ప్రియుడి సాయంతో భర్తను చంపి.. ముక్కలు ముక్కలుగా నరికిన భార్య.. మర్డర్ క్లూ ఇదే

తన వివాహేతర సంబంధం గురించి తెలిసిపోయిందని, ప్రియుడితో కలిసి భర్తను కిరాతకమగా చంపి, మృతదేహాన్ని ముక్కలుగా నరికి గంగానదిలో పడేసిన మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు.

Published on: Dec 23, 2025, 12:33:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాను తలపించేలా జరిగిన ఒక హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను భార్య, ఆమె ప్రియుడు కలిసి అతి కిరాతకంగా అంతమొందించారు. సాక్ష్యాలను మాయం చేసేందుకు మృతదేహాన్ని ముక్కలుగా నరికి వేర్వేరు ప్రాంతాల్లో పడేశారు.

ప్రియుడి సాయంతో భర్తను చంపి.. ముక్కలు ముక్కలుగా నరికిన భార్య.. మర్డర్ క్లూ ఇదే
ప్రియుడి సాయంతో భర్తను చంపి.. ముక్కలు ముక్కలుగా నరికిన భార్య.. మర్డర్ క్లూ ఇదే

అసలేం జరిగింది?

పోలీసుల కథనం ప్రకారం.. సంభాల్‌లోని చున్నీ మొహల్లాకు చెందిన రాహుల్, రూబీ దంపతులు. గత కొంతకాలంగా రూబీకి స్థానిక యువకుడు గౌరవ్‌తో వివాహేతర సంబంధం ఉంది. నవంబర్ 18న వీరి వ్యవహారం రాహుల్‌కు తెలిసిపోయింది. దీంతో ఇంట్లో పెద్ద గొడవ జరిగింది. తన గుట్టు తెలిసిపోయిందన్న కోపంతో, అడ్డు తొలగించుకోవాలని రూబీ, గౌరవ్ కలిసి పథకం వేశారు.

నవంబర్ 18న గౌరవ్ ఇనుప రాడ్, చెప్పులు కుట్టే సుత్తితో రాహుల్ తలపై బలంగా కొట్టి అక్కడికక్కడే ప్రాణం తీశాడు. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.

మృతదేహాన్ని ముక్కలు చేయడానికి మిషన్ అద్దెకు..

హత్య చేసిన మరుసటి రోజు సాక్ష్యాలను మాయం చేసేందుకు నిందితులు వ్యూహం రచించారు. ఘంటాఘర్ మార్కెట్‌లో ప్లాస్టిక్ షీట్లు, రెండు పెద్ద బ్యాగులు కొనుగోలు చేశారు. మృతదేహాన్ని నరకడానికి 'జీతూ మిస్త్రీ' అనే వ్యక్తి దగ్గర ఒక కట్టర్ మెషిన్ (గ్రైండర్)ను అద్దెకు తీసుకున్నారు.

ఆ మెషిన్ సాయంతో రాహుల్ తల, కాళ్లను మొండెం నుంచి వేరు చేశారు. తల, కాళ్లను ఒక ఎర్రటి బ్యాగులో సర్ది రాజ్‌ఘాట్ వంతెన పైనుంచి గంగానదిలో పడేశారు. మొండెం ఉన్న బ్యాగును పత్రౌవా రోడ్డులోని ఈద్గా సమీపంలో ఉన్న కాలువలో పడేశారు.

అనంతరం రాహుల్ బట్టలు, రక్తం అంటిన నిందితుల దుస్తులను ఊరి బయట తగలబెట్టారు.

కేసును మలుపు తిప్పిన 'టాటూ'

హత్య చేసిన తర్వాత ఏమీ తెలియనట్లుగా రూబీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త నవంబర్ 18 నుంచి కనిపించడం లేదని మిస్సింగ్ రిపోర్ట్ ఇచ్చింది. అయితే, కాలువలో ఒక మొండెం తేలుతూ కనిపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

ఆ మొండెం ఎవరిదో గుర్తుపట్టడం కష్టంగా ఉన్న సమయంలో, మృతుడి ఎడమ చేతిపై ఉన్న 'రాహుల్' (Rahul) అనే టాటూ పోలీసులకు కీలక ఆధారంగా దొరికింది. ఆ ఆధారంతో దర్యాప్తు చేయగా, అది రూబీ భర్త రాహుల్ అని తేలింది. రూబీపై అనుమానం వచ్చిన పోలీసులు ఆమెను, గౌరవ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం బయటపడింది.

"నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. వారి వద్ద నుంచి కీలక సాక్ష్యాలను సేకరించాం. వీరిద్దరిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం" అని ఎస్పీ (సిటీ) కృష్ణ కుమార్ బిష్ణోయ్ వెల్లడించారు. వివాహేతర సంబంధం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకోవడమే కాకుండా, ఒక మహిళను ఇంతటి కిరాతకానికి పురికొల్పడం స్థానికంగా కలకలం రేపుతోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More