ముహూరత్ ట్రేడింగ్ పిక్స్: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసిన 10 స్టాక్స్ ఇవే

ఇటీవల భారత ఈక్విటీ మార్కెట్లలో కన్సాలిడేషన్ కనిపించినప్పటికీ, రాబోయే 12 నెలల్లో నిఫ్టీ డబుల్ డిజిట్ రాబడులు ఇస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ధీమా వ్యక్తం చేసింది. ఈ దీపావళి ముహూరత్  ట్రేడింగ్ కోసం కోటక్ బ్యాంక్, అదానీ పోర్ట్స్ సహా 10 బలమైన షేర్లను కొనుగోలు చేయాలని బ్రోకరేజ్ సంస్థ రికమండ్ చేసింది.

Published on: Nov 4, 2026, 16:52:28 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

భారత ఈక్విటీ మార్కెట్లలో ఇటీవల హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ, మార్కెట్ మూలసూత్రాలు బలహీనపడలేదని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ (ICICI Securities) అభిప్రాయపడింది. విదేశీ మార్కెట్ల నుంచి ఎదురవుతున్న ఒత్తిడి వల్లే ఇటీవల అమ్మకాలు జరిగాయి తప్ప, దేశీయ కంపెనీల ఆదాయాల్లో ఎలాంటి లోపం లేదని స్పష్టం చేసింది.

ముహూరత్ ట్రేడింగ్ పిక్స్: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసిన 10 స్టాక్స్ ఇవే
ముహూరత్ ట్రేడింగ్ పిక్స్: ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రికమండ్ చేసిన 10 స్టాక్స్ ఇవే

రెండవ త్రైమాసికంలో కంపెనీల లాభాలు నిలకడగా నమోదు కావడం, వ్యాల్యుయేషన్లు సుదీర్ఘకాల సగటు కంటే ఆకర్షణీయమైన స్థాయికి చేరుకోవడం, దేశీయ ఆర్థిక చక్రం పుంజుకోవడంతో ఇన్వెస్టర్లకు మళ్లీ రిస్క్-రివార్డ్ నిష్పత్తి అనుకూలంగా మారుతోందని తెలిపింది.

రాబోయే 12 నెలల కాలంలో నిఫ్టీ 50 సూచీ రెండంకెల రాబడిని అందిస్తుందని బ్రోకరేజ్ సంస్థ అంచనా వేస్తోంది. ముఖ్యంగా ద్రవ్య లభ్యత, అధిక వ్యాల్యుయేషన్ల కంటే కంపెనీల ఆదాయాల ప్రదర్శనకే మార్కెట్ ప్రాధాన్యం ఇస్తున్న వేళ, నాణ్యమైన మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ షేర్లలో మంచి లాభాలు లభించే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.

ఈ క్రమంలో దీపావళి ముహూరత్ ట్రేడింగ్ కోసం 10 కీలక షేర్లను ఎంపిక చేసి ఇన్వెస్టర్లకు సూచించింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఎంపిక చేసిన 10 ముహూరత్ ట్రేడింగ్ షేర్లు ఇక్కడ చూడండి.

1. కోటక్ మహీంద్రా బ్యాంక్ (Kotak Mahindra Bank)

ఈ ప్రైవేట్ దిగ్గజ బ్యాంక్ రుణాలు 20 నుంచి 22 శాతం మేర వృద్ధి చెందుతాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేసింది. నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్లు కోలుకోవడం, క్రెడిట్ వ్యయాలు తగ్గడం వంటి అంశాలు ఆదాయాల వృద్ధికి దోహదపడతాయని తెలిపింది.

టార్గెట్ ప్రైస్: రూ. 540 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: వ్యాపార మిశ్రమంలో ప్రతికూల మార్పుల వల్ల మార్జిన్లు తగ్గడం, వ్యాపార వృద్ధి నెమ్మదించడం.

2. వీనస్ పైప్స్ అండ్ ట్యూబ్స్ (Venus Pipes and Tubes)

ఇటీవల ప్రాధాన్యత కేటాయింపుల (Preferential Allotment) ద్వారా ఈ కంపెనీ సేకరించిన నిధులతో రుణాలను చెల్లించనుంది. దీనివల్ల కంపెనీ బ్యాలెన్స్ షీట్ బలపడి, నెట్-డెట్ ఫ్రీ (అప్పులు లేని) స్థాయికి చేరుకుంటుంది. వడ్డీ ఖర్చులు తగ్గడం వల్ల ఈపీఎస్ (EPS) పెరుగుతుంది.

టార్గెట్ ప్రైస్: రూ. 2,340 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: పారిశ్రామిక రంగాలు తమ మూలధన వ్యయాన్ని (Capex) తగ్గించడం, గ్లోబల్ అనిశ్చితులు.

3. జైడస్ లైఫ్‌సైన్సెస్ (Zydus Lifesciences)

మున్ముందు రాబోయే నూతన ఔషధాల ఆవిష్కరణలు జైడస్ తదుపరి విడత వృద్ధికి దోహదపడతాయని బ్రోకరేజ్ తెలిపింది. అరుదైన వ్యాధుల (Rare and orphan diseases) విభాగాన్ని కంపెనీ సమర్థవంతంగా వినియోగించుకుంటోందని పేర్కొంది.

