Tata Aeris : టాటా ఏరిస్ ఎంట్రీ- టిగోర్ స్థానంలో సరికొత్త కాంపాక్ట్ సెడాన్! ధర, ఫీచర్లు..

ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ తన ప్రాచుర్యం పొందిన టిగోర్ సబ్-కాంపాక్ట్ సెడాన్‌ను భారీ మార్పులతో ‘టాటా ఆరిస్’ పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. రూ. 5.29 లక్షల ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో వచ్చిన ఈ కార్ల డెలివరీలు నవరాత్రి తొలి రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే..

Published on: Sep 25, 2026, 13:09:35 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత ఆటోమొబైల్ రంగాన్ని శాసిస్తున్న టాటా మోటార్స్.. సబ్-4 మీటర్ సెడాన్ విభాగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అలరించిన టిగోర్ సెడాన్‌ను సరికొత్త రూపురేఖలతో, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ‘టాటా ఏరిస్’ పేరుతో భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ కొత్త కారు ప్రారంభ ధరను రూ. 5.29 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించగా, టాప్ వేరియంట్ ధర రూ. 9.19 లక్షల వరకు ఉంటుంది.

టాటా ఏరిస్​గా టాటా టిగోర్​ ఫేస్​లిఫ్ట్..
టాటా ఏరిస్​గా టాటా టిగోర్​ ఫేస్​లిఫ్ట్..

ఈ రోజు నుంచే ఈ టాటా ఏరిస్ బుకింగ్‌లు ప్రారంభం కాగా, పండుగ సీజన్‌ను పురస్కరించుకుని నవరాత్రి మొదటి రోజు నుంచే కస్టమర్లకు డెలివరీలు అందించనున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది. ఏరిస్ మోడల్ స్మార్ట్, ప్యూర్, ప్యూర్+, క్రియేటివ్, అకంప్లిష్డ్ అనే 5 విభిన్న వేరియంట్లలో లభించనుంది.

టాటా నెక్ట్స్-జెన్ ‘ఎక్స్-ఆల్ఫా’ ప్లాట్‌ఫామ్‌పై రూపుదిద్దుకున్న ఈ టాటా టిగోర్​ ఫేస్​లిఫ్ట్​ని కేవలం వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే అందుబాటులో ఉంచుతున్నారు. కమర్షియల్/ట్యాక్సీ రంగానికి మాత్రం పాత టిగోర్ ఎక్స్‌ప్రెస్ మోడల్ కొనసాగుతుందని టాటా ప్రకటించింది. మార్కెట్‌లో ఇది మారుతీ సుజుకీ డిజైర్, హోండా అమేజ్ వంటి దిగ్గజ కార్లతో నేరుగా పోటీపడనుంది.

ఈ నేపథ్యంలో ఈ టాటా ఏరిస్​కి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

టాటా ఏరిస్ ఎక్స్​టీరియర్..

పాత టిగోర్‌తో పోలిస్తే ఏరిస్ మోడల్ ముందు, వెనుక భాగాల డిజైన్లలో అద్భుతమైన మార్పులు చేశారు.

ఫ్రంట్ లుక్: హ్యాచ్‌బ్యాక్ మోడల్ టియాగో తరహాలో సరికొత్త ఫ్రంట్ గ్రిల్, కొత్త డిజైన్ కలిగిన హెడ్‌లాంప్స్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, ఫాగ్ లాంప్స్‌తో కారుకు ప్రీమియం లుక్ ఇచ్చారు.

రియర్ డిజైన్: వెనుక వైపు కనెక్టెడ్ లైట్ స్ట్రిప్, రీ-డిజైన్ చేసిన ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్‌తో పాటు సరికొత్త బ్లాక్-అవుట్ అలాయ్ వీల్స్‌ను అందించారు.

కలర్స్ అండ్ డైమెన్షన్స్: కారు గ్రౌండ్ క్లియరెన్స్ 170 ఎంఎంగా ఉండటంతో భారతీయ రోడ్లు, గుంతలను నడిపేటప్పుడు సౌకర్యవంతంగా ఉంటుంది. డాండెల్ డ్రిజిల్, నైట్రో క్రిమ్సన్, డ్యూన్ గ్లో, డేటోనా గ్రే, ప్యూర్ గ్రే, ప్రిస్టైన్ వైట్ అనే 6 ఆకర్షణీయమైన రంగుల్లో ఈ టాటా ఏరిస్ లభిస్తుంది.

