IND vs AFG 1st ODI : గిల్‌ కెప్టెన్ ఇన్నింగ్స్.. తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై భారత్ ఘన విజయం!

IND vs AFG 1st ODI : ధర్మశాలలో జరిగిన తొలి వన్డేలో వర్షం అంతరాయం కలిగించినా.. మ్యాచ్ కొనసాగింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (84 నాటౌట్) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో భారత్ 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయం సాధించింది.

Published on: Jun 14, 2026, 06:30:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ధర్మశాల వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వర్షం కారణంగా ఇరు జట్లకు చెరి 25 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో… కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ముందుండి నడిపించి జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. అఫ్గానిస్తాన్ నిర్దేశించిన 195 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు 22.5 ఓవర్లలోనే కేవలం మూడు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై భారత్ ఘన విజయం!
తొలి వన్డేలో అఫ్గానిస్తాన్‌పై భారత్ ఘన విజయం!

రాహుల్ మెరుపులు

లక్ష్య ఛేదనలో భారత జట్టుకు ఓపెనర్లు మంచి భాగస్వామ్యాన్ని అందించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కేవలం 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 84 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ 34(22 బంతుల్లో 3×4, 1×6)) పరుగుల వద్ద అవుట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిడిలార్డర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కేవలం 19 బంతుల్లోనే 39 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. గిల్, రాహుల్ జోడి అఫ్గాన్ బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతూ మ్యాచ్‌ను ముగించారు. అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 37 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టారు.

గుర్బాజ్ సెంచరీ వృథా…..

అంతకుముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ జట్టు 24.5 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌట్ అయింది. అఫ్గాన్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడారు. గుర్బాజ్ కేవలం 51 బంతుల్లోనే 8 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేసి సెంచరీ మార్కును అందుకున్నారు. ఒకానొక దశలో గుర్బాజ్ బ్యాటింగ్ చూస్తే అఫ్గానిస్తాన్ భారీ స్కోరు సాధించేలా కనిపించింది.

ఈ మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ వన్డేల్లోకి అరంగేట్రం చేసిన భారత యువ బౌలర్లు గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబే రాణించారు. గుర్నూర్ బ్రార్ 27 పరుగులిచ్చి 3 వికెట్లు తీయగా, హర్ష్ దూబే 47 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టి అఫ్గాన్ మిడిలార్డర్‌ను దెబ్బతీశారు. సీనియర్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ 27 పరుగులకు 2 వికెట్లు, నితీష్ కుమార్ రెడ్డి 31 పరుగులకు 2 వికెట్లు తీసి అఫ్గానిస్తాన్‌ను 200 పరుగుల లోపే కట్టడి చేశారు.

సంక్షిప్త స్కోర్లు:

  • అఫ్గానిస్తాన్: 24.5 ఓవర్లలో 194 ఆలౌట్ (రహ్మానుల్లా గుర్బాజ్ 102; గుర్నూర్ బ్రార్ 3/27, హర్ష్ దూబే 3/47, అర్ష్‌దీప్ సింగ్ 2/27, నితీష్ కుమార్ రెడ్డి 2/31)
  • భారత్: 22.5 ఓవర్లలో 195/3 (శుభ్‌మన్ గిల్ 84 నాటౌట్, కేఎల్ రాహుల్ 39 నాటౌట్, ఇషాన్ కిషన్ 34; రషీద్ ఖాన్ 1/37)
  • ఫలితం: భారత్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More