టార్గెట్ ప్రైస్: రూ. 1,480 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: ప్రత్యేక ఔషధాల విడుదల ఆలస్యం కావడం, పరిశోధన రంగానికి చేసే వ్యయాలపై ఆశించిన స్థాయిలో రాబడులు రాకపోవడం.

4. నియోజెన్ కెమికల్స్ (Neogen Chemicals)

దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) బ్యాటరీల తయారీ రంగంలో నియోజెన్ కెమికల్స్ కీలక పాత్ర పోషించనుంది. ఎలక్ట్రోలైట్లు, సాల్ట్స్ తయారీలో కంపెనీకి ఉన్న నైపుణ్యం బ్యాటరీ రంగానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ విశ్లేషించింది.

టార్గెట్ ప్రైస్: రూ. 2,765 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: బ్యాటరీ కెమికల్స్ బిజినెస్ విస్తరణలో జాప్యం, బ్రోమిన్, లిథియం వంటి కీలక ముడి పదార్థాల ధరల్లో హెచ్చుతగ్గులు.

5. ఇన్ఫో ఎడ్జ్ (Info Edge)

కంపెనీ రెవెన్యూ సీఏజీఆర్ (CAGR) 14.8 శాతంగా నమోదు కానుందని, మార్జిన్లు 44 శాతానికి పెరుగుతాయని బ్రోకరేజ్ అంచనా వేసింది. రిక్రూట్‌మెంట్ విభాగానికి డిమాండ్ పెరగడం, ఏఐ ఆధారిత ఫీచర్లతో ఆదాయం పుంజుకోవడం, 99acres బిజినెస్ లాభాల్లోకి రావడం ప్లస్ పాయింట్లు.

టార్గెట్ ప్రైస్: రూ. 1,530 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: ఉద్యోగుల నియామకాల రంగం ఆశించిన స్థాయిలో కోలుకోకపోవడం.

6. సారెగమ ఇండియా (Saregama India)

ఆపరేటింగ్ లీవరేజ్ కారణంగా సారెగమ ఎబిటా (EBITDA) మార్జిన్లు 35.5 శాతానికి చేరనున్నాయి. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ల ద్వారా వచ్చే ఆదాయం కంపెనీ వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారనుంది.

టార్గెట్ ప్రైస్: రూ. 650 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: మ్యూజిక్ లైసెన్సింగ్ వృద్ధి తగ్గడం, సినిమాల నిర్మాణం వల్ల నష్టాలు పెరగడం.

7. అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ (Adani Ports & SEZ)

కంపెనీ తమ మూలధన వ్యయం (Capex) మార్గదర్శకాలను రూ. 15,000 - 17,000 కోట్లకు పెంచింది. ముంద్రా, ధమ్రా, విళింజం, హజీరా రేవుల విస్తరణకు ఈ నిధులు వెచ్చిస్తారు. 'అంబిషన్ 2031' కింద తమ కార్గో సామర్థ్యాన్ని 1 బిలియన్ మెట్రిక్ టన్నులకు (MMT) రెట్టింపు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.

టార్గెట్ ప్రైస్: రూ. 2,210 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ప్రభుత్వ అనుమతుల్లో ఆలస్యం.

8. అపోలో మైక్రో సిస్టమ్స్ (Apollo Micro Systems)

ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో అదనంగా 26 శాతం వాటా కొనుగోలు ప్రక్రియ సాగుతోంది. డిఫెన్స్ రంగానికి ఆటోమేషన్ సేవలు అందించే ఈ కంపెనీ వ్యాల్యుయేషన్ పరంగా ఆకర్షణీయంగా ఉంది.

టార్గెట్ ప్రైస్: రూ. 485 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: ప్రభుత్వ కాంట్రాక్టులపైనే ఎక్కువగా ఆధారపడటం, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు.

9. ఎథోస్ (Ethos)

లగ్జరీ వాచ్‌ల రీటైలర్ అయిన ఎథోస్ బ్యాలెన్స్ షీట్ చాలా బలంగా ఉందని, రిటర్న్ ప్రొఫైల్ (RoCE 16.2%, RoIC 18.2%) చాలా ఆరోగ్యకరంగా ఉంటుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ వెల్లడించింది.

టార్గెట్ ప్రైస్: రూ. 3,180 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: స్విస్ ఫ్రాంక్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడం, తీవ్రమైన పోటీ.

10. ఇండియన్ హోటల్స్ (Indian Hotels)

హోటల్ గదుల నవీకరణ, ఒక గది ద్వారా వచ్చే రాబడి (RevPAR) పెరగడం, అంతర్జాతీయ బిజినెస్ మెరుగుపడటంతో మార్జిన్లు 35 శాతానికి చేరతాయని బ్రోకరేజ్ భావిస్తోంది.

టార్గెట్ ప్రైస్: రూ. 990 (రేటింగ్: BUY)

కీలక రిస్కులు: అనూహ్య ఘటనల వల్ల గదులకు డిమాండ్ తగ్గడం, ప్రాజెక్టుల ప్రారంభంలో జాప్యం.

(గమనిక: ఈ విశ్లేషణ కేవలం ఇన్వెస్టర్ల అవగాహన కోసం ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రచురితమైంది. ఇది పెట్టుబడి సలహా కాదు. స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు రిస్క్‌తో కూడుకున్నవి. మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు సర్టిఫైడ్ ఆర్థిక నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరం.)

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More