ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ పద్ధతిలో 20 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారానే రిక్రూట్ చేస్తారు. ఇందుకు సంబంధించిన వివరాలను యూనివర్శిటీ అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.
ముఖ్య వివరాలు:
- ఉద్యోగ నోటిఫికేషన్ - ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్రం
- ఉద్యోగాల పేరు - అసిస్టెంట్ వార్డెన్స్.
- మొత్తం ఖాళీలు - 20 (10 మంది మహిళా అభ్యర్థులు, 10 మంది పురుషులు).
- అర్హతలు - ఎంఏ సోషియాలజీ లేదా ఎంఏ సోషల్ వర్క్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ ఇన్ హాస్పిటాలిటీ, హోటల్ మేనేజ్మెంట్, బీఎస్సీ హానర్స్(కమ్యూనిటీ సైన్స్).
- రిక్రూట్ మెంట్ విధానం - ఇంటర్వ్యూల ద్వారా
- పని చేయాల్సిన ప్రాంతాలు - రాజేంద్రనగర్, హైదరాబాద్, అశ్వరావుపేట, జగిత్యాల, పాలెం, వరంగల్, సిరిసిల్ల, కంది, రుద్రూర్, ఆదిలాబాద్.
- నెల జీతం - రూ. 35 వేలు
- పని సమయాలు - ఉదయం 7 గంటల నుంచి ఉదయం 10.30 గంటలు, మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు.
- ఇంటర్వ్యూ తేదీ - జూన్ 20, 2025(సమయం ఉదయం 10 గంటలు)
- ఇంటర్వ్యూ జరిగే ప్రాంతం -నాల్డెజ్ మేనేజ్మెంట్ సెంటర్, పీజేటీఏయూ క్యాంపస్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
- ఇంటర్వ్యులకు వచ్చే అభ్యర్థులు తగిన ధ్రువపత్రాలు తీసుకురావాలి. ధ్రువపత్రాలను జిరాక్స్ తీసుకుని అటెస్ట్ చేయించుకోవాలి. వీటితో పాటుఆధార్, బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డు కాపీలు ఉండాలి.
- అప్లికేషన్ తో పాటు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు ఉండాలి.
- అధికారిక వెబ్ సైట్ లింక్ - https://www.pjtau.edu.in/index.html

{{^htLoading}} {{/htLoading}}
ఈ లింక్ పై క్లిక్ చేసి ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోవచ్చు
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}