వినాయక చవితి కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 121 పాయింట్లు పడి 74,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 80 పాయింట్లు కోల్పోయి 23,398 వద్ద సెషన్ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 135 పాయింట్లు పెరిగి 56,607 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 978.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,070.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.29 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.48శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.56 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ముడి చమురు ధరలో ర్యాలీ కొనసాగుతోంది! మంగళవారం సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఏకంగా 1.3శాతం పెరిగి బ్యారెల్కు 107 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
పేటీఎం- బై రూ. 1808, స్టాప్ లాస్ రూ. 1744, టార్గెట్ రూ. 1934
గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 909, స్టాప్ లాస్ రూ. 882, టార్గెట్ రూ. 977
{{/usCountry}}గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 909, స్టాప్ లాస్ రూ. 882, టార్గెట్ రూ. 977
{{/usCountry}}ఎస్బీఐ- బై రూ. 995, స్టాప్ లాస్ రూ. 985, టార్గెట్ రూ. 1015
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 708, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ రూ. 725
ఎన్బీసీసీ- బై రూ. 83, స్టాప్ లాస్ రూ. 80, టార్గెట్ రూ. 86
థర్మాక్స్ కంపెనీ- బై రూ. 3682, స్టాప్ లాస్ రూ. 3615, టార్గెట్ రూ. 3870
వారీ ఎనర్జీస్ లిమిటెడ్- బై రూ. 2625, స్టాప్ లాస్ రూ. 2575, టార్గెట్ రూ. 2750
వీఏ టెక్ వాబాగ్ లిమిటెడ్- బై రూ. 2277, స్టాప్ లాస్ రూ. 2235, టార్గెట్ రూ. 2400