Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- రిలయన్స్ షేర్ ప్రైజ్ టార్గెట్ ఇదే..
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 374 పాయింట్లు పడి 76,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 141 పాయింట్లు కోల్పోయి 23,914 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 238 పాయింట్లు పడి 57,172 వద్దకు చేరింది.
ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
బుధవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 6,688.37 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,812.98 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 95 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. డౌ జోన్స్ 0.50 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.46శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.23 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
బ్రెంట్ క్రూడ్ 0.45శాతం పడి బ్యారెల్‌కి 95.20 డాలర్లకు చేరింది.
స్టాక్స్ టు బై..
మీషో- బై రూ. 212, స్టాప్ లాస్ రూ. 204, టార్గెట్ రూ. 227
ఆంథెమ్ బయోసైన్సెస్- బై రూ. 934, స్టాప్ లాస్ రూ. 901, టార్గెట్ రూ. 999
రిలయన్స్ ఇండస్ట్రీస్- బై రూ. 1319, స్టాప్ లాస్ రూ. 1300, టార్గెట్ రూ. 1350
పరాస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్- బై రూ. 1413, స్టాప్ లాస్ రూ. 1380, టార్గెట్ రూ. 1460
కోల్ ఇండియా- బై రూ. 417, స్టాప్ లాస్ రూ. 410, టార్గెట్ రూ. 430
జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ- బై రూ. 539.80, స్టాప్ లాస్ రూ. 528, టార్గెట్ రూ. 564
క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ- బై రూ. 863, స్టాప్ లాస్ రూ. 844, టార్గెట్ రూ. 910
మార్క్సాన్స్ ఫార్మా- బై రూ. 332.5, స్టాప్ లాస్ రూ. 325, టార్గెట్ రూ. 350
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


