Tata Aeris : టాటా ఏరిస్​ కాంపాక్ట్ సెడాన్ కొనాలా? వాల్యూ ఫర్​ మనీ వేరియంట్ ఇదే..

Tata Aeris price : కొత్త టాటా ఏరిస్​ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! టాటా ఏరిస్​ వేరియంట్లు, వాటి ధరలు, వాటి ఫీచర్లు సహా వాల్యూ ఫర్​ మనీ వేరియంట్​ ఏదో ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

Published on: Oct 1, 2026, 06:45:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

టాటా మోటార్స్ తమ పాపులర్ టిగోర్ స్థానంలో సరికొత్త డిజైన్, అధునాతన సాంకేతికతతో 'టాటా ఏరిస్' కాంపాక్ట్ సెడాన్‌ను ఇటీవలే లాంచ్ చేసిన విషయం తెలిసిందే రూ. 5.29 లక్షల నుండి ప్రారంభమై రూ. 9.74 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరల శ్రేణిలో లభిస్తున్న ఈ కారు మార్కెట్‌లో ఇప్పటికే ఉన్న మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్, హ్యుందాయ్ ఆరాలకు గట్టి పోటీనిస్తోంది. మరి పెట్రోల్, సీఎన్జీ ఆప్షన్లతో వచ్చిన ఈ టాటా ఏరిస్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? ఇందులోని వేరియంట్లు, వాటి ఫీచర్లు, వాటి ధరలు, వాల్యూ ఫర్ మనీ మోడల్​ వంటి వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా ఏరిస్​ కాంపాక్ట్ సెడాన్
టాటా ఏరిస్​ కాంపాక్ట్ సెడాన్

టాటా ఏరిస్ ఇంజిన్, గేర్‌బాక్స్ ఆప్షన్లు..

టాటా ఏరిస్‌లో నమ్మకమైన 1.2-లీటర్ 3-సిలిండర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారు.

పెట్రోల్ వర్షన్: ఇది 86 బీహెచ్​పీ పవర్, 113 ఎన్​ఎం టాక్‌ను ఉత్పత్తి చేస్తుంది.

సీఎన్జీ వర్షన్: ఇది 75 బీహెచ్​పీ పవర్, 96.5 ఎన్​ఎం టాక్‌ను అందిస్తుంది.

ఈ రెండు ఇంధన మోడళ్లలోనూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ ఏఎంటీ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. బూట్ స్పేస్ కోల్పోకుండా టాటా పేటెంట్ ట్విన్-సిలిండర్ సాంకేతికతను ఇందులో ఉపయోగించారు.

టాటా ఏరిస్- వేరియంట్ల వారీగా ధరలు, ఇంజిన్, ఫీచర్లు
వేరియంట్లుస్మార్ట్ప్యూర్ప్యూర్+క్రియేటివ్అకంప్లీష్డ్
ఎక్స్​షోరూం ధరరూ. 5.29 లక్షలు - రూ. 6.29 లక్షలురూ. 6.14 లక్షలు - రూ. 7.69 లక్షలురూ. 6.74 లక్షలు - రూ. 8.29 లక్షలురూ. 7.49 లక్షలు - రూ. 9.04 లక్షలురూ. 8.19 లక్షలు - రూ. 9.74 లక్షలు
ఇంజిన్- ట్రాన్స్​మిషన్
  • పెట్రోల్ ఎంటీ
    • సీఎన్జీ ఎంటీ
  • పెట్రోల్ ఎంటీ/ఏఎంటీ
    • సీఎన్జీ ఎంటీ/ఏఎంటీ
  • పెట్రోల్ ఎంటీ/ఏఎంటీ
  • సీఎన్జీ ఎంటీ/ఏఎంటీ
  • పెట్రోల్ ఎంటీ/ఏఎంటీ
  • సీఎన్జీ ఎంటీ/ఏఎంటీ
  • పెట్రోల్ ఎంటీ/ఏఎంటీ
  • సీఎన్జీ ఎంటీ/ఏఎంటీ
ఫీచర్లు
  • హాలోజెన్ హెడ్​ల్యాంప్స్
  • హాలోజెన్ టెయిల్ లైట్స్
  • 14-ఇంచ్ స్ట్రీల్ వీల్స్
  • సెమీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్
  • ఫాబ్రిక్ సీట్ అప్​హోలిస్ట్రీ
  • రేరే సీట్ అడ్జెస్టెబుల్ హెడ్​రెస్ట్స్
  • మాన్యూవల్ ఏసీ
  • టిల్ట్ అడ్జెస్టెబుల్ స్టీరింగ్ వీల్
  • 6 ఎయిర్​బ్యాగులు
  • రేర్ పార్కింగ్ సెన్సార్లు
  • Isofix చైల్డ్ సీట్ యాంకరేజెస్
  • ఏబీఎస్ విత్ ఈబీడీ అండ్ సీఎస్​సీ
  • ఈఎస్​పీ విత్ ట్రాక్షన్ కంట్రోల్

