దీపావళి నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన ముహూరత్ ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 28 పాయింట్లు పడింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 43 పాయింట్లు కోల్పోయింది. అయితే శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో మాత్రం దేశీయ స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1718 పాయింట్లు పెరిగి 81,028 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 494 పాయింట్లు వృద్ధిచెంది 25,030 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1312 పాయింట్లు పెరిగి 59,086 వద్దకు చేరింది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి, ఏఐపై డెమొక్రాట్ల వ్యతిరేక వైఖరి వంటివి దేశీయ స్టాక్ మార్కెట్ అప్‌ట్రెండ్‌లో దూసుకెళ్లడానికి కారణం అవుతున్నాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
ముహూరత్ ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 0.25 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 700.31 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు.
కానీ గత వారం రోజులుగా ఎఫ్ఐఐలు ఇండియన్ స్టాక్ మార్కెట్లో భారీ మొత్తంలో కొనుగోళ్లు చేస్తున్నారు. శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఏకంగా రూ. 14వేల కోట్ల వరకు షేర్లను కొన్నారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50కి 25,150- 25,200 వద్ద కీలక రెసిస్టెన్స్ ఉంది. అది దాటితే సూచీ మరింత పెరగవచ్చు. ఇక 24,800 జోన్ వద్ద కీలక సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే సూచీ 24,600 వరకు వెళ్లొచ్చు,” అని ఎన్రిచ్ మనీ సీఈఓ పొన్ముడి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.46 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.13శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.46 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.13శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 1 శాతం డౌన్ అయ్యింది.
{{/usCountry}}ఆసియా స్టాక్ మార్కెట్లు సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర 100 డాలర్ల దిగువన ట్రేడ్ అవుతోంది. బ్రెంట్ క్రూడ్ ప్రస్తుతం. 0.5శాతం పడి బారెల్‌కు 97.8 డాలర్ల వద్ద ఉంది.
స్టాక్స్ టు బై..
ఎంసీఎక్స్- బై రూ. 2495- రూ. 3585, స్టాప్ లాస్ రూ. 3250, టర్గెట్ రూ. 4400
కరూర్ వైశ్య బ్యాంక్- బై రూ. 372, స్టాప్ లాస్ రూ. 348, టార్గెట్ రూ. 425
హావెల్స్- బై రూ. 1130, స్టాప్ లాస్ రూ. 1080, టార్గెట్ రూ. 1240
హెచ్డీఎఫ్సీ లైఫ- బై రూ. 567, స్టాప్ లాస్ రూ. 541, టార్గెట్ రూ. 610
యాక్సిస్ బ్యాంక్- బై రూ. 1325, స్టాప్ లాస్ రూ. 1250, టార్గెట్ రూ. 1455