...
...
Next Story

మీ PF బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవాలా? ఇలా సింపుల్​గా తెలుసుకోండి..

PF balance check : మీ పీఎఫ్ ఖాతాలో డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసుకోవడానికి 5 సులుభమైన మార్గాలను ఇక్కడ తెలియజేస్తున్నాము. మీరు పీఎఫ్​ అకౌంట్​ని చెక్​ చేసుకునే సమయంలో ఇది ఉపయోగకరంగా ఉంటుంది.

Published on: Dec 6, 2025, 09:10:08 IST
Advertisement

మీ పీఎఫ్​ బ్యాలెన్స్​ని ఎలా చెక్​ చేసుకోవాలా మీకు అవగాహన లేదా! అది అంత పెద్ద ప్రాసెస్​ కాదని మీరు గుర్తించాలి. ఈ కింద ఇచ్చిన 5 మార్గాల ద్వారా సింపుల్​గా మీ పీఎప్​ అమౌంట్​ ఎంత ఉందో తెలుసుకోవచ్చు. అవి..

పీఎఫ్​ బ్యాలెన్స్ చెక్: నెలవారీ జమ వివరాలు తెలుసుకునేందుకు 5 సులువైన మార్గాలు..

1. ఈపీఎఫ్​ఓ వెబ్‌సైట్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలి-

మీ PF బ్యాలెన్స్​ని చెక్​ చేసుకునేందుకు 5 సులభమైన మార్గాలు..
మీ PF బ్యాలెన్స్​ని చెక్​ చేసుకునేందుకు 5 సులభమైన మార్గాలు..

ముందుగా, అధికారిక ఈపీఎఫ్​ఓ వెబ్‌సైట్(www.epfindia.gov.in)ను సందర్శించండి.

“Our Services” విభాగంలోకి వెళ్లి, “For Employees” పై క్లిక్ చేయండి.

“Services” మెనూలో, “Member Passbook” ను ఎంచుకోండి.

లాగిన్ పేజీలో, మీ యూఏఎన్​ (యూనివర్సల్ అకౌంట్ నంబర్), పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి.

లాగిన్ అయిన తర్వాత, మీ పీఎఫ్ బ్యాలెన్స్​తో పాటు, మీ మొత్తం ట్రాన్సాక్షన్​ హిస్టరీ కూడా కనిపిస్తుంది.

2. ఎస్​ఎంస్​ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్-

ఈ ఫార్మాట్‌లో ఎస్​ఎంఎస్​ కంపోజ్ చేయండి: EPFOHO UAN ENG

('ENG' స్థానంలో మీకు నచ్చిన భాష మొదటి మూడు అక్షరాలను ఉంచండి. ఉదాహరణకు, తెలుగు కోసం TEL లేదా హిందీ కోసం HIN).

ఈ ఎస్​ఎంఎస్​ని 7738299899 నంబర్‌కు పంపండి.

3. మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్-

మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వండి.

కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. ఆ వెంటనే, మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలతో కూడిన ఎస్​ఎంఎస్​ మీకు అందుతుంది.

4. ఉమంగ్ యాప్‌లో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్-

ఉమంగ్​ యాప్ (లేదా వెబ్‌సైట్) తెరవండి.

మీ బ్యాలెన్స్, ట్రాన్సాక్షన్​ హిస్టరీని చూడటానికి పీఎఫ్​ పాస్‌బుక్‌ను యాక్సెస్ చేయండి.

5. ఉమంగ్​ యాప్ డౌన్‌లోడ్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ (వివరణాత్మకంగా)-

ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ నుంచి ఉమంగ్​ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

మీ మొబైల్ నంబర్‌తో సైన్ అప్ చేసి, ఓటీపీ ద్వారా ధృవీకరించండి.

యాప్ తెరిచి, ఎడమవైపు పైభాగంలో ఉన్న మూడు అడ్డగీతలపై (Three Horizontal Lines) నొక్కండి.

సర్వీస్ డైరెక్టరీకి వెళ్లి, ఈపీఎఫ్​ఓ అని వెతకండి.

View Passbook ఎంచుకోండి, మీ యూఏఎన్​, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయి మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి.

ఉద్యోగులకు సేవింగ్స్​ స్కీమ్​..

ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్​) అనేది ఉద్యోగుల కోసం ఉద్దేశించిన ఒక పొదుపు పథకం. ఈ స్కీమ్​లో ఉద్యోగి నెలవారీ జీతంలో కొంత భాగాన్ని యాజమాన్యం, ఉద్యోగి ఇద్దరూ జమ చేస్తారు. ఇలా జమ అయిన నిధులను పదవీ విరమణ సమయంలో లేదా ఉద్యోగం లేని సందర్భాల్లో తీసుకోవచ్చు. ఇది ఉద్యోగుల భవిష్యత్తుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఉద్యోగం లేని సందర్భంలో, పీఎఫ్ బ్యాలెన్స్‌లో (యాజమాన్యం, ఉద్యోగి వాటాలు, సంపాదించిన వడ్డీ సహా) 75% మొత్తాన్ని వెంటనే విత్‌డ్రా చేసుకోవచ్చు. మిగిలిన 25% మొత్తాన్ని కూడా ఒక సంవత్సరం తర్వాత తీసుకోవడానికి వీలుంటుంది.

అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పూర్తి పీఎఫ్ బ్యాలెన్స్‌ను (మినిమమ్ 25%తో పాటు) పూర్తిగా విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతి ఉంది. అవి..

  • 55 సంవత్సరాలు దాటిన తర్వాత పదవీ విరమణ చేస్తే.
  • శాశ్వత వైకల్యం లేదా పనిచేయడానికి అసమర్థత ఏర్పడితే.
  • ఉద్యోగం కోల్పోతే.
  • స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుంటే.
  • శాశ్వతంగా భారతదేశాన్ని విడిచి వెళ్లే సందర్భంలో.

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe