Stock market : ట్రేడర్స్ అలర్ట్- హెచ్​డీఎఫ్​సీ షేర్​ ప్రైజ్ టార్గెట్..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు ముడి చమురు ధర, లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Sep 17, 2026, 08:15:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బుధవారం ట్రెడింగ్ సెషన్​లో దేశీయ స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. బీఎస్​ఈ సెన్సెక్స్ 0.45 శాతం పెరిగి 74,336.45 వద్ద, నిఫ్టీ-50 0.43 శాతం లాభపడి 23,217.60 వద్ద స్థిరపడ్డాయి. ఇక బ్యాంక్​ నిఫ్టీ 0.89శాతం పెరిగి 56,292 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,751.18 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 3,534.66 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ ఫ్లాట్​గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

ఫెడ్​ రేట్​ హైక్​ వేళ బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.2 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.45శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.012 శాతం డౌన్​ అయ్యింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

US Fed rate hike : యూఎస్ ఫెడ్ రేట్ హైక్.. భారత ఆర్థిక వ్యవస్థ, స్టాక్ మార్కెట్​పై ప్రభావం ఎంత?

ముడి చమురు ధర..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ముడి చమురు ధర పడింది. బ్రెంట్​ క్రూడ్ 1.2శాతం పతనమై బ్యారెల్​కు 104.5 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

హెరిటేజ్ ఫుడ్స్- బై రూ. 409, స్టాప్​ లాస్​ రూ. 384, టార్గెట్​ రూ. 450

ఈక్లెర్క్స్ సర్వీసెస్- బై రూ. 1962, స్టాప్​ లాస్​ రూ. 1850, టార్గెట్​ రూ. 2170

జేకే పేపర్- బై రూ. 417, స్టాప్​ లాస్​ రూ. 396, టార్గెట్​ రూ. 460

హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్- బై రూ. 721, స్టాప్ లాస్- రూ. 690, టార్గెట్​ రూ. 780

ఏజిస్ లాజిస్ట్రిక్స్- బై రూ. 1381, స్టాప్​ లాస్​ రూ. 1310, టార్గెట్​ రూ. 1520

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More