Royal Enfield : రాయల్ ఎన్‌ఫీల్డ్ లవర్స్‌కి బిగ్ అప్డేట్! క్లాసిక్ 350 సిగ్నేచర్ వైట్ లాంచ్- ధర..
రాయల్ ఎన్‌ఫీల్డ్ తన పాపులర్ మోటార్‌సైకిల్ 'క్లాసిక్ 350' లైనప్‌లో కొత్తగా 'సిగ్నేచర్ వైట్' ఎడిషన్‌ను అందుబాటులోకి తెచ్చింది. రూ. 2.24 లక్షల ప్రారంభ ధరతో విడుదలైన ఈ మోడల్ ఆకట్టుకునే కాస్మోటిక్ మార్పులు, ప్రీమియం ఫీచర్లతో రైడర్లను అలరిస్తోంది.
బైక్ ప్రియులకు రాయల్ ఎన్‌ఫీల్డ్ బిగ్ అప్‌డేట్ ఇచ్చింది. భారత టూవీలర్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన 'క్లాసిక్ 350' సిరీస్‌లో కొత్తగా ‘సిగ్నేచర్ వైట్’ కలర్ వేరియంట్‌ను ప్రవేశపెట్టింది. రూ. 2.24 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో మార్కెట్లోకి వచ్చిన ఈ కొత్త మోడల్, మొత్తం లైనప్‌లోని టాప్-ఎండ్ వేరియంట్ 'ఎమరాల్డ్' షేడ్ సరసన చేరింది. అధికారిక షోరూమ్‌లలో బుకింగ్‌లు ప్రారంభం కాగా, త్వరలోనే డెలివరీలు మొదలుకానున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సిగ్నేచర్ వైట్ వేరియంట్‌కి చెందిన పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సిగ్నేచర్ వైట్- వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్..
కొత్తగా వచ్చిన రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సిగ్నేచర్ వైట్ ఎడిషన్ మోటార్‌సైకిల్‌కు క్లాసిక్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్‌తో ప్రత్యేక రూపాన్ని ఇచ్చారు. ఫ్యూయల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్స్‌ను తెల్లటి రంగులో డిజైన్ చేసి, వాటిపై డార్క్ పిన్‌స్ట్రైపింగ్ జోడించారు. మడ్‌గార్డ్స్, బైక్ ఫ్రేమ్, హెడ్‌ల్యాంప్ హౌసింగ్‌లకు బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చి కాంట్రాస్ట్ లుక్ తీసుకొచ్చారు.
సైడ్ మిర్రర్లు, ఎగ్జాస్ట్ పైపులకు క్రోమ్ ఫినిషింగ్ ఇవ్వడంతో పాటు రైడర్, పిలియన్ల కోసం ప్రత్యేకమైన బ్రౌన్ కలర్ టూరింగ్ సీటును అందించారు. సైడ్ ప్యానెల్‌పై కొత్త క్లాసిక్ లోగో, ఫ్యూయల్ ట్యాంక్‌పై స్టెన్సిల్ శైలి డికాల్స్ బైక్ అందాన్ని మరింత పెంచాయి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సిగ్నేచర్ వైట్- ఇంజిన్..
ఈ కొత్త వేరియంట్ క్లాసిక్ రెట్రో శైలిని కొనసాగిస్తూ ట్రెడిషనల్ వైర్-స్పోక్ వీల్స్, ట్యూబ్ టైర్లతో వస్తుంది. ఇందులో ముందు వైపు 19-అంగుళాల వీల్, వెనుక వైపు 18-అంగుళాల వీల్ ఇచ్చారు. లైనప్‌లో అలాయ్ వీల్స్ కోరుకునే వారి కోసం గన్ గ్రే, స్టెల్త్ బ్లాక్ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి.
సాంకేతిక పరంగా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సిగ్నేచర్ వైట్ వేరియంట్లో ఎలాంటి మార్పులు చేయలేదు. మునుపటి లాగే విశ్వసనీయమైన 349 సీసీ, సింగిల్-సిలిండర్, జే-సిరీస్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 20.2 హెచ్‌పీ పవర్, 27 ఎన్‌ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానించిన ఈ ఇంజిన్ లాంగ్ రైడ్స్‌కు, సిటీ ట్రాఫిక్‌కు ఎంతో అనువుగా ఉంటుంది.
రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 సిగ్నేచర్ వైట్- ఫీచర్లు, ధర..
ఈ బైక్ సిగ్నేచర్ వైట్ ఎడిషన్‌లో అడ్వాన్స్‌డ్ ఫీచర్ల ప్యాకేజీని జోడించారు. ఇందులో అసిస్ట్ అండ్ స్లిప్పర్ క్లచ్ అమర్చడం వల్ల సిటీ ట్రాఫిక్‌లో క్లచ్ వాడకం చాలా తేలికగా మారి గేర్ షిఫ్టింగ్ స్మూత్‌గా సాగుతుంది. దీనితో పాటు అడ్జస్టబుల్ క్లచ్ అండ్ బ్రేక్ లివర్లు, యూఎస్‌బీ టైప్-సీ ఫాస్ట్ చార్జింగ్ పోర్ట్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ అందించే 'ట్రిప్పర్ నావిగేషన్' ప్రామాణికంగా లభిస్తాయి.
ప్రస్తుతం భారత మార్కెట్లో క్లాసిక్ 350 ప్రారంభ వేరియంట్ ధర రూ. 1.87 లక్షల నుంచి మొదలవుతుండగా, టాప్-ఎండ్ మోడల్‌గా వచ్చిన 'సిగ్నేచర్ వైట్' ధర రూ. 2.24 లక్షలుగా ఉంది. మెకానికల్ మార్పులు ఏవీ లేనప్పటికీ, కొత్త కలర్ స్కీమ్, రిచ్ ఫీచర్లతో క్లాసిక్ లవర్స్‌ను ఈ బైక్ అమితంగా ఆకట్టుకునే అవకాశం ఉంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


