శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 319 పాయింట్లు పడి 81,592 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 155 పాయింట్లు కోల్పోయి 25,144 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 484 పాయింట్లు పడి 61,034 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,736.55 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,253.58 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 85 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 సూచీ స్ట్రక్చర్ పాజిటివ్‌గా ఉంది. ఒకవేళ కిందకి పడినా అది కొనుగోళ్లకు అవకాశంగా చూడాలి. 24,800- 24,700 వద్ద కీలక సపోర్ట్ ఉంది. ఇక 25,400 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే నిఫ్టీ50లో మళ్లీ ర్యాలీని చూడవచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.10 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.2శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.4 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
{{/usCountry}}సోమవారం ట్రేడింగ్ సెషన్లో బ్రెంట్ క్రూడ్ 0.7శాతం పడి బ్యారెల్‌కు 95.1 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
భారతీ ఎయిర్టెల్- బై రూ. 2106, స్టాప్ లాస్ రూ. 1990, టార్గెట్ రూ. 2340
బజాజ్ ఫైనాన్స్- బై రూ. 1117, స్టాప్ లాస్ రూ. 1045, టార్గెట్ రూ. 1260
నెస్లే ఇండియా- బై రూ. 1263, స్టాప్ లాస్ రూ. 1195, టార్గెట్ రూ. 1400
ఎంసీఎక్స్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 3600, టార్గెట్ - రూ. 3900
బీఎస్ఈ- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 3820, టార్గెట్ రూ. 4170