Stock market : పేటీఎం స్టాక్‌లో మూమెంట్- ఇప్పుడు కొంటే లాభాలు! షేర్ ప్రైజ్ టార్గెట్..
సెప్టెంబర్ 15, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
వినాయక చవితి కారణంగా సోమవారం స్టాక్ మార్కెట్లకు సెలవు. ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 121 పాయింట్లు పడి 74,782 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 80 పాయింట్లు కోల్పోయి 23,398 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 135 పాయింట్లు పెరిగి 56,607 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 978.60 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,070.87 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 50 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.29 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.48శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.56 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
ముడి చమురు ధరలో ర్యాలీ కొనసాగుతోంది! మంగళవారం సెషన్లో బ్రెంట్ క్రూడ్ ఏకంగా 1.3శాతం పెరిగి బ్యారెల్‌కు 107 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
పేటీఎం- బై రూ. 1808, స్టాప్ లాస్ రూ. 1744, టార్గెట్ రూ. 1934
గ్రాన్యూల్స్ ఇండియా- బై రూ. 909, స్టాప్ లాస్ రూ. 882, టార్గెట్ రూ. 977
ఎస్బీఐ- బై రూ. 995, స్టాప్ లాస్ రూ. 985, టార్గెట్ రూ. 1015
హెచ్డీఎఫ్సీ బ్యాంక్- బై రూ. 708, స్టాప్ లాస్ రూ. 700, టార్గెట్ రూ. 725
ఎన్బీసీసీ- బై రూ. 83, స్టాప్ లాస్ రూ. 80, టార్గెట్ రూ. 86
థర్మాక్స్ కంపెనీ- బై రూ. 3682, స్టాప్ లాస్ రూ. 3615, టార్గెట్ రూ. 3870
వారీ ఎనర్జీస్ లిమిటెడ్- బై రూ. 2625, స్టాప్ లాస్ రూ. 2575, టార్గెట్ రూ. 2750
వీఏ టెక్ వాబాగ్ లిమిటెడ్- బై రూ. 2277, స్టాప్ లాస్ రూ. 2235, టార్గెట్ రూ. 2400
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


