...
...
Next Story

Stock market : మళ్లీ 100 డాలర్లకు చేరిన క్రూడ్- ఈరోజు స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి?

అక్టోబర్ 6,2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధరను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 6, 2026, 08:16:15 IST
Advertisement

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 473 పాయింట్లు పెరిగి 72,382 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 134 పాయింట్లు వృద్ధిచెంది 22,556 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 263 పాయింట్లు పెరిగి 54,714 వద్దకు చేరింది.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 4,699.14 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,181.62 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.18 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.7శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ఇదీ చూడండి : Large cap stocks : 2ఏళ్లుగా లార్జ్ క్యాప్ స్టాక్స్ ఢమాల్- వాటి ఫ్యూచర్ ఏంటి? బై ఆర్​ సెల్?

ముడి చమురు ధర..

ఆజాద్ ఇంజనీరింగ్- బై రూ. 2927, స్టాప్​ లాస్​ రూ. 2660, టార్గెట్​ రూ. 3280- రూ. 3350

కిర్లోస్కర్ ఆయిల్ ఇంజిన్స్- బై రూ. 2244, స్టాప్​ లాస్​ రూ. 20205, టార్గెట్​ రూ. 2520- రూ. 2650

ఆదిత్య ఇన్ఫోటెక్- బై రూ. 3990, స్టాప్​ లాస్​ రూ. 3592, టార్గెట్​ రూ. 4400- రూ. 4480

థైరోకేర్ టెక్నాలజీస్- బై రూ. 542, స్టాప్​ లాస్​ రూ. 515, టార్గెట్​ రూ. 600

కార్బొరండమ్ యూనివర్సల్- బై రూ. 1267, స్టాప్​ లాస్​ రూ. 1200, టార్గెట్​ రూ. 1400

మిశ్రా ధాతు నిగమ్- బై రూ. 440, స్టాప్​ లాస్ రూ. 420, టార్గెట్​ రూ. 475

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks