Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 8 స్టాక్స్‌తో లాంగ్ టర్మ్‌లో 63శాతం వరకు గెయిన్స్!
నవంబర్ 13, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గత వారం రోజులుగా కొనసాగి భారీ ర్యాలీ అనంతరం.. గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 32 పాయింట్లు పెరిగి 81,911 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 44 పాయింట్లు వృద్ధిచెంది 25,299 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 726 పాయింట్లు పెరిగి 61,518 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 7,830.60 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 6,331.17 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 35 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది. సూచీకి 25,000- 25,150 వద్ద కీలక సపోర్ట్ ఉంది. 25,400- 25,500 వద్ద రెసిస్టెన్స్ ఉంది,” అని ఛాయిస్ బ్రోకింగ్‌కి చెందిన టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ హితేష్ టైలర్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.36 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.35 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 90 డాలర్ల పైన కొనసాగుతోంది. ప్రస్తుతం బ్రెంట్ క్రూడ్ 0.8శాతం పడి బ్యారెల్‌కు 95.7 డాలర్ల వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
పలు ఆటో యాంక్సిలరీ స్టాక్స్‌కి బై రేటింగ్ ఇచ్చింది ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోనార్క్ నెట్‌వర్త్ క్యాపిటల్. లాంగ్ టర్మ్ వ్యూతో ఈ స్టాక్స్ టు బై లిస్ట్‌ని వెల్లడించింది.
ఏఎస్కే ఆటోమోటిల్- టార్గెట ప్రైజ్ రూ. 745, గెయిన్స్- 63శాతం
ఎఫ్ఐఈఎం ఇండస్ట్రీస్- టార్గెట్ రూ. 2805, గెయిన్స్- 36శాతం
మిండా కార్పొరేషన్- టార్గెట్ రూ. 867, గెయిన్స్- 32శాతం
సుంద్రమ్ ఫాస్టెనర్స్- టార్గెట్ రూ. 1315, గెయిన్స్- 23శాతం
ప్రికోల్- టార్గెట్ రూ. 810, గెయిన్స్- 23శాతం
ఎస్‌జేఎస్ ఎంటర్ప్రైజెస్- టార్గెట్ రూ. 2525, గెయిన్స్- 19శాతం
ఆర్కే ఫోర్జింగ్స్- టార్గెట్ రూ. 805, గెయిన్స్- 19శాతం
హ్యాపీ ఫోర్జింగ్స్- టార్గెట్ రూ. 1875, గెయిన్స్- 8శాతం
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


