Stock market : దూసుకెళుతున్న భారత స్టాక్ మార్కెట్లు- ఈ 5 స్టాక్స్‌తో లాభాలకు ఛాన్స్!
నవంబర్ 20, 20226 ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, ముడి చమురు ధర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 990 పాయింట్లు పెరిగి 83,022 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 286 పాయింట్లు వృద్ధిచెంది 25,514 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 1024 పాయింట్లు పెరిగి 63,063 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో డీఐఐలు రూ. 1,356.57 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో ఎఫ్ఐఐలు రూ. 7,411.41 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 150 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50 బుల్లిష్‌గా దూసుకెళుతోంది. 25,500 లెవల్ని సస్టైన్ చేయగలిగితే సూచీ 25,900- 26,000 వరకు వెళ్లొచ్చు. 25,200 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్‌కి చెందిన సీనియర్ టెక్నికల్ రీసెర్చ్ ఎనలిస్ట్ నాగరాజ్ శెట్టి తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 2.2 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 2శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.3 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ముడి చమురు ధర..
అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ స్వల్పంగా పెరిగి బ్యారెల్‌కు 92.4 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది.
స్టాక్స్ టు బై..
ఎం అండ్ ఎం- బై రూ. 3509, స్టాప్ లాస్ రూ. 3400, టార్గెట్ రూ. 3730
బ్యాంక్ ఆఫ్ బరోడా- బై రూ. 285, స్టాప్ లాస్ రూ. 275, టార్గెట్ రూ. 305
గేబ్రియల్- బై రూ. 1590, స్టాప్ లాస్ రూ. 1500, టార్గెట్ రూ. 1750
ఎంఎస్యూఎంఐ- బై రూ. 41.3, స్టాప్ లాస్ రూ. 39, టార్గెట్ రూ. 45
గోద్రేజ్ సీపీ- బై రూ. 932, స్టాప్ లాస్ రూ. 850, టార్గెట్ రూ. 1040
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


