రిషబ్ పంత్ ఫ్యాన్స్ అందిరికి గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ త్వరలో తిరిగి రాబోతున్నాడు. అన్ని ఫార్మాట్‌లలో టీమిండియాకు ప్రధాన వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్.. జులైలో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టెస్టులో కాలు విరగ్గొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకున్న పంత్.. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా ఎ జట్టుతో జరగబోయే రెండు నాలుగురోజుల మ్యాచ్‌లకు ఇండియా ఎ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్

ఇండియా, సౌతాఫ్రికా మధ్య వచ్చే నెల 14 నుంచి తొలి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్టులు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ మ్యాచ్ లలో రిషబ్ పంత్ తనను తాను నిరూపించుకుంటే మళ్లీ టీమిండియాలోకి అడుగుపెడతాడు. ఇక పంత్ రెండు వేర్వేరు స్క్వాడ్‌లను నడిపించనున్నాడు.
మొదటి నాలుగు రోజుల మ్యాచ్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్, ఎన్. జగదీసన్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ వంటి ఆటగాళ్లు పంత్ సారథ్యంలో ఆడనున్నారు. ఇక రెండో నాలుగు రోజుల మ్యాచ్ నవంబర్ 6న అదే వేదికలో జరుగుతుంది. ఇందులో కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ వంటి నలుగురు ఇంగ్లాండ్‌లో ఆడిన ఆటగాళ్లు కూడా ఈ స్క్వాడ్‌లో ఉన్నారు.
రిషబ్ పంత్ గాయం, రికవరీ
ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌కు పంత్ గాయపడ్డాడు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. కాలు విరిగినప్పటికీ పంత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి పోరాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ ఇన్నింగ్స్ టీమ్ స్కోర్‌ను పెంచడంలో కీలకమైంది. అయితే గాయం తీవ్రత వల్ల పంత్ ఆ సిరీస్‌లోని చివరి టెస్టుతో పాటు, ఆసియా కప్, స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న పర్యటనకు కూడా దూరంగా వచ్చింది.
ఇప్పుడు పంత్ తిరిగి వస్తుండడంతో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు అతను కచ్చితంగా టీమ్ లో ఉండే అవకాశం ఉంది. గత నెల రోజుల నుంచి తన కాలుకు ప్లాస్టర్ వేసిన ఫోటోలను, స్టోరీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కోలుకోవడం ఆలస్యం అవుతోందని పంత్ నిరాశ వ్యక్తం చేశాడు. కానీ అతని పట్టుదల, బీసీసీఐ పర్యవేక్షణలో చేసిన ప్రత్యేక రిహాబ్ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి.
{{/usCountry}}ఇప్పుడు పంత్ తిరిగి వస్తుండడంతో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు అతను కచ్చితంగా టీమ్ లో ఉండే అవకాశం ఉంది. గత నెల రోజుల నుంచి తన కాలుకు ప్లాస్టర్ వేసిన ఫోటోలను, స్టోరీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కోలుకోవడం ఆలస్యం అవుతోందని పంత్ నిరాశ వ్యక్తం చేశాడు. కానీ అతని పట్టుదల, బీసీసీఐ పర్యవేక్షణలో చేసిన ప్రత్యేక రిహాబ్ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి.
{{/usCountry}}పంత్ త్వరగా పూర్తి ఫామ్‌లోకి వచ్చి ఇంగ్లాండ్‌పై చూపించిన ఆటతీరును మళ్లీ కొనసాగించాలని భారత్ ఆశిస్తోంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన పంత్.. తర్వాతి మూడు టెస్టుల్లో (బర్మింగ్‌హామ్, లార్డ్స్, మాంచెస్టర్) ఒక్కొక్క హాఫ్ సెంచరీలు చేశాడు.