శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.
Stock market : పెరుగుతున్న చమురు ధర- స్టాక్ మార్కెట్ పరిస్థితేంటి? స్టాక్స్ టు బై లిస్ట్..
నవంబర్ 27, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 380 పాయింట్లు పెరిగి 84,329 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 65 పాయింట్లు వృద్ధిచెంది 25,884 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 168 పాయింట్లు పడి 63,536 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 5,843.33 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 5,630.72 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 26,00 మర్క్ కీలక రెసిస్టెన్స్ జోన్‌గా ఉంది. అది బ్రేక్ అయితేనే సూచీ మరింత పైకి వెళుతుంది. 25,800 వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే మాత్రం నిఫ్టీ50 25,650 వరకు పడిపోవచ్చు. కానీ ప్రస్తుతానికి మార్కెట్ బుల్లిష్‌గానే ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భువ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.3 శాతం పెరిగింది.. ఎస్ అండ్ పీ 500 0.3శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.6 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో లాభాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ 0.08శాతం పడి బ్యారెల్‌కు 96.3 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
కానీ గత వారంతో పోల్చితే ముడి చమురు ధర స్థిరంగా పెరుగుతోంది! గత వారం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 91 డాలర్ల వద్ద ఉండేది.
స్టాక్స్ టు బై..
కామ్స్- బై రూ. 747, స్టాప్ లాస్ రూ. 710, టార్గెట్ రూ. 835
360వన్- బై రూ. 1214, స్టాప్ లాస్ రూ. 1158, టార్గెట్ రూ. 1334
టెక్ఎం- బై రూ. 1855, స్టాప్ లాస్ రూ. 1765, టార్గెట్ రూ. 2040
దేవ్యానీ ఇంటర్నేషనల్- బై సీఎంపీ, స్టాప్ లాస్ రూ. 119, టార్గెట్ రూ. 135

E-Paper