టాటా ఏరిస్ ఇంటీరియర్, ఫీచర్లు..

ఏరిస్ క్యాబిన్ లోపల అడుగుపెడితే ఎంతో విలాసవంతమైన అనుభూతి కలుగుతుంది. లైట్ బీజ్, గ్రే రంగుల కాంబినేషన్‌తో ఫ్యాబ్రిక్ తరహా డాష్‌బోర్డ్‌ను అమర్చారు.

ఇన్ఫోటైన్‌మెంట్: 10.25-ఇంచుల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

కంఫర్ట్ ఫీచర్లు: సెగ్మెంట్‌లోనే మొదటిసారిగా వెంటిలేటెడ్ సీట్లు, డ్యూయల్ స్మార్ట్‌ఫోన్ వైర్‌లెస్ ఛార్జింగ్, 360-డిగ్రీ కెమెరా, ఇన్-బిల్ట్ డాష్‌క్యామ్ రికార్డింగ్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, 65డబ్ల్యూ టైప్-సీ ఛార్జింగ్ పోర్టులను ఏర్పాటు చేశారు.

టాటా టిగోర్​ ఫేస్​లిఫ్ట్ ఏఎంటీ మోడళ్లలో రోటరీ డైయిల్ గేర్ సెలెక్టర్, ప్యాడిల్ షిఫ్టర్లు కూడా లభిస్తాయి. సీఎన్జీ ప్యాక్‌తో కూడిన వేరియంట్‌లో 70 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది.

టాటా ఏరిస్ ఇంజిన్, పర్ఫార్మెన్స్..

టాటా ఏరిస్‌లో విశ్వసనీయమైన 1.2-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌ను ఇచ్చారు.

పవర్ ఆటోమేటిక్: పెట్రోల్ మోడ్‌లో ఈ ఇంజిన్ 86 బీహెచ్​పీ పవర్, 113 ఎన్​ఎం టాప్‌ను ఉత్పత్తి చేస్తుంది. సీఎన్‌జీ మోడ్‌లో 75 బీహెచ్​పీ పవర్, 96.5 ఎన్​ఎం టాక్ ఇస్తుంది.

ట్విన్ సిలిండర్ టెక్నాలజీ: టాటాకు చెందిన పేటెంట్ ట్విన్-సిలిండర్ సీఎన్జీ సాంకేతికత వల్ల బూట్ స్పేస్ కోల్పోకుండానే మంచి మైలేజ్ సాధించవచ్చు. డైరక్ట్ సీఎన్జీ స్టార్ట్ సదుపాయం కూడా ఈ టాటా ఏరిస్​లో ఉంది.

గేర్‌బాక్స్ ఎంపికలు: 5-స్పీడ్ మాన్యువల్‌తో పాటు, అత్యంత సౌకర్యవంతమైన 5-స్పీడ్ ఏఎంటీ (సీఎన్జీ-ఏఎంట కాంబినేషన్) ఆటోమేటిక్ వేరియంట్‌లోనూ కారు లభ్యమవుతోంది.

టాటా ఏరిస్ భద్రతకు ప్రాధాన్యం!

ఎప్పటిలాగే భద్రతకు టాటా అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు స్టాండర్డ్‌గా వస్తాయి. వీటితో పాటు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, బ్రేకింగ్ ద్వారా టార్క్ వెక్టరింగ్, రోల్-ఓవర్ మిటిగేషన్, హిల్ హోల్డ్ కంట్రోల్, కార్నరింగ్ స్టెబిలిటీ కంట్రోల్, క్రాష్ తర్వాత తక్షణ ఎస్​ఓఎస్ సపోర్ట్ వంటి అత్యుత్తమ భద్రతా ఫీచర్లను ఇందులో పొందుపరిచారు.

తక్కువ ధరలో లగ్జరీ ఫీచర్లు, అగ్రశ్రేణి భద్రత కోరుకునే కుటుంబాలకు టాటా ఏరిస్ ఒక బెస్ట్ ఆప్షన్‌గా నిలవనుంది.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More