...
...
Next Story

Stock market : మళ్లీ పెరుగుతున్న క్రూడ్- కానీ ఈ 3 స్టాక్స్​తో లాభాలకు ఛాన్స్!

నవంబర్ 6 2026, ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, ముడి చమురు ధర ఇక్కడ తెలుసుకోండి..

Published on: Nov 6, 2026, 08:15:06 IST
Advertisement

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 2009 పాయింట్లు పెరిగి 79,310 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 576 పాయింట్లు వృద్ధిచెంది 24,537 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 1860 పాయింట్లు పెరిగి 57,774 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్స్..

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​నకు చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి, ముడి చమురు ధరలో భారీ పతనం కారణంగా భారత స్టాక్​ మార్కెట్​లు గురువారం విపరీతంగా లాభాలను చూశాయి.

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 14,974.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,444.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50 టెక్నికల్ ఔట్​లుక్ బలంగా మారింది. 24,200 కీలక సపోర్ట్​గా ఉంది. 24,800- 25,000 లెవల్స్ కీలక రెసిస్టెన్స్​గా ఉంది. ఇప్పుడు బై-ఆన్-డిప్స్ స్ట్రాటజీని అనుసరించాలి,” అని ఎల్​కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భువా తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో అమెరికా స్టాక్​ మార్కెట్​లు భారీ నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 3.4 శాతం పతనమైంది. ఎస్​ అండ్​ పీ 500​ 4.6శాతం పడింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 5.52 శాతం డౌన్​ అయ్యింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ముడి చమురు ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ 1.1శాతం పెరిగి బ్యారెల్​కు 99 డాలర్లు దాటేసింది. గురువారం ఇది 94 డాలర్లకు వెళ్లింది.

స్టాక్స్​ టు బై..

బీబాక్స్- బై రూ. 860, స్టాప్​ లాస్​ రూ. 820, టార్గెట్​ రూ. 950

ఏంజిల్​ వన్- బై రూ. 328, స్టాప్​ లాస్​ రూ. 308, టార్గెట్​ రూ. 360

దలీలా (లీలా ప్యాలెసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్)- బై రూ. 695, స్టాప్​ లాస్​ రూ. 655, టార్గెట్​ రూ. 765

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

 

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks