Stock market : తగ్గిన యుద్ధ భయాలు.. ఈ స్టాక్స్​లో మంచి మూమెంట్- లాభాలకు ఛాన్స్!

Stocks to buy today : జులై 10, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 10, 2026, 08:14:36 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 238 పాయింట్లు పెరిగి 76,742 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 81 పాయింట్లు వృద్ధిచెంది 23,963 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 510 పాయింట్లు పెరిగి 57,253 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్​ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 532.86 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,057.79 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 105 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 కన్సాలిడేషన్ దశకు చేరుకుంది. సూచీకి 23,650- 23,800 జోన్ కీలక సపోర్ట్​గా ఉంది. 24,150- 24,400 జోన్ రెసిస్టెన్స్​గా ఉంది. రిస్క్​ మేనేజ్​మెంట్​కి కట్టుబడి ఈ సమయంలో ఫార్మా, రియాల్టీ వంటి బలమైన సెక్టార్స్​పై ఫోకస్​ చేయడం ఉత్తమం,” అని రెలిగేర్ బ్రోకింగ్​కి చెందిన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.27 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.81శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.30 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

అమెరికా- ఇరాన్ యుద్ధ భయాలు తగ్గడంతో చమురు ధర సైతం పతనమవుతోంది. బ్రెంట్​ క్రూడ్ 0.09శాతం తగ్గి బ్యారెల్​కి 76.23 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై..

గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 882, స్టాప్​ లాస్​ రూ. 850, టార్గెట్​ రూ. 946

జిందాల్ సా- బై రూ. 272.3, స్టాప్​ లాస్​ రూ. 266, టార్గెట్​ రూ. 294

సీడీఎస్​ఎల్- బై రూ. 1348, స్టాప్​ లాస్​ రూ. 1320, టార్గెట్​ రూ. 1400

ఇండియన్ బ్యాంక్- బై రూ. 793, స్టాప్​ లాస్​ రూ. 780, టార్గెట్​ రూ. 810

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 62.58, స్టాప్​ లాస్​ రూ. 59.20, టార్గెట్​ రూ. 68

బజాజా కన్జ్యూమర్ కేర్- బై రూ. 643, స్టాప్​ లాస్​ రూ. 610, టార్గెట్​ రూ. 700

సిల్ప మెడికేర్- బై రూ. 622, స్టాప్​ లాస్​ రూ. 588, టార్గెట్​ రూ. 677

అనంత్ రాజ్- బై రూ. 569, స్టాప్​ లాస్​ రూ. 536, టార్గెట్​ రూ. 615

మనోరమ ఇండస్ట్రీస్- బై రూ. 1579, స్టాప్​ లాస్​ రూ. 1500, టార్గెట్​ రూ. 1700

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More