Stocks to buy : ఐసీఐసీఐ బ్యాంక్ స్టాక్‌కి టైమ్ వచ్చింది! షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1225 పాయింట్లు పెరిగి 76,918 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 370 పాయింట్లు వృద్ధిచెంది 23,811 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 538 పాయింట్లు పెరిగి 55,540 వద్దకు చేరింది.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం అమెరికా మధ్యంతర ఎన్నికలవైపే చూస్తోంది. ఓటింగ్ ప్రక్రియ పూర్తై, ఫలితాలు వెలువడటం మొదలైంది. ఈ దఫా ఎన్నికల్లో ట్రంప్ ఆధిపత్యం కొనసాగుతుందా? లేదా? అనేది కీలకంగా మారింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,836.81 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,678.85 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 వారం రోజుల్లో ఏకంగా 750 పాయింట్లు పెరిగిపోయింది. కీలకమైన 23,800 జోన్‌ని అధిగమించింది. మార్కెట్లో పెట్టుబడుల బలం కనిపిస్తోంది. నిఫ్టీ50 20, 50, 100ఈఎంఏలను దాటేసింది. ఇక 200 ఈఎంఏ ఒక్కటే మిగిలింది. అది కీలక రెసిస్టెన్స్‌గా ఉంది,” అని ఏంజిల్ వన్‌కి చెందిన టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ చీఫ్ మేనేజర్ ఓషో కృషన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.4శాతం పెరిగింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.7 శాతం వృద్ధి చెందింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర దిగొస్తోంది. బ్రెంట్ క్రూడ్ 0.5శాతం పడి బ్యారెల్‌కు 103.10 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
సారేగామా- బై రూ. 565, స్టాప్ లాస్ రూ. 540, టార్గెట్ రూ. 615
ఐసీఐసీఐబ్యాంక్- బై రూ. 1430, స్టాప్ లాస్ రూ. 1360, టార్గెట్ రూ. 1570
బర్జర్పెయింట్- బై రూ. 482, స్టాప్ లాస్ రూ. 455, టార్గెట్ రూ. 535
గర్వారే హై-టెక్ ఫిలిమ్స్ లిమిటెడ్- బై రూ. 7321- రూ. 7432, స్టాప్ లాస్ రూ. 6800, టార్గెట్ రూ. 9300
కరోనా రెమిడీస్ లిమిటెడ్- బై రూ. 2248- రూ. 2282, స్టాప్ లాస్ రూ. 2088, టార్గెట్ రూ. 2900
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


