Stock market : 80 డాలర్లకు చేరువలో క్రూడ్! స్టాక్​ మార్కెట్​ పరిస్థితేంటి?

Stocks to buy : ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు గిఫ్ట్​ నిఫ్టీ, చమురు ధర, లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jul 9, 2026, 08:17:57 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అమెరికా- ఇరాన్ మధ్య యుద్ధ మేఘాల మళ్లీ కమ్ముకున్న వేళ బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1677 పాయింట్లు పడి 76,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1458 పాయింట్లు పడి 56,743 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్​ లేటెస్ట్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,962.80 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 790.16 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 80 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 డైలీ ఛార్ట్​లో భారీ బేర్​ క్యాండిల్​ ఏర్పటింది. ఫలితంగా గత 5 ట్రేడింగ్​ సెషన్స్​ కదలికలను ఒక్క క్యాండిల్​ కనుమరుగు చేసింది. నిఫ్టీ50 షార్ట్​ టర్మ్​ ట్రెండ్ షార్ప్​గా కిందకి పడిపోయింది. మూడియం టర్మ్ ట్రెండ్​ మాత్రం పాజిటివ్​గానే ఉంది, నిఫ్టీ50కి 23,600 వద్ద కీలక సపోర్ట్​ ఉంది. 24,100 వద్ద రెసిస్టెన్స్​ ఉంది,” అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

బుధవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. డౌ జోన్స్​ 1.09 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 0.28శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.20 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

ఇరాన్​పై అమెరికా దాడుల నేపథ్యంలో ముడి చమురు ధర మళ్లీ పెరిగింది. గురువారం ట్రేడింగ్​ సెషన్​లో బ్రెంట్​ క్రూడ్ 1.03శాతం పెరిగి బ్యారెల్​కి 78.82 డాలర్లకు చేరింది.

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

పీపీఏపీ ఆటోమోటివ్- బై రూ. 257, స్టాప్​ లాస్​ రూ. 243, టార్గెట్​ రూ. 280

ఐనాక్స్ ఇండియా - బై రూ. 1875, స్టాప్​ లాస్​ రూ. 1788, టార్గెట్​ రూ. 2030

సెనోరెస్ ఫార్మా- బై రూ. 1409, స్టాప్​ లాస్​ రూ. 1340, టార్గెట్​ రూ. 1500

సిల్వర్ టచ్ టెక్నాలజీస్- బై రూ. 188, స్టాప్​ లాస్​ రూ. 178, టార్గెట్​ రూ. 204

ఆల్కైల్ అమైన్స్ కెమికల్స్- బై రూ. 1853, స్టాప్​ లాస్​ రూ. 1765, టార్గెట్​ రూ. 2000

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More