Stock market : ట్రేడర్స్ అలర్ట్- ఈ 3 స్టాక్స్​లో ట్రేడ్​తో లాభాలకు ఛాన్స్!

నవంబర్ 3, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 3, 2026, 08:15:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1233 పాయింట్లు పెరిగి 75,693 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 388 పాయింట్లు వృద్ధిచెంది 23,441 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 315 పాయింట్లు పెరిగి 55,002 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 3,114.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 392.20 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 23200- 23120 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఇక్కడే 50-డే ఈఎంఏ ఉంది. 23560-23620 జోన్ వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది,” అని ఏంజిల్ వన్​కి చెందిన టెక్నికల్ అండ్ డెరివేటివ్ రీసెర్చ్ చీఫ్ మేనెజర్ ఓషో కృష్ణన్.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 0.41 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.51శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.3 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

మంగళవారం ట్రేడింగ్ సెషన్​లో బ్రెంట్ క్రూడ్ 0.18శాతం పడి బ్యారెల్​కు 104.5 డాలర్లకు చేరింది.

స్టాక్స్​ టు బై..

ఫీనిక్స్ లిమిటెడ్- బై రూ. 2020, స్టాప్​ లాస్​ రూ. 1910, టార్గెట్​ రూ. 2250

భారతీహెక్సా- బై రూ. 1685, స్టాప్​ లాస్​ రూ. 1600, టార్గెట్​ రూ. 1835

ఇండిజీన్ లిమిటెడ్- బై రూ. 625, స్టాప్​ లాస్​ రూ. 590, టార్గెట్​ రూ. 685

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More