ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించిన ఎస్బీఐ..
రెపో రేటును తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటన చేసిన కొద్ది రోజులకే ఎస్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు, ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్ రేట్లను సవరిస్తున్నట్టు ప్రకటించింది. తాజా రేట్లు డిసెంబర్ 15న అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.
భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ.., సీనియర్ సిటిజన్‌లతో పాటు సాధారణ ప్రజల కోసం ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లను సవరించింది. వీటితో పాటు ఎంసీఎల్ఆర్ (మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్- బేస్డ్ లెండింగ్ రేట్స్) రేట్లను సైతం సవరించినట్లు ప్రకటించింది. ఈ కొత్త రేట్లు సోమవారం, డిసెంబర్ 15, 2025 నుంచి అమల్లోకి వస్తాయి.

రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి, 5.50 శాతం నుంచి 5.15 శాతానికి తగ్గిస్తున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన కొద్ది రోజులకే, ఎస్బీఐ ఈ నిర్ణయం తీసుకుంది.
సవరించిన వడ్డీ రేట్లు..
2-3 సంవత్సరాల కాలవ్యవధి: రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను బ్యాంక్ తగ్గించింది.
సాధారణ ప్రజలకు: 6.45% నుంచి 6.40%కి తగ్గింది.
సీనియర్ సిటిజన్లకు: 6.95% నుంచి 6.90%కి తగ్గింది.
"444 రోజులు" స్పెషల్ స్కీమ్: 'అమృత్ వృష్టి' అనే ఈ నిర్దిష్ట కాలపరిమితి పథకం వడ్డీ రేటును 6.60% నుంచి 6.45%కి సవరించారు.
అత్యధిక వడ్డీ రేటు ఎంత?
రూ. 3 కోట్ల కంటే తక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై, కాలవ్యవధిని బట్టి, బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు గరిష్టంగా 6.05%, సీనియర్ సిటిజన్‌లకు 7.05% వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది.
ఇతర టెన్యూర్ల వడ్డీ రేట్ల వివరాలు (రూ. 3 కోట్ల కంటే తక్కువ)-
| టెన్యూర్ | సాధారణ ప్రజలకు | సీనియర్ సిటిజన్లకు |
|---|---|---|
| 7 రోజులు నుండి 45 రోజులు | 3.05% | 3.55% |
| 46 రోజులు నుండి 179 రోజులు | 4.90% | 5.40% |
| 180 రోజులు నుండి 210 రోజులు | 5.65% | 6.15% |
| 211 రోజులు నుండి 1 సంవత్సరం కంటే తక్కువ | 5.90% | 6.40% |
| 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల కంటే తక్కువ | 6.25% | 6.75% |
| 2 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల కంటే తక్కువ | 6.40% | 6.90% |
| 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల కంటే తక్కువ | 6.30% | 6.80% |
| 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు | 6.05% | 7.05% |
ఎస్బీఐ 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వరకు కాలపరిమితితో బహుళ డిపాజిట్ ఆప్షన్స్‌ని అందిస్తోంది.
సవరించిన ఎంసీఎల్ఆర్, ఈబీఎల్ఆర్ రేట్లు..
ఎంసీఎల్ఆర్ రేట్లు-
ఫిక్స్‌డ్ డిపాజిట్ రేట్లతో పాటు, రుణాలు ఇవ్వడానికి కనీస వడ్డీ రేటును సూచించే ఎంసీఎల్ఆర్ను కూడా ఎస్బీఐ సవరించింది.
| టెన్యూర్ | పాత రేటు | కొత్త రేటు | సవరణ (బీపీఎస్) |
|---|---|---|---|
| ఓవర్‌నైట్ | 7.90% | 7.90% | 5 |
| 1 నెల | 7.90% | 7.85% | 5 |
| 3 నెలలు | 8.30% | 8.25% | 5 |
| 6 నెలలు | 8.65% | 8.60% | 5 |
| 1 సంవత్సరం | 8.75% | 8.70% | 5 |
| 2 సంవత్సరాలు | 8.75% | 8.70% | 5 |
| 3 సంవత్సరాలు | 8.85% | 8.80% | 5 |
ఈబీఎల్ఆర్ రేటు (ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లిమిటెడ్ రేట్)-
ఎస్బీఐ తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లింక్డ్ రేటును డిసెంబర్ 15 నుంచి ( 8.15% నుంచి 7.90%కి) తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈబీఎల్ఆర్ అనేది రుణాలు (ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు కలిగినవి) కోసం ఉపయోగించే ఒక రేటు. ఇది సాధారణంగా ఆర్బిఐ రెపో రేటు వంటి బాహ్య బెంచ్‌మార్క్‌కు అనుసంధానించి ఉంటుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


