సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1233 పాయింట్లు పెరిగి 75,693 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 388 పాయింట్లు వృద్ధిచెంది 23,441 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 315 పాయింట్లు పెరిగి 55,002 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,114.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 392.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 23200- 23120 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఇక్కడే 50-డే ఈఎంఏ ఉంది. 23560-23620 జోన్ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని ఏంజిల్ వన్‌కి చెందిన టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ చీఫ్ మేనెజర్ ఓషో కృష్ణన్.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.41 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.51శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1.3 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.18శాతం పడి బ్యారెల్‌కు 104.5 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}మంగళవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.18శాతం పడి బ్యారెల్‌కు 104.5 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
{{/usCountry}}ఫీనిక్స్ లిమిటెడ్- బై రూ. 2020, స్టాప్ లాస్ రూ. 1910, టార్గెట్ రూ. 2250
భారతీహెక్సా- బై రూ. 1685, స్టాప్ లాస్ రూ. 1600, టార్గెట్ రూ. 1835
ఇండిజీన్ లిమిటెడ్- బై రూ. 625, స్టాప్ లాస్ రూ. 590, టార్గెట్ రూ. 685