RCB vs KKR IPL 2026 : ఐపీఎల్ 2026 సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) సత్తా చాటుతోంది. బుధవారం రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెంచరీ సాధించాడు. కేవలం 60 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ…. జట్టును విజయతీరాలకు చేర్చాడు.

193 పరుగుల భారీ లక్ష్యంతో ఆర్సీబీ చేజింగ్ కు దిగింది. గత రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న విరాట్…. వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్‌లోనే నాలుగు ఫోర్లు బాది 18 పరుగులు రాబట్టాడు. మరో ఓపెనర్ జాకబ్ బెథెల్ (15) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా…. కార్తీక్ త్యాగి వేసిన షార్ట్ పిచ్ బంతికి అతడికే రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన దేవదత్ పడిక్కల్ (39) కోహ్లీకి అద్భుతమైన సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించడంతో ఆర్‌సీబీ విజయం తేలికైంది. 10 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు స్కోరు 101/1గా నమోదైంది.
మధ్యలో తడబాటు…..
కార్తీక్ త్యాగి తన రెండో స్పెల్‌లో పడిక్కల్‌ను అవుట్ చేయడంతో ఈ జోడీ విడిపోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజత్ పాటిదార్ (11), టిమ్ డేవిడ్ (2) స్వల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో మ్యాచ్ కాస్త ఉత్కంఠగా మారింది. ముఖ్యంగా మనీష్ పాండే పట్టిన అద్భుతమైన వన్-హ్యాండెడ్ క్యాచ్‌కు టిమ్ డేవిడ్ పెవిలియన్ చేరాల్సి వచ్చింది.
ఒకవైపు వికెట్లు పడుతున్నా, విరాట్ కోహ్లీ మాత్రం పట్టు వదల్లేదు. 19వ ఓవర్‌లో తన ఐపీఎల్ కెరీర్‌లో 9వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన నాలుగో ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఆఖరి ఓవర్‌లో జిితేష్ శర్మ ఫోర్ కొట్టడంతో మరో 5 బంతులు మిగిలి ఉండగానే ఆర్‌సీబీ గెలుపొందింది. కేకేఆర్ బౌలర్లలో త్యాగి (4 ఓవర్లలో 3/32), సునీల్ నరైన్ (4 ఓవర్లలో 01/31) మాత్రమే వికెట్లు తీశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (18) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా…. భువనేశ్వర్ కుమార్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం అజింక్యా రహానే (19), యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రఘువంశీ (50+) ఈ సీజన్‌లో తన నాలుగో హాఫ్ సెంచరీని నమోదు చేసి, 21 ఏళ్ల లోపు వయసులో ఒకే సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన కేకేఆర్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. కామెరాన్ గ్రీన్ (32), రింకూ సింగ్ మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించగలిగింది.
{{/usCountry}}టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిన్ అలెన్ (18) మెరుపు ఆరంభాన్ని ఇచ్చినా…. భువనేశ్వర్ కుమార్ అతడిని క్లీన్ బౌల్డ్ చేశాడు. అనంతరం అజింక్యా రహానే (19), యువ సంచలనం అంగ్క్రిష్ రఘువంశీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. రఘువంశీ (50+) ఈ సీజన్‌లో తన నాలుగో హాఫ్ సెంచరీని నమోదు చేసి, 21 ఏళ్ల లోపు వయసులో ఒకే సీజన్‌లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన కేకేఆర్ ప్లేయర్‌గా చరిత్రకెక్కాడు. కామెరాన్ గ్రీన్ (32), రింకూ సింగ్ మెరుపులు మెరిపించడంతో కేకేఆర్ భారీ స్కోరు సాధించగలిగింది.
{{/usCountry}}ఈ విజయంతో ఆర్‌సీబీ 12 మ్యాచ్‌ల్లో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇక గుజరాత్ కూడా 16 పాయింట్ల సాధించినప్పటికీ నెట్ రన్ రేట్ కారణంతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో హైదరాబాద్, నాల్గో స్థానంలో పంజాబ్ ఉండగా…ఐదో స్థానంలో చెన్నై టీమ్ ఉంది.
ఇక బెంగళూరుపై ఓటమి చెందటంతో కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు మరింత సన్నగిల్లయ్యాయి. 11 మ్యాచుల్లో 4 విజయాలతో 9 పాయింట్లు మాత్రం సాధించినట్లు అయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో కేకేసీఆర్… 8వ స్థానానికి పడిపోయింది.