Stock market : మళ్లీ పెరుగుతున్న క్రూడ్- కానీ ఈ 3 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
నవంబర్ 6 2026, ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 2009 పాయింట్లు పెరిగి 79,310 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 576 పాయింట్లు వృద్ధిచెంది 24,537 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1860 పాయింట్లు పెరిగి 57,774 వద్దకు చేరింది.

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు చెందిన రిపబ్లికెన్ పార్టీ ఓటమి, ముడి చమురు ధరలో భారీ పతనం కారణంగా భారత స్టాక్ మార్కెట్లు గురువారం విపరీతంగా లాభాలను చూశాయి.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 14,974.68 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 10,444.54 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 160 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 టెక్నికల్ ఔట్లుక్ బలంగా మారింది. 24,200 కీలక సపోర్ట్‌గా ఉంది. 24,800- 25,000 లెవల్స్ కీలక రెసిస్టెన్స్‌గా ఉంది. ఇప్పుడు బై-ఆన్-డిప్స్ స్ట్రాటజీని అనుసరించాలి,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ టెక్నికల్ ఎనలిస్ట్ వత్సల్ భువా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 3.4 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 4.6శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 5.52 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర పెరుగుతోంది. బ్రెంట్ క్రూడ్ 1.1శాతం పెరిగి బ్యారెల్‌కు 99 డాలర్లు దాటేసింది. గురువారం ఇది 94 డాలర్లకు వెళ్లింది.
స్టాక్స్ టు బై..
బీబాక్స్- బై రూ. 860, స్టాప్ లాస్ రూ. 820, టార్గెట్ రూ. 950
ఏంజిల్ వన్- బై రూ. 328, స్టాప్ లాస్ రూ. 308, టార్గెట్ రూ. 360
దలీలా (లీలా ప్యాలెసెస్ హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్)- బై రూ. 695, స్టాప్ లాస్ రూ. 655, టార్గెట్ రూ. 765
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