స్మార్ట్​తో పాటు

  • బ్లూటూత్ అనేబుల్డ్ సెమీ డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్
  • 2-స్పీకర్ సౌండ్ సిస్టెమ్
  • స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్
  • 4 పవర్ విండోస్
  • హైట్ అడ్జెస్టెబుల్ డ్రైవర సీట్ (మాన్యువల్)
  • 15డబ్ల్యూ టైప్-ఏ, టైప్-సీ ఛార్జింగ్ సాకెట్స్
  • డే/నైట్ ఐఆర్​వీఎం
  • రేర్ డీఫాగర్
  • సెంట్రల్ లాకింగ్ సిస్టెమ్
  • ఫాలో మీ హోమ్ ఫంక్షన్ ఆన్ హెడ్​లైట్స్
  • ఎలక్ట్రికల్లీ అడ్జెస్టెబుల్ ఓఆర్​వీఎం
  • స్టీల్ వీల్స్​పై ప్లాస్టిక్ కవర్స్
  • బాడీ కలర్డ్ డోర్ హ్యాండిల్స్

ప్యూర్​తో పాటు

  • 8-ఇంచ్ ఇన్​ఫోటైన్​మెంట్ సిస్టెమ్
  • వైర్​లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్​ కార్​ప్లే
  • 4-స్పీకర్ సౌండ్ సిస్టెమ్
  • రివర్స్ పార్కింగ్ కెమెరా
  • రేర్ ఏసీ వెంట్స్
  • 65డబ్ల్యూ ఫ్రెంట్ యూఎస్బీ టైప్​ సీ ఛార్జింగ్
  • క్రూయిజ్ కంట్రోల్
  • ఫ్రెంట్, రేర్ సెంటర్ ఆర్మ్​రెట్
  • టీపీఎంఎస్
  • షార్క్ ఫిన్ యాంటీనా
  • హిల్​ హెల్డ్​ కంట్రోల్
  • 15- ఇంచ్ స్టైలైజ్డ్ స్టీల్ వీల్స్ ఆన్ పెట్రోల్ వేరియంట్స్
  • 14-ఇంచ్ స్టైలైజ్డ్ స్టీల్ వీల్స్ ఆన్ సీఎన్జీ వేరియంట్స్

ప్యూర్+ తో పాటు

  • ఆటో ఎల్​ఈడీ హెడ్​లైట్స్, ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్
  • ఆటో-ఫోల్డింగ్ ఓఆర్​వీఎం
  • ఎల్​ఈడీ ఫాగ్ ల్యాంప్స్
  • ఎల్​ఈడీ టెయిల్ లైట్స్
  • 15-ఇంచ్ అలాయ్ వీల్స్ ఆన్ పెట్రోల్ వేరియంట్స్
  • 10.25-ఇంచ్ ఇన్​ఫోటైన్​మెంట్​ సిస్టెమ్
  • కనెక్టెడ్ కార్ టెక్నాలజీ
  • 360-డిగ్రీ
  • ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్
  • కూల్డ్ గ్లోవ్ బాక్స్
  • రెయిన్ సెన్సింగ్ వైపర్స్
  • డ్యూయెల్ టోన్ రూఫ్

క్రియేటివ్​తో పాటు

  • వెంటిలేడెట్ ఫ్రెంట్ సీట్లు
  • వైర్​లెస్ ఫోన్ ఛార్జర్
  • 2 ట్వీటర్స్
  • సీట్, ఆర్మ్​రెస్ట్​లపై లెథరెట్ అప్​హోలిస్ట్రీ
  • 65డబ్ల్యూ రేర్ యూఎస్బీ టైప్ సీ ఛార్జర్
  • 360 డిగ్రీ కెమెరా ఫీడ్​ ద్వారా డాష్​క్యామ్ రికార్డర్
  • క్రోమ్ డోర్ హ్యాండిల్స్, వెయిస్ట్ డీటైలింగ్
  • మ్యాగజైన్ పాకెట్స్

టాటా ఏరిస్- ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్..

చెల్లించే ధరకు, పొందే ఫీచర్లను బట్టి చూస్తే టాటా ఏరిస్ క్రియేటివ్ వేరియంట్ బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తుందని ఆటోమొబైల్​ నిపుణులు చెబుతున్నారు. టాప్ వేరియంట్ అకంప్లిష్డ్‌తో పోలిస్తే తక్కువ ధరకే 10.25-ఇంచుల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, అలాయ్ వీల్స్, కనెక్టెడ్ కార్ ఫీచర్లు ఇందులో లభిస్తాయి. మరోవైపు, నగర ప్రయాణాల్లో ట్రాఫిక్ నివారణకు, తక్కువ రన్నింగ్ కాస్ట్‌కు సీఎన్జీ ఆటోమేటిక్ కాంబినేషన్ అత్యుత్తమ అనుభూతిని ఇస్తుంది.

మరి మీరు ఈ టాటా ఏరిస్​ కాంపాక్ట్ సెడాన్​ని కొంటున్నారా?

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More