Stocks to buy today : ట్రేడర్స్ అలర్ట్- ఎన్​టీపీసీ షేర్​ ప్రైజ్ టార్గెట్ ఇదే!

Stocks to buy today : ఆగస్టు 14, 2026 ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై, బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ని ఇక్కడ తెలుసుకోండి..

Published on: Aug 14, 2026, 08:15:38 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 114 పాయింట్లు పెరిగి 78,080 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 40 పాయింట్లు కోల్పోయి 24,397 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 251 పాయింట్లు పడి 57,635 వద్దకు చేరింది.

స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్..
స్టాక్ మార్కెట్ న్యూస్ అప్డేట్స్..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 510.69 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 4,353.09 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​ స్వల్ప లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 6405 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

అని హెచ్​డీఎఫ్​సీ సెక్యూరిటీస్​కి చెందిన సీనియర్​ టెక్నికల్​ రీసెర్చ్​ ఎనలిస్ట్​ నాగరాజ్​ శెట్టి తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

గురువారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్​ మార్కెట్​లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 0.13 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 0.65శాతం వృద్దిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 0.81 శాతం పెరిగింది.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

ముడి చమురు ధర..

బ్రెంట్ క్రూడ్ 0.3శాతం డౌన్ అయ్యి బ్యారెల్​కి 86.7 డాలర్లకు చేరింది.

స్టాక్స్ టు బై టుడే..

ఎన్​టీపీసీ- బై రూ. 344, స్టాప్​ లాస్​ రూ. 336, టార్గెట్​ రూ. 362

తేజస్ నెట్​వర్క్స్- బై రూ. 540, స్టాప్​ లాస్​ రూ. 528, టార్గెట్​ రూ. 565

రేమండ్స్- బై రూ. 642, స్టాప్​ లాస్​ రూ. 630, టార్గెట్​ రూ. 675

బ్రేకౌట్ స్టాక్స్​ టు బై..

జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్- బై రూ. 571, స్టాప్​ లాస్​ రూ. 543, టార్గెట్​ రూ. 620

జీహెచ్​సీఎల్ టెక్స్​టైల్స్- బై రూ. 121.5, స్టాప్​ లాస్​ రూ. 115.7, టార్గెట్​ రూ. 131

ఆథమ్ ఇన్వెస్టమెంట్ అండ్ ఇన్​ఫ్రా- బై రూ. 579, స్టాప్​ లాస్​ రూ. 547, టార్గెట్​ రూ. 630

జ్ఞాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్- బై రూ. 2709, స్టాప్​ లాస్​ రూ. 2555, టార్గెట్​ రూ. 2929

భారత్ సీట్స్- బై రూ. 245, స్టాప్​ లాస్​ రూ. 231, టార్గెట్​ రూ. 264

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More