Sanju Samson: సెల్ఫీ అడిగిన అభిమానికి రూ.40 వేల విలువైన ఫోన్ గిఫ్ట్‌గా సంజూ శాంసన్.. నువ్వు గొప్పోడివి బాసూ..

Sanju Samson: సంజూ శాంసన్ గొప్ప క్రికెటరే కాదు.. అంతకన్నా గొప్ప మనసున్న మనిషి అని మరోసారి నిరూపించుకున్నాడు. తనను సెల్ఫీ అడిగిన ఓ అభిమానికి ఏకంగా రూ.40 వేల విలువైన మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇంతకీ అతడు అలా ఎందుకు చేశాడో తెలుసా?

Published on: Apr 9, 2026, 13:37:56 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Sanju Samson: క్రికెట్ మైదానంలో తన క్లాస్ ఇన్నింగ్స్‌లతో అలరించే టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్.. తాజాగా తన ఉదారతతో అందరి మనసు గెలుచుకున్నాడు. సెల్ఫీ అడిగేందుకు వచ్చిన ఓ సామాన్య అభిమాని ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయి ఉండటాన్ని గమనించిన సంజూ.. తనే స్వయంగా ఒక ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కేరళలోని పాలక్కాడ్ సమీపంలో ఇది జరిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నువ్వు గొప్పోడివి బాసూ అంటూ ఫ్యాన్స్ అతన్ని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు.

Sanju Samson: సెల్ఫీ అడిగిన అభిమానికి రూ.40 వేల విలువైన ఫోన్ గిఫ్ట్‌గా సంజూ శాంసన్.. నువ్వు గొప్పోడివి బాసూ..
Sanju Samson: సెల్ఫీ అడిగిన అభిమానికి రూ.40 వేల విలువైన ఫోన్ గిఫ్ట్‌గా సంజూ శాంసన్.. నువ్వు గొప్పోడివి బాసూ..

అసలేం జరిగిందంటే?

పాలక్కాడ్ జిల్లాలోని కడంపజిపురంకు చెందిన శబరీష్ అనే యువకుడు ఒక కేబుల్ టెక్నీషియన్.. అంతేకాదు స్థానిక క్రికెట్ క్లబ్‌లో వికెట్ కీపర్. మంగళవారం (ఏప్రిల్ 7) సాయంత్రం అతను తన స్నేహితుడు మణికంఠన్‌తో కలిసి క్రికెట్ ఆడేందుకు మైదానానికి వెళ్తుండగా.. ముందూరు-తూత రోడ్డులోని పుంజాపాడం బస్ స్టాప్ వద్ద ఒక బ్లాక్ రేంజ్ రోవర్ కారు ఆగి ఉండటాన్ని గమనించారు. ఆ కారులో ఉన్నది తన అభిమాన క్రికెటర్ సంజూ అని గుర్తించిన శబరీష్, ఒక్కసారిగా ఉబ్బితబ్బిబ్బయ్యాడు.

అప్పుడు సంజూ వీడియో కాల్‌లో ఉండటంతో, కాసేపు వేచి ఉండాలని సైగ చేశాడు. కాల్ ముగిసిన తర్వాత సంజూ స్వయంగా కారు దిగి వచ్చి వారితో మాట్లాడాడు. ఆ ఆనందంలో శబరీష్ తన మొబైల్ తీసి సెల్ఫీ అడిగాడు. అయితే శబరీష్ వాడుతున్న ఫోన్ డిస్‌ప్లే పగిలిపోయి ఉండటంతో ఫోటో సరిగ్గా రావడం లేదని సంజూ గమనించాడు.

కారు డిక్కీ తీసి.. సరికొత్త ఫోన్ ఇచ్చి..

"నీ ఫోన్ డిస్‌ప్లే పాడైంది కదా.." అని అడిగిన సంజూ.. వెంటనే తన కారు డిక్కీ తెరిచి లోపల ఉన్న ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్ బాక్స్‌ను తీశారు. ఏమాత్రం సంకోచించకుండా దాన్ని శబరీష్‌కు అందిస్తూ.. "ఇది నీ దగ్గరే ఉంచుకో.. నీ ఫోన్ పాడైపోయింది కదా" అని చెప్పాడు.

సుమారు రూ. 40,000 విలువ చేసే ఆ ఫోన్‌ను చూసి శబరీష్ మొదట సంశయించినా, సంజూ పట్టుబట్టడంతో ఆనందంతో స్వీకరించాడు. వెళ్తూ వెళ్తూ "క్రికెట్ బాగా ఆడు" అని ఆ కుర్రాడికి ధైర్యం చెప్పి సంజూ తన ప్రయాణాన్ని కొనసాగించాడు.

మైదానంలో కష్టాలు.. బయట మాత్రం ‘రాజా’

ప్రస్తుతం సంజూ శాంసన్ ఐపీఎల్ 2026లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడుతున్నాడు. సీజన్ ఆరంభంలో వరుసగా మూడు ఓటములతో చెన్నై జట్టు ఇబ్బందుల్లో ఉండగా.. సంజూ కూడా బ్యాటింగ్‌లో ఆశించిన మేర రాణించలేకపోతున్నాడు.

అయినప్పటికీ మైదానం వెలుపల తన మంచి మనసుతో సంజూ కురిపిస్తున్న ఈ ‘ప్రేమ’ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "స్క్రీన్‌ మీద కంటే రియల్ లైఫ్ లో సంజూ పెద్ద హీరో" అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు కురుస్తోంది.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. సంజూ శాంసన్ ఫోన్ గిఫ్ట్ ఇచ్చిన అభిమాని ఎవరు?

పాలక్కాడ్ జిల్లా కడంపజిపురంకు చెందిన శబరీష్ అనే యువకుడు. అతను ఒక కేబుల్ టెక్నీషియన్, స్థానిక క్రికెటర్.

2. సంజూ శాంసన్ బహుమతిగా ఇచ్చిన ఫోన్ విలువ ఎంత?

అంతర్జాతీయ వార్తా సంస్థల సమాచారం ప్రకారం.. సంజూ గిఫ్ట్ ఇచ్చిన స్మార్ట్‌ఫోన్ విలువ సుమారు రూ. 40,000.

3. ఐపీఎల్ 2026లో సంజూ శాంసన్ ఏ జట్టుకు ఆడుతున్నారు?

సంజూ శాంసన్ ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్టు తరపున ఆడుతున్నారు.

  • Hari Prasad S
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More