యాన్సెన్ 2.5 ఓవర్లలోనే ఏకంగా 53 పరుగులు సమర్పించుకున్నాడు. అలెన్ కు తోడు మరో ఓపెనర్ టిమ్ సైఫర్ట్ కూడా 33 బంతుల్లోనే 58 పరుగులు చేసి ఔటయ్యాడు. అతని ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్స్ లు ఉన్నాయి. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు కేవలం 9.1 ఓవర్లలోనే 117 పరుగులు జోడించడం విశేషం.
సౌతాఫ్రికా.. స్టార్లంతా విఫలం
ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 169 రన్స్ చేసింది. కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ (18), క్వింటన్ డికాక్ (10), రికెల్టన్ (0), డేవిడ్ మిల్లర్ (6) విఫలమయ్యారు. ఒక దశలో సౌతాఫ్రికా 77 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో డివాల్డ్ బ్రెవిస్ (34), ట్రిస్టన్ స్టబ్స్ (29), మార్కో యాన్సెన్ (55) ఆదుకున్నారు. దీంతో సౌతాఫ్రికా ఆ మాత్రం స్కోరైనా చేసింది.
టీ20 వరల్డ్ కప్ లో వరుసగా 7 మ్యాచ్ లు గెలిచి హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. సెమీస్ లో చిత్తు చిత్తుగా ఓడింది. కిందటిసారి ఫైనల్ చేరిన సఫారీలు.. ఈసారి సెమీఫైనల్లోనే ఇంటిదారి పట్టారు. ఇండియా, ఇంగ్లండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో న్యూజిలాండ్ ఫైనల్లో తలపడుతుంది. ఈ మ్యాచ్ మార్చి 8న జరుగుతుంది.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


