Kalki Bhagavan Passes Away : ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్‌ అస్తమయం

Kalki Bhagavan Passes Away: ఒన్ నెస్ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (విజయ్ కుమార్ నాయుడు) చెన్నై ఆసుపత్రిలో కన్నుమూశారు. వరదయ్యపాళెం ఆశ్రమానికి ఆయన భౌతికకాయాన్ని తరలించారు.

Published on: Sep 30, 2026, 07:39:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

ఆధ్యాత్మిక గురువు, ఒన్ నెస్(‘ఏకం’) సంస్థ వ్యవస్థాపకుడు కల్కి భగవాన్ (77) ఇకలేరు. గత కొంతకాలంగా వయోసహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన…. చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు.

కల్కి భగవాన్‌ కన్నుమూత
కల్కి భగవాన్‌ కన్నుమూత

వరదయ్యపాళెం ఆశ్రమానికి భౌతికకాయం…

చెన్నైలో కన్నుమూసిన కల్కి భగవాన్ భౌతికకాయాన్ని తిరుపతి జిల్లా వరదయ్యపాళెం మండలం బట్టలవల్లెంలోని 'ఏకం క్షేత్రం' ఆశ్రమానికి కల్కి ట్రస్ట్ ప్రతినిధులు తరలించారు. ఆధ్యాత్మిక గురువు తుది దర్శనం కోసం దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు, అనుచరులు తరలివచ్చే అవకాశం ఉందని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.

సెప్టెంబరు 30 బుధవారం నుంచి మూడు రోజుల పాటు కల్కి భగవాన్ భౌతికకాయాన్ని ఆశ్రమంలోనే ఉంచనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు ప్రకటించారు. ఈ సమయంలో భక్తులు, శిష్యులు ఆయనకు నివాళులు అర్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. శనివారం లేదా తదుపరి రోజుల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.

ఎల్ఐసీ ఉద్యోగి నుంచి ప్రస్థానం….

తమిళనాడులోని నాథం గ్రామంలో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు, తన జీవిత తొలిదశలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత ఆధ్యాత్మిక రంగం వైపు అడుగులు వేశారు. 1980ల చివర్లో చిత్తూరు జిల్లాలో 'జీవాశ్రమ్' అనే పాఠశాలను ప్రారంభించారు. కాలక్రమేణా తనను తాను శ్రీమహావిష్ణువు పదవ అవతారమైన 'కల్కి భగవాన్'గా ప్రకటించుకున్నారు.

తన భార్య పద్మావతి అమ్మతో కలిసి ఆయన 'ఒన్ నెస్' ఉద్యమాన్ని నిర్మించారు. వరదయ్యపాళెంలో బృహత్తరమైన 'గోల్డెన్ సిటీ' ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పారు. వీరిని అనుచరులు 'అమ్మ భగవాన్' అని భక్తితో పిలుచుకుంటారు. గత నాలుగు దశాబ్దాల కాలంలో సామాన్యుల నుంచి రాజకీయ నాయకులు, ప్రముఖులు, విదేశీయుల వరకు లక్షలాది మంది వీరి శిష్యులుగా మారారు. ధ్యానం, 'దీక్ష' ఆశీర్వచనం, చేతన సిద్ధాంతం (Consciousness Philosophy) ద్వారా ఈ ఆధ్యాత్మిక నెట్‌వర్క్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరించింది.

కల్కీ భగవాన్ ప్రస్థానంలో అనేక విమర్శలు ఉన్నప్పటికీ, ఆయన ట్రస్ట్‌ల ద్వారా విస్తృత సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని వందలాది గ్రామాల్లో ఉచిత తాగునీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు శుద్ధజలాన్ని అందించారు. వరదయ్యపాళెం పరిసర ప్రాంత నిరుపేదల కోసం ఆసుపత్రులు, ఉచిత వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్ల క్యాంపులు ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత విద్య, పుస్తకాల పంపిణీ, పాఠశాల మౌలిక వసతుల కల్పన వంటి కార్యక్రమాలను కూడా ట్రస్ట్ చేపట్టింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